Soybeans: సోయా బీన్స్‌ తింటే.. ఇన్ని సమస్యలకు దూరంగా ఉండొచ్చు..

|

Aug 01, 2024 | 2:10 PM

సోయా బీన్స్ గురించి తక్కువ మందికే తెలుసు. సోయా బీన్స్‌తో కూడా చాలా రకాల వంటకాలు తయారు చేసుకోవచ్చు. వీటితో చేసిన రెసిపీలు ఎంతో రుచిగా ఉంటాయి. అంతే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. సోయా బీన్స్‌లో శరీరానికి కావాల్సిన పోషకాలు అన్నీ లభిస్తాయి. ముఖ్యంగా వీటిల్లో ప్రోటీన్ శాతం అధికంగా ఉంటుంది. ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా తినేవారు వీటిని ఎలాంటి డౌట్ లేకుండా తీసుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే సోయా బీన్స్..

Soybeans: సోయా బీన్స్‌ తింటే.. ఇన్ని సమస్యలకు దూరంగా ఉండొచ్చు..
Soybeans
Follow us on

సోయా బీన్స్ గురించి తక్కువ మందికే తెలుసు. సోయా బీన్స్‌తో కూడా చాలా రకాల వంటకాలు తయారు చేసుకోవచ్చు. వీటితో చేసిన రెసిపీలు ఎంతో రుచిగా ఉంటాయి. అంతే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. సోయా బీన్స్‌లో శరీరానికి కావాల్సిన పోషకాలు అన్నీ లభిస్తాయి. ముఖ్యంగా వీటిల్లో ప్రోటీన్ శాతం అధికంగా ఉంటుంది. ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా తినేవారు వీటిని ఎలాంటి డౌట్ లేకుండా తీసుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే సోయా బీన్స్.. మాంసాహారంతో సమానమని ఆరోగ్య నిపుణులు కూడా చెబుతున్నారు. సోయా బీన్స్‌తో.. సోయా పిండి, సోయా పాలు, కాటేజ్ చీజ్ కూడా తయారు చేస్తారు. ఇవి తీసుకోవడం కూడా ఆరోగ్యానికి మంచిదే. మరి సోయా బీన్స్ తీసుకుంటే ఎంలాంటి అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రోటీన్ అధికంగా:

సోయా బీన్స్‌లో ప్రోటీన్ శాతం అధికంగా లభిస్తుంది. వీటిని పిల్లలు, పెద్దలు కూడా తీసుకోవచ్చు. మాంసంతో సమానంగా ఇందులో ప్రోటీన్స్ ఉంటాయి. అలాగే పాలలో లభించే ప్రోటీన్లు కూడా ఉంటాయి. కాబట్టి ఎలాంటి మీరు డైట్‌ చేస్తూ ఉంటే వీటిని యాడ్ చేసుకోవచ్చు.

గుడ్ కొలెస్ట్రాల్:

సోయా బీన్స్‌లో గుడ్ కొలెస్ట్రాల్ కూడా ఎక్కువగానే లభిస్తుంది. అన్ శాచురేటెడ్ పోలీ, అన్ శాచురేటెడ్ మోనో, అన్ శాచురేట్, సాచురేటెడ్ ఫ్యాట్స్, ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి శరీరంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్‌ని తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్‌ లెవల్స్‌ను పెంచుతాయి. దీంతో గుండె సంబంధిత సమస్యలు, క్యాన్సర్ వచ్చే రిస్క్ తగ్గుతుంది.

ఇవి కూడా చదవండి

ఫైబర్:

సోయాబీన్స్‌లో ఎక్కువగా లభించే వాటిల్లో ఫైబర్ కూడా ఒకటి. ఫైబర్ రిచ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు తక్కువగా ఉంటాయి.

ఐరన్:

సోయా బీన్స్‌లో ఐరన్ శాతం కూడా అధికంగా ఉంటుంది. ఐరన్ లోపం ఉన్నవాళ్లు సోయాబీన్స్ కూడా తీసుకోవచ్చు. దీని వల్ల రక్త హీనత సమస్య ఏర్పడదు.

క్యాల్షియం:

సోయా బీన్స్‌లో క్యాల్షియం కూడా ఎక్కువగానే లభిస్తుంది. దీని వల్ల ఎముకలు, కండరాలు, దంతాలు బలంగా, దృఢంగా ఉంటాయి. భవిష్యత్తులో ఎముకలకు సంబంధించిన సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..