
పటిక బెల్లం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చాలా మందికి తెలిసే ఉంటుంది. ముఖ్యంగా చిన్న పిల్లలకు పంచదారకు బదులు పటిక బెల్లాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. ప్రతీ ఒక్కరి ఇంట్లోనే పటిక బెల్లం ఉంటుంది. పటిక బెల్లంతో ఉండే ఉపయోగాలు అన్నీ ఇన్నీ కావు. పటిక బెల్లంలో శారీరానికి ఉపయోగ పడే పోషకాలు చాలా ఉన్నాయి. పటిక బెల్లం ఒక సహజమైన స్వీటెనర్. ఇది చక్కెర కంటే ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా పరిగణించబడుతుంది. పటిక బెల్లంను పంచదార నుంచి తయారు చేస్తారు. పటిక బెల్లంలో కూడా రకాలు ఉంటాయి. పటిక బెల్లం తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు. ముఖ్యంగా పటిక బెల్లం తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మరి దీనితో ఎలాంటి లాభాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
పటిక బెల్లం తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. ఎందుకంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా లభిస్తాయి. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి వ్యాధుల నుంచి రక్షిస్తాయి. తరచూ సీజనల్ వ్యాధులతో పోరాడే వారు.. పటిక బెల్లం తినడం చాలా మంచిది. ముఖ్యంగా చిన్న పిల్లలకు పంచదారకు బదులు పటిక బెల్లం ఇస్తే చాలా మంచిది.
పటిక బెల్లం తినడం వల్ల శరీరానికి సత్వరమే శక్తి పెరుగుతుంది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు ఈ పటిక బెల్లం తినడం మంచిది. అలసట, నీరసంగా ఉండే వారు.. పటిక బెల్లాన్ని జ్యూస్, పాలు వంటి వాటిల్లో కలిపి తాగడం చాలా మంచిది.
పటిక బెల్లంలో ఐరన్ శాతం అనేది చాలా ఎక్కువ శాతం ఉంది. రక్త హీనత సమస్యతో బాధ పడేవారు.. పటిక బెల్లం తినడం వలన ఈ సమస్య నుంచి బయట పడొచ్చు. ముఖ్యంగా మహిళలు పటిక బెల్లం తినడం వల్ల పీరియడ్స్‌లో వచ్చే సమస్యలు తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
క్యాల్షియం అధికంగా ఉండటం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి. చిన్న పిల్లలకు ఇవ్వడం వల్ల వారిలో ఎముకలు బలంగా మారతాయి. కీళ్లు, నడుము నొప్పి కూడా తగ్గుతుంది.
పటిక బెల్లం వాడటం వల్ల చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. బయట మార్కెట్లో లభించే క్రీముల కంటే పటిక బెల్లం చర్మాన్ని మెరిచేలా చేసి, ముడతలు పడకుండా కాపాడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..