AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hair Fall Control Foods: ఏం తింటే జుట్టు రాలడం తగ్గుతుందో తెలుసుకోండి..

జుట్టు ఒత్తుగా, పొడుగ్గా, బలంగా ఉండాలని ప్రతీ అమ్మాయి కోరుకుంటుంది. కానీ ప్రస్తుతం ఉన్న ఈ రోజుల్లో ఆహారం, నీరు కూడా కలుషితం అవుతున్నాయి. ఈ కాలంలో జుట్టు ఆరోగ్యంగా బలంగా ఉండాలంటే కాస్త కష్టమే. కానీ మీరు కాస్త జాగ్రత్తలు పాటిస్తే జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. జుట్టును ఒత్తుగా, పొడుగ్గా పెంచే చిట్కాలు ఇప్పటికే ఎన్నో తెలుసుకున్నాం. మరిన్ని కొత్త చిట్కాలు ఇప్పుడు మీ ముందుకు తీసుకొచ్చాం. జుట్టు రాలడానికి ఒక్క కారణం..

Hair Fall Control Foods: ఏం తింటే జుట్టు రాలడం తగ్గుతుందో తెలుసుకోండి..
Hair Fall Control Foods
Chinni Enni
|

Updated on: Aug 28, 2024 | 6:30 PM

Share

జుట్టు ఒత్తుగా, పొడుగ్గా, బలంగా ఉండాలని ప్రతీ అమ్మాయి కోరుకుంటుంది. కానీ ప్రస్తుతం ఉన్న ఈ రోజుల్లో ఆహారం, నీరు కూడా కలుషితం అవుతున్నాయి. ఈ కాలంలో జుట్టు ఆరోగ్యంగా బలంగా ఉండాలంటే కాస్త కష్టమే. కానీ మీరు కాస్త జాగ్రత్తలు పాటిస్తే జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. జుట్టును ఒత్తుగా, పొడుగ్గా పెంచే చిట్కాలు ఇప్పటికే ఎన్నో తెలుసుకున్నాం. మరిన్ని కొత్త చిట్కాలు ఇప్పుడు మీ ముందుకు తీసుకొచ్చాం. జుట్టు రాలడానికి ఒక్క కారణం అంటూ చెప్పలేం. చాలా రకాల కారణాల వల్ల జుట్టు విపరీతంగా రాలిపోతుంది. వాతావరణ మార్పుల కారణంగా కూడా జుట్టు అనేది రాలుతూ ఉంటుంది. జుట్టు సంరక్షణతో పాటు మీరు రోజు వారీ ఆహారంలో కొన్ని రకాల మార్పులు చేసుకోవడం వల్ల జుట్టు రాలకుండా చూసుకోవచ్చు. జుట్టు రాలకుండా ఉండేందుకు ఏం తినాలో ఇప్పుడు చూద్దాం.

గుడ్లు:

జుట్టు బలంగా ఉండేందుకు ప్రోటీన్ ఎంతో హెల్ప్ చేస్తుంది. గుడ్లలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి. ఇది జుట్టు పెరిగేందుకు సహాయ పడుతుంది. వీటితో పాటు కెరాటిన్, బయోటిన్ కూడా ఉంటాయి. ఇవి జుట్టు కుదుళ్లు స్ట్రాంగ్‌గా ఉండేలా చేస్తాయి. కాబట్టి ప్రతి రోజూ ఓ గుడ్డు తినడం అలవాటు చేసుకోండి.

పాలకూర:

పాల కూరలో కూడా ఎన్నో రకాల పోషకాలు లభిస్తాయి. విటమిన్ బి, ఐరన్‌తో పాటు ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పాల కూర జుట్టును బలంగా ఉంచడంలో ఎంతో చక్కగా పని చేస్తుంది. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. అంతే కాకుండా శరీరంలో ఇమ్యూనిటీని కూడా పెంచి.. ఇతర వ్యాధులతో పోరాడే శక్తిని ఇస్తుంది.

ఇవి కూడా చదవండి

నట్స్:

ప్రతి రోజూ ఓ గుప్పెడు డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని తెలిసిన విషయమే. వీటిని తినడం వల్ల జట్టు కూడా బలంగా, దృఢంగా మారుతుంది. జుట్టు రాలకుండా కుదుళ్లను బలపరుస్తుంది. ఇంకా ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

చేపలు:

చేపలు తినడం వల్ల కూడా అనేక పోషకాలు అందుతాయి. ఇందులో ఎక్కువగా ప్రోటీన్స్, ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఏ ఉంటుంది. ఇవన్నీ జుట్టుకు మంచి బలాన్ని అందిస్తాయి. ఇవి తలను ఆరిపోకుండా.. జుట్టు మందంగా ఉండేలా చేయడంలో సహాయ పడుతుంది.

మెంతులు:

ప్రతి రోజూ రాత్రి పూట నానబెట్టిన మెంతుల్ని తినడం వల్ల కూడా జుట్టు సమస్యలు, చర్మ సమస్యలు అనేవి దాదాపుగా తగ్గిపోతాయి. జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో మెంతులు ఎంతో చక్కగా పని చేస్తాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
శ్రీవారి ప్రసాదాల కల్తీకి చెక్.. తిరుమలలో అత్యాధునిక ల్యాబ్
శ్రీవారి ప్రసాదాల కల్తీకి చెక్.. తిరుమలలో అత్యాధునిక ల్యాబ్
హైదరాబాద్‌లో ఉంటున్న ఉద్యోగులకు కేంద్రం శుభవార్త
హైదరాబాద్‌లో ఉంటున్న ఉద్యోగులకు కేంద్రం శుభవార్త
మీ వాష్ బేసిన్ పసుపు రంగులోకి మారిందా? డోంట్ వర్రీ.. ఇలా చేయండి!
మీ వాష్ బేసిన్ పసుపు రంగులోకి మారిందా? డోంట్ వర్రీ.. ఇలా చేయండి!
ఈ ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ రికార్డు ఎవరైనా బద్దలు కొడతారా?
ఈ ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ రికార్డు ఎవరైనా బద్దలు కొడతారా?
అరుదైన గ్రహల కలయిక.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే
అరుదైన గ్రహల కలయిక.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే
మహిళా సంఘాలకు సూపర్ న్యూస్.. ఆడబిడ్డల దశ మార్చే నిర్ణయం..
మహిళా సంఘాలకు సూపర్ న్యూస్.. ఆడబిడ్డల దశ మార్చే నిర్ణయం..
రేషన్ కార్డు ఉన్నవారికి పండుగలాంటి వార్త.. ప్రతీఒక్కరికీ డబ్బులు
రేషన్ కార్డు ఉన్నవారికి పండుగలాంటి వార్త.. ప్రతీఒక్కరికీ డబ్బులు
రెడ్ vs గ్రీన్ క్యాప్సికమ్: ఏది ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది
రెడ్ vs గ్రీన్ క్యాప్సికమ్: ఏది ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది
పచ్చి కూరగాయల స్వీట్ హల్వా .. ఒక్కసారి తింటే మర్చిపోలేని రుచి
పచ్చి కూరగాయల స్వీట్ హల్వా .. ఒక్కసారి తింటే మర్చిపోలేని రుచి
రేషన్ కార్డు ఉన్నవారికి ప్రభుత్వం నుంచి సూపర్ న్యూస్
రేషన్ కార్డు ఉన్నవారికి ప్రభుత్వం నుంచి సూపర్ న్యూస్