Sunflower Seeds: సన్ ఫ్లవర్ సీడ్స్ తింటున్నారా.. ఈ విషయాలు మీ కోసమే!

సన్ ఫ్లవర్ సీడ్స్‌ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఈ మధ్య కాలంలో సీడ్స్ ఎక్కువగా తీసుకోమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వాటిల్లో ఇవి కూడా ఒకటి. పొద్దు తిరుగుడు పూల నుంచి ఈ విత్తనాలను సేకరిస్తారు. వీటిల్లో అనేక పోషకాలు లభిస్తాయి. ఈ విత్తనాలను డ్రై ఫ్రూట్స్‌లో కూడా యాడ్ చేసుకుని తినవచ్చు. ఎక్కువగా వీటి నుంచి నూనె తీస్తారు. వీటిని వంటల్లో కూడా ఉపయోగించుకుంటున్నాం. ఈ పొద్దు తిరుగుడు గింజలు..

Sunflower Seeds: సన్ ఫ్లవర్ సీడ్స్ తింటున్నారా.. ఈ విషయాలు మీ కోసమే!
Sunflower Seeds

Updated on: Aug 28, 2024 | 5:21 PM

సన్ ఫ్లవర్ సీడ్స్‌ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఈ మధ్య కాలంలో సీడ్స్ ఎక్కువగా తీసుకోమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వాటిల్లో ఇవి కూడా ఒకటి. పొద్దు తిరుగుడు పూల నుంచి ఈ విత్తనాలను సేకరిస్తారు. వీటిల్లో అనేక పోషకాలు లభిస్తాయి. ఈ విత్తనాలను డ్రై ఫ్రూట్స్‌లో కూడా యాడ్ చేసుకుని తినవచ్చు. ఎక్కువగా వీటి నుంచి నూనె తీస్తారు. వీటిని వంటల్లో కూడా ఉపయోగించుకుంటున్నాం. ఈ పొద్దు తిరుగుడు గింజలు చేసే మేలు అంతా ఇంతా కాదు. చర్మం, జుట్టు. ఎముకలు, గుండె, వెయిట్ లాస్ అయ్యేందుకు ఈ విత్తనాలు ఎంతో బాగా హెల్ప్ చేస్తాయి. ఇందులో శరీరానికి అవసరం అయ్యే పోషకాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా గుడ్ కొలెస్ట్రాల్‌ను పెంచే కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. మరి ఈ సీడ్స్ తినడం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

రక్త పోటు నియంత్రణ:

తరచుగా సన్ ఫ్లవర్ సీడ్స్ తినడం వల్ల రక్త పోటు అనేది నియంత్రణలో ఉంటుంది. ఎందుకంటే ఇందులో మెగ్నీషియం మెండుగా లభిస్తుంది. ఇది బీపీ స్థాయిలను కంట్రోల్ చేస్తుంది. రక్త పోటు తగ్గితే గుండె సంబంధిత సమస్యల ప్రమాదం కూడా తగ్గుతుంది.

బ్యాడ్ కొలెస్ట్రాల్‌ని కరిగిస్తుంది:

శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను కరిగించడంలో పొద్దు తిరుగుడు విత్తనాలు ఎంతో చక్కగా పని చేస్తాయి. వీటిల్లో ఆరోగ్యాన్ని పెంచే మంచి కొవ్వులు ఉంటాయి. మోనోశాచురేటెడ్, పాలీ అన్ శాచురేటెడ్, యాంటీ ఆక్సిడెంట్లు వంటివి ఉంటాయి ఉంటాయి. ఇవి శరీరంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్‌ని కరిగించి గుడ్ కొలెస్ట్రాల్ లెవల్స్ ను పెంచుతాయి.

ఇవి కూడా చదవండి

ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది:

సన్ ఫ్లవర్‌‌ సీడ్స్‌లో ఎంతో శక్తి వంతమైన యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. ఇవి శరీరానికి హానాి చేసే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి నశించేస్తుంది. వీటి వల్ల క్యాన్సర్ కణాలు కూడా పెరగకుండా ఉంటాయి. శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.

యంగ్‌గా ఉంటారు:

వయసు పెరిగే కొద్దీ ముఖంపై వృద్ధాప్య సంకేతాలు పెరగడం కామన్. ముఖంపై ముడతలు వచ్చి చర్మం జారిపోయి డల్‌గా కనిపిస్తుంది. కానీ ప్రతి రోజూ సన్ ఫ్లవర్ సీడ్స్ తింటే ఖచ్చితంగా యంగ్‌గా కనిపిస్తారు. చర్మాన్ని కాంతివతంగా మారుతుంది. అదే విధంగా రక్త ప్రసరణను మెరుగు పరుస్తుంది. జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..