Biotin Rich Foods: జుట్టు మాటిమాటికి ఊడిపోతుందా? అయితే మీ ఆహారంలో ఈ చిన్న మార్పు చేసుకోండి..
అమ్మాయిలు జుట్టు, చర్మంను ప్రత్యేకంగా చూసుకుంటారు. కానీ జుట్టు, చర్మం, గోళ్లను ఆరోగ్యంగా ఉంచడానికి బయోటిన్ లేదా విటమిన్ B7 చాలా అవసరం. మీరు తినే ఆహారంలోని బయోటిన్ కంటెంట్ తీసుకుంటే.. అది ప్రోటీన్, కొవ్వు, కార్బోహైడ్రేట్‌లను గ్లూకోజ్‌గా మార్చి మీ జుట్టుకు, చర్మానికి మేలు చేస్తుంది. ముఖ్యంగా జుట్టు చక్కగా పెరగాలంటే, బయోటిన్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం చాలా అవసరం..

నేటి కాలంలో జుట్టు రాలడం ఓ సాధారణ సమస్యగా మారింది. అధికంగా జుట్టు రాలడం వల్ల బట్టతల త్వరగా వచ్చేస్తుంది. దీంతో ఈ సమస్య నుండి బయటపడటానికి మార్కెట్లో లభించే షాంపూలు, ఇతర ఉత్పత్తులను ఉపయోగింస్తుంటారు. కానీ జుట్టు రాలడం సమస్యను ఇవి తగ్గించడానికి బదులు మరింత తీవ్రతరం చేస్తాయి. ఈ సమస్యను నివారించడానికి పోషకాహారం తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. బయోటిన్ లేదా విటమిన్ బి7 ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జుట్టు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇది జుట్టు మందంగా పెరగడానికి, గోర్లు బలంగా పెరగడానికి సహాయపడుతాయి. ఏయే ఆహారాలో ఇక్కడ తెలుసుకుందాం..
చిలగడదుంప
చిలగడదుంపలలో బయోటిన్, బీటా కెరోటిన్ అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి విటమిన్ ఎ ని అందిస్తుంది. అలాగే ఇందులోని విటమిన్ ఎ ఆరోగ్యకరమైన చర్మం, కణాల ఉత్పత్తికి ముఖ్యమైనది. ఇది ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు కూడా దోహదం చేస్తుంది. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. జుట్టును బలపరుస్తుంది.
పాలకూర
ఆకుపచ్చ కూరగాయలలో ఒకటైన పాలకూరలో బయోటిన్, ఐరన్, ఫోలేట్ పుష్కలంగా ఉంటాయి. వీటి రెగ్యులర్ వినియోగం జుట్టు పెరుగుదలకు కూడా సహాయపడుతుంది. ఇది ఆరోగ్యకరమైన జుట్టును నిర్వహించడానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. జుట్టు చివరలను బలోపేతం చేస్తుంది. జుట్టు పొడవుగా పెరుగుతుంది. అందువల్ల, పాలకూరను సలాడ్లలో సైడ్ డిష్‌గా, రోజువారీ భోజనంలో ఇతర మార్గాల్లో తీసుకోవచ్చు.
మాంసం, సముద్ర ఆహారం
మాంసం, సముద్ర ఆహారం కూడా ప్రోటీన్, బయోటిన్ ఉత్తమ వనరులలో ముఖ్యమైనవి. వీటిలో బయోటిన్ అధిక స్థాయిలో ఉంటుంది. మాంసం, సముద్ర ఆహారం తీసుకోవడం కూడా జుట్టు ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
గుడ్లు
గుడ్లలో బయోటిన్ పుష్కలంగా ఉంటుంది. అందువల్ల, జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి ఇది మంచి ఆహారం. ఒక గుడ్డులో దాదాపు 10 మైక్రోగ్రాముల బయోటిన్ ఉంటుంది. గుడ్లలో ప్రోటీన్, జింక్, ఐరన్ ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన జుట్టుకు ముఖ్యమైనవి.
గింజలు, విత్తనాలు
వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్, యాంటీఆక్సిడెంట్లు, బయోటిన్ పుష్కలంగా ఉంటాయి. వీటిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఈ గింజలు, డ్రై ఫ్రూట్స్ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జుట్టు రాలడాన్ని నివారిస్తుంది, జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.