Muskmelon Seeds: కర్బూజ గింజలు తింటే ఈ సమస్యలు దరి చేరవు..

కర్భూజ పండుతో పాటు గింజలు కూడా తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని తినడం వల్ల అనేక సమస్యలు రాకుండా ఉంటాయి. బరువు తగ్గాలి, బ్యాడ్ కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారు వీటిని తింటే మంచి ఫలితం ఉంటుంది..

Muskmelon Seeds: కర్బూజ గింజలు తింటే ఈ సమస్యలు దరి చేరవు..
Muskmelon Seeds
Follow us
Chinni Enni

|

Updated on: Nov 18, 2024 | 11:57 AM

వేసవి కాలంలో కర్భూజ పండ్లు ఎక్కువగా ఉంటాయి. వేసిసి తాపం నుంచి సేద తీరేందుకు చాలా మంది ఈ పండ్లను తింటూ ఉంటారు. ఇవి తియ్యగా చాలా రుచిగా ఉంటాయి. ఇది సీజనల్ ఫ్రూట్ కాబట్టి తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. శరీరానికి అనేక పోషకాలు అందుతాయి. ఇలాగే పండులోని గింజలు పారేసి కేవలం పండు మాత్రమే తింటూ ఉంటారు. కానీ కర్భూజాతో పాటు విత్తనాలు తిన్నా ఎన్నో లాభాలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో విత్తనాలకు ఎంతో ఆదరణ పెరుగుతుంది. అలాగే ఈ గింజల్లో కూడా అనేక పోషకాలు లభిస్తున్నాయని ఆరోగ్య నిపుణులు వెల్లడిస్తున్నారు. మరి ఈ కర్భూజ గింజలు తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

విటమిన్ సి అధికం:

కర్భూజ పండులోనే కాకుండా విత్తనాల్లో కూడా విటమిన్ సి అనేది లభిస్తుంది. విటమిన్ సి ఉండే వాటిని తింటే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో త్వరగా ఇన్ఫెక్షన్లు, వ్యాధుల బారిన పడుకుంటా ఉంటారు. ఎనర్జిటిక్‌గా ఉంటారు. చర్మ, ఆరోగ్య సమస్యలు త్వరగా రాకుండా ఉంటాయి. పిల్లలకు ఇస్తే అనేక పోషకాలు అందుతాయి.

జీర్ణ సమస్యలు ఎటాక్ చేయవు:

కర్భూజ గింజల్లో ఫైబర్ శాతం మెండుగా లభిస్తుంది. ఇది అజీర్తి, మల బద్ధకం , యాసిడ్ రిఫ్లెక్స్ లేకుండా చేస్తుంది. మలబద్ధకం, జీర్ణ సమస్యలు ఉండేవారు వీటిని తింటే ఈ సమస్యల నుంచి త్వరగా బయట పడొచ్చు.

ఇవి కూడా చదవండి

దగ్గుకు చెక్:

దగ్గను తగ్గించే గుణాలు ఈ గింజల్లో అధికంగా ఉన్నాయి. కాబట్టి దగ్గు సమస్యతో బాధ పడేవారు వీటిని తినడం వల్ల త్వరగా కోలుకుంటారు.

బ్యాడ్ కొలెస్ట్రాల్ కరుగుతుంది:

కర్భూజ గింజలు తినడం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను కరిగించి.. గుడ్ ఫ్యాట్ లెవల్స్‌ని పెంచుతుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ కరగడం వల్ల రక్త ప్రసరణ సవ్యంగా జరుగుతుంది. అలాగే రక్త పోటు సమస్య కూడా కంట్రోల్ అవుతుంది.

వెయిట్ లాస్:

కర్భూజ విత్తనాలు తినడం వల్ల బరువులో కూడా మార్పులు వస్తాయి. అధిక బరువు ఉండే వారు వీటిని తింటే.. ఆకలి అనేది నియంత్రణలోకి వస్తుంది. ఇందులో ఉండే ఫైబర్, ప్రోటీన్ కారణంగా త్వరగా కడుపు నిండుతుంది. దీంతో ఇతర ఆహారాలు తీసుకోలేరు. కొలెస్ట్రాల్ కూడా కరగడంతో త్వరగా వెయిట్ లాస్ అవుతారు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి.