సాధారణంగా భోజనంలో అన్నం, కూర, పప్పు, చట్నీ, సాంబార్, పెరుగు ఇవి ఉంటాయి. వీటిలో కొన్నింటిని కలిపి తీసుకోవడం వల్ల ఆహార పదార్థాల రుచి పెరుగుతుంది. అయితే కొన్ని పదార్థాలు మాత్రం కలిపి తినడం వల్ల తీవ్ర ఆరోగ్య (Health) సమస్యలు తలెత్తుతాయి. ఇలా చేయడం వల్ల మన జీర్ణవ్యవస్థలో పెను మార్పులు సంభవిస్తాయి. సరిగ్గా డైజెస్ట్ అవ్వక తీవ్ర పరిణామాలకు కదారి తీస్తాయతి. ఈ క్రమంలో పాలు లేదా పాల పదార్థాలను చేపల కాంబినేషన్ ను అస్సలు తీసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. అయితే చాలామందికి ఈ విషయం తెలియక అధిక వీటిని తింటూ ఉంటారు. పాలు, చేపల కాంబినేషన్ ఎంతో ప్రమాదకరం. ఈ కాంబినేషన్‌ను తినడం వల్ల చర్మ వ్యాధులు (Skin Diseases) వచ్చే ఆస్కారం ఉంది. ఆయుర్వేదంలో చేప, పాలు రెండు విధాలుగా శరీరంలో ప్రభావం చూపిస్తాయి. పాలు కూలింగ్ ఎఫెక్ట్‌గా పని చేయగా.. చేపలు హీటింగ్ ఎఫెక్ట్‌గా ఉంటుంది. వీటి కాంబినేషన్ బ్యాలెన్స్ చేయలేనివిగా ఉంటుంది. వీటిని కలిపి తీసుకుంటే శరీరంలో కొన్ని మార్పులు జరుగుతాయి. అందుకే వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ కలిపి తినవద్దని ఆయుర్వేదం కూడా చెబుతోంది.
వీటిని కాంబినేషన్ గా కాకుండా విడివిడిగా చూస్తే అద్భుత ప్రయోజనాలు ఉన్నాయి. మాంసాహారం పదార్థాల్లో చేపలు ప్రత్యేకమైనవి. దీనిలో ఉండే ఓమేగా 3 ఫ్యాటీ ఆమ్లాల వల్ల చేపను సూపర్ ఫుడ్‌గా పిలుస్తారు. ఇది మెదడు ఆరోగ్యానికి ఎంతో సహాయపడుతుంది. చేపల్లో ప్రోటీన్ మాత్రమే కాకుండా విటమిన్- డి శరీరానికి ఉపయోగపడుతుంది. జీవక్రియలు సక్రమంగా జరగడానికి డి-విటమిన్ చాలా అవసరం. విటమిన్ డెఫిషియెన్సీతో బాధపడే వారు తప్పకుండా చేపలను తినాలని ఆరోగ్య నిపుణుల సూచిస్తున్నారు. అంతే కాకుండా చేపలు కంటి ఆరోగ్యాన్నీ మెరుగుపరుస్తాయి.
మరోవైపు.. ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా వినియోగించే ఆహార పదార్థాల్లో పాలు ముందు స్థానంలో ఉంది. మాంసాహారం నుంచి పొందలేని పోషకాలను పాల ద్వారా పొందవచ్చు. అందుకే పాలను సంపూర్ణాహారం అని పిలుస్తారు. పాలలో ఉండే కాల్షియం పిల్లల ఎదుగుదలకే కాకుండా ఎముకలు బలంగా ఉండేందుకు సహాయపడుతుంది. పాలే కాకుండా పాల నుంచి తయారు చేసిన పదార్థాలు కూడా ఇంతే ఉపయోగాలన్నిస్తుంది.
నోట్.. ఈ కథనంలో పేర్కొన్న అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు నిపుణుల సూచనలు తీసుకోవడం ఉత్తమం.
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి