Life Tips: సుధామూర్తి చెప్పిన జీవిత సత్యాలు.. సంతోషంగా జీవించాలంటే ఈ చిట్కాలు పాటించండి..

జీవితాన్ని సంతోషంగా గడపాలంటే ఏమి కావాలి అనేది ఎప్పుడూ ప్రశ్నార్థకంగానే ఉంటుంది. బాగా డబ్బు ఉండాలా, ఆస్తి పాస్తులు సంపాదించాలా, భవనాల్లో జీవిస్తే సంతోషంగా ఉండవచ్చా.. ఇలాంటి ప్రశ్నలకు సమాధానం దొరకదు. అయితే సుధామూర్తి మాటలు వింటే వీటిపై సరైన క్లారిటీ వస్తుంది. జీవితాన్ని ఆనందంగా గడపటానికి ఆమె కొన్ని విషయాలను పంచుకున్నారు.

Life Tips: సుధామూర్తి చెప్పిన జీవిత సత్యాలు.. సంతోషంగా జీవించాలంటే ఈ చిట్కాలు పాటించండి..
Sudha Murthy
Follow us

|

Updated on: Aug 01, 2024 | 2:16 PM

మన దేశంలో ఎందరో మహానుబావులు తమ మాటలు, అలవాట్లు, జీవన విధానాలతో పలువురికి స్ఫూర్తిగా నిలిచారు. క్రమశిక్షణ, కష్టపడే మనస్తత్వంతో జీవితంలో ఎలా ఉన్నత శిఖరాలను అధిరోహించాలో చూపించారు. వారి మాటలు, ప్రసంగాలతో ఎంతోమంది ఉత్తేజితులయ్యారు. ప్రస్తుతం అలా సమజాాన్ని ప్రభావితం చేస్తున్న వారిలో సుధా నారాయణమూర్తి ఒకరు. ఈవిడ పేరు దేశంలో తెలియని వారెవ్వరూ ఉండదు. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి భార్యగా పరిచయం అయినప్పటికి ఈమె గొప్ప విద్యావేత్త, రచయిత. ప్రస్తుతం ఎంపీగా కూడా నామినేట్ అయ్యారు.

స్ఫూర్తిదాయకం..

సుధామూర్తి జీవన విధానం చాలా సింపుల్ గా ఉంటుంది. ఆమె కట్టుబొట్టు, జీవన విధానం, మాటలు, ప్రసంగాలు సామాన్యులను బాగా ప్రభావితం చేస్తాయి. ఇన్పోసిన్ కంపెనీ సహ వ్యవస్థాపకుడి భార్య అయినప్పటికీ చాాలా సాదాసీదాగా జీవించడం ఈమె ప్రత్యేకత. ఈ విషయమే సుధామూర్తిని దేశంలో ప్రజలందరికీ దగ్గర చేసింది. ముఖ్యంగా యువతకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది.

జీవితం సంతోషంగా గడపాలంటే..

జీవితాన్ని సంతోషంగా గడపాలంటే ఏమి కావాలి అనేది ఎప్పుడూ ప్రశ్నార్థకంగానే ఉంటుంది. బాగా డబ్బు ఉండాలా, ఆస్తి పాస్తులు సంపాదించాలా, భవనాల్లో జీవిస్తే సంతోషంగా ఉండవచ్చా.. ఇలాంటి ప్రశ్నలకు సమాధానం దొరకదు. అయితే సుధామూర్తి మాటలు వింటే వీటిపై సరైన క్లారిటీ వస్తుంది. జీవితాన్ని ఆనందంగా గడపటానికి ఆమె కొన్ని విషయాలను పంచుకున్నారు. వాటి గురించి తెలుసుకుందాం.

  • నిజాయితీ, సింపుల్ సిటీ అనేవి ప్రతి ఒక్కరికీ చాలా అవసరం. జీవితం ఆనందంగా గడపడానికి ప్రాథమిక సూత్రాలు ఇవే. నిజాయితీ వల్ల మీరు సగర్వంగా జీవించవచ్చు. అలాగే సింపుల్ సిటీ అనేది మీ ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది. బయట వారితో పోల్చుకోకుండా జీవించినప్పుడు ఎలాంటి ఆందోళనలు ఉండవు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. అది మీ ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది.
  • జీవితంలో చిన్న చిన్న విషయాల నుంచి కూడా ఆనందం లభిస్తుంది. వాటిని మీరు గుర్తించాలి. అప్పుడు వాటిని ఆస్వాదించగలుతారు. సంతోషం, ఆనందం కోసం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. సానుకూల ధోరణి చాలా అవసరం.
  • కోరికలను అదుపులో పెట్టుకోవాలి. మన పక్క వారికి కారు ఉందనో, బంగారం ఎక్కువ ఉందనో మనం కూడా అప్పు చేసి కొంటే అనర్థాలు జరుగుతాయి. కోరికలకు కూాాడా పరిమితులున్నాయని గమనించాలి. సుధామూర్తి తాతయ్య బాగా ఆస్తిపరులు. కానీ ఆమె అమ్మమ్మ మాత్రం కేవలం మూడు చీరలతో జీవనం సాగించేవారు. ఈ విషయాన్ని సుధామూర్తి చాలాసార్లు తెలిపారు.

సంతృప్తి.. ప్రతి ఒక్కరికీ సంతృప్తి అనేది చాలా అవసరం. ఆహారం, నివాసం, చదువుకోవడానికి, ప్రయాణానికి అవకాశాలు ఉంటే అంతా బాగున్నట్టే. ఈ ప్రాథమిక అవసరాలతో సంతృప్తి చెందాలి.

పిల్లలకు రోల్ మోడల్.. తల్లిదండ్రులు తమ పిల్లలకు రోల్ మోడల్ గా ఉండాలి. పిల్లలు ఎప్పుడూ తమ తల్లిదండ్రులను అనుసరిస్తారు. కాబట్టి మన ప్రవర్తన వారిని ప్రభావితం చేస్తుంది. అలాగే అధిక వ్యయం వల్ల అనుకోని ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి అవసరం మేరకు మాత్రమే మన ఖర్చులు ఉండాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..