Fish in Monsoon: వర్షా కాలంలో చేపలు తినడం యమ డేంజర్.. జాగ్రత్త!

| Edited By: Shaik Madar Saheb

Jul 21, 2024 | 10:21 AM

చేపలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఒక రకంగా చెప్పాలంటే చికెన్ అండ్ మటన్ కంటే చేపలు తినడమే బెటర్. చేపలు మంచి పోషకాహారం. ఇందులో శరీరానికి కావాల్సిన ముఖ్యమైన పోషకాలు అన్నీ లభిస్తాయి. అందుకే వారంలో ఒక్కసారైనా తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గర్భిణీలు కూడా చేపలు ఎక్కువగా తింటే తెలివైన పిల్లలు పుడతారు. నిజానికి చేపలు తినడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చు. అయితే వానా కాలంలో మాత్రం చేపలు తినడం అంత..

Fish in Monsoon: వర్షా కాలంలో చేపలు తినడం యమ డేంజర్.. జాగ్రత్త!
Fish In Monsoon
Follow us on

చేపలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఒక రకంగా చెప్పాలంటే చికెన్ అండ్ మటన్ కంటే చేపలు తినడమే బెటర్. చేపలు మంచి పోషకాహారం. ఇందులో శరీరానికి కావాల్సిన ముఖ్యమైన పోషకాలు అన్నీ లభిస్తాయి. అందుకే వారంలో ఒక్కసారైనా తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గర్భిణీలు కూడా చేపలు ఎక్కువగా తింటే తెలివైన పిల్లలు పుడతారు. నిజానికి చేపలు తినడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చు. అయితే వానా కాలంలో మాత్రం చేపలు తినడం అంత మంచిది కాదు. ఈ సమయంలో చేపలు తినడం వల్ల లేని పోని రోగాలు వస్తాయని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే వర్షా కాలంలో నదులు, కాలువలు, చేరువులు, సముద్రాల్లోని చేపలు కలుషితం అవుతాయి. అందుకే వర్షా కాలంలో చేపలు తినకూడదని అంటారు. మరి ఈ సీజన్‌లో చేపలు తినడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

అంటు వ్యాధులు వస్తాయి:

వర్షా కాలంలో వరదలు ఎక్కువగా చేరతాయి. దీని వలన జల వనరులు అనేవి కలుషితం అవుతాయి. నీళ్లలో వైరస్‌లు, బ్యాక్టీరియాలు వంటివి ఎక్కువగా చేరతాయి. వీటిల్లో పెరిగిన చేపలు తినడం వల్ల కడుపులో నొప్పి, విరేచనాలు, వాంతులు, డయేరియా, అలసట, వెయిట్ లాస్ అవ్వడం జరుగుతాయి.

అలర్జీ వస్తుంది:

కలుషితమైన వాతావరణం నుంచి వచ్చే చేపలు తినడం వల్ల ఇప్పుడు అలర్జీ సమస్యలు వస్తాయి. దద్దర్లు, వాపు, దురద, శ్వాస ఆడక పోవడం వంటి సమస్యలు వస్తాయి.

ఇవి కూడా చదవండి

పాదరసం చేరుతుంది:

వర్షాకాలంలో వర్షాలు ఎక్కువగా కురుస్తాయి. కాబట్టి జలాశయాల్లోకి పాదరసం అనేది ఎక్కువగా చేరుతుంది. కాబట్టి చేపల కణజాలాల్లో కూడా పాదరసం వంటి మలినాలు పేరుకు పోతాయి. దీని వలన నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది.

ఫుడ్ పాయిజన్ అవుతుంది:

చేపలు ఆరోగ్యానికి మంచివే కానీ.. ఈ సమయంలో చేపలు తినడం వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే చేపలు ఈ సమయంలో కలుషితమైన నీటి నుంచి వస్తాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..