Parenting Tips: ఎదిగే పిల్లలతో ఆ విషయాలు చర్చిస్తున్నారా…. మోహమాటం వదిలేసి మనస్పూర్తిగా మాట్లాడండి..
లైంగిక ఆరోగ్యం గురించి పిల్లలతో మాట్లాడడం చాలా ఇబ్బందిగా అనిపించినప్పటికీ.. ఈ విషయాల గురించి వారితో మాట్లాడాల్సిన అవసరం చాలా ఉంది. అంతే కాదు.. ఇది అవసరం కంటే ఎక్కువ. తల్లిదండ్రులు..

లైంగిక ఆరోగ్యం గురించి పిల్లలతో మాట్లాడడం చాలా ఇబ్బందిగా అనిపించినప్పటికీ.. ఈ విషయాల గురించి వారితో మాట్లాడాల్సిన అవసరం చాలా ఉంది. అంతే కాదు.. ఇది అవసరం కంటే ఎక్కువ. తల్లిదండ్రులు తమ పిల్లలతో సెక్స్ గురించి మాట్లాడేటప్పుడు సిగ్గుపడటమో.. లేక ఆ టాపిక్ ను దాటవేయడమో వంటివి చేస్తుంటారు. కానీ పిల్లలకు సెక్స్‌పై అవగాహన కల్పించేందుకు తల్లిదండ్రులకు చాలా అవసరం. లైంగిక అవసరాలకు సంబంధించి సరైన ఆరోగ్యకరమైన సంభాషణను తెలియజేయడం చాలా ముఖ్యం. ముఖ్యంగా ఈ డిజిటల్ యుగంలో యువకులు తరచుగా సెక్స్టింగ్‌లో పాల్గొంటారు. వాస్తవానికి.. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ 2017 అధ్యయనం ప్రకారం.. 40.5% మంది పురుషులు, 30.6% మంది స్త్రీలు లైంగిక సంభాషణలో నిమగ్నమయ్యారు.
ఆరోగ్యకరమైన సంబంధం ఎలా ఉంటుందో పిల్లలతో మాట్లాడటం ప్రారంభించాలి. సెక్స్ విషయాల గురించి ప్రస్తావించకుండా మంచి డిజిటల్ పౌరుడిగా ఎలా ఉండాలనే దాని గురించి వారితో మాట్లాడటం అవసరం. సెక్స్‌కు సంబంధించి ఎదుర్కొనే అన్ని అవకాశాల గురించి మాట్లాడాలి. పిల్లలకు సులభంగా అర్థం అయ్యేందుకు అప్పుడప్పుడు జోక్స్ వేయడం వంటివి చేయాలి. పిల్లలు కౌమర దశలో ఉన్నప్పుడు సెక్స్ కు సంబంధించిన విషయాల పట్ల ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. అలాంటి పరిస్థితుల్లో వారు చేస్తున్న పని పట్ల తల్లిదండ్రులు భయపడాల్సిన అవసరం లేదు. వారితో ఏదైనా చెప్పే ముందు ప్రశాంతంగా ఉండాలి. అతిగా ప్రతిస్పందిస్తే.. పిల్లలు భయపడే అవకాశం ఉంది. ఇది భవిష్యత్తులో వారికి తీవ్రంగా హాని కలిగించవచ్చు.
మీ పిల్లలతో వాట్-ఇఫ్‌ల గేమ్ ఆడటం, ఎవరైనా నగ్నంగా వారిపై ఒత్తిడి చేస్తే ఏమి చేస్తారని ప్రశ్నించడం వంటివి చేయాలి. ఆ విషయాలను వీలైనంత కామన్ గా చేసేందుకు ప్రయత్నించాలి. పిల్లలు వారి ఫోన్‌లలో నగ్న ఫోటోలు లేదా ఎవరైనా మైనర్ ఫోటోలు కలిగి ఉంటే, ఆ చిత్రాన్ని ఎందుకు తొలగించాలో వివరించాలి. కానీ మీరు చెప్పే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. టీనేజ్‌తో కష్టతరమైన సంబంధం ఉన్నట్లయితే.. పెద్దవారు జోక్యం తీసుకోవడం చాలా అవసరం.




నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.



