AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hiccups: అసలు ఎక్కిళ్లు ఎందుకు వస్తాయి.? దేనికి సంకేతం..

ఎక్కిళ్లు రావడం సర్వసాధారణమైన విషయం. ప్రతీ ఒక్కరికీ ఈ సమస్య ఏదో ఒక సమయంలో వచ్చే ఉంటుంది. ఎక్కిళ్లు వస్తే మనల్ని ఎవరో గుర్తు చేసుకుంటున్నారని పెద్దలు చెబుతుంటారు. అలాగే ఎక్కిళ్లు వచ్చిన వెంటనే ఏదైనా షాకింగ్ విషయం చెబితే వెంటనే తగ్గిపోతాయని అంటుంటారు. అయితే సాధారణంగా నీళ్లు తాగగానే ఎక్కిళ్లు వాటంతటవే తగ్గిపోతాయి...

Hiccups: అసలు ఎక్కిళ్లు ఎందుకు వస్తాయి.? దేనికి సంకేతం..
Hiccups
Narender Vaitla
|

Updated on: Sep 16, 2024 | 11:28 AM

Share

ఎక్కిళ్లు రావడం సర్వసాధారణమైన విషయం. ప్రతీ ఒక్కరికీ ఈ సమస్య ఏదో ఒక సమయంలో వచ్చే ఉంటుంది. ఎక్కిళ్లు వస్తే మనల్ని ఎవరో గుర్తు చేసుకుంటున్నారని పెద్దలు చెబుతుంటారు. అలాగే ఎక్కిళ్లు వచ్చిన వెంటనే ఏదైనా షాకింగ్ విషయం చెబితే వెంటనే తగ్గిపోతాయని అంటుంటారు. అయితే సాధారణంగా నీళ్లు తాగగానే ఎక్కిళ్లు వాటంతటవే తగ్గిపోతాయి. అయితే ఇంతకీ ఎక్కిళ్లు రావడానికి అసలు కారణం ఏంటి.? ఇది ఏమైనా అనారోగ్యానికి సంకేతమా.? ఇప్పుడు తెలుసుకుందాం..

ఎక్కిళ్లు రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. వీటిలో ప్రధానమైనవి ఆహారం తీసుకునే సమయంలో గొంతులో ఇరుక్కోవడం. అంతేకాకుండా స్పైసీ ఫుడ్ తీసుకోవడం కూడా ఒక కారణంగా చెబుతుంటారు. నిపుణులు అభిప్రాయం ప్రకారం.. ఎక్కిళ్లు శ్వాసకు సంబంధించిన సమస్యగా చెబుతుంటారు. జీర్ణక్రియ లేదా శ్వాసకోశ వ్యవస్థలో ఏదైనా ఆటంకం ఏర్పడితే. ఎక్కిళ్లు రావడం ప్రారంభమవుతాయి. కడుపు, ఊపిరితిత్తుల మధ్య ఉన్న డయాఫ్రాగమ్‌తో పాటు పక్కటెముకల కండరాలలో సంకోచం కారణంగా ఎక్కిళ్లు ప్రారంభమవుతాయని నిపుణులు చెబుతున్నారు.

సాధారణంగా మనం గాలి పీల్చిన సమయంలో డయాఫ్రాగమ్‌ దానిని కిందికి లాగుతుంది. గాలి బయటకు వదిలినిప్పుడు అది మళ్లీ యథాస్థితికి వచ్చేస్తుంది. డయాఫ్రాగమ్ సంకోచం కారణంగా.. ఊపిరితిత్తులు వేగంగా గాలిని తీసుకోవడం ప్రారంభిస్తాయి. దీని కారణంగా వ్యక్తి ఎక్కిళ్లు మొదలవుతాయి. ఎక్కిళ్లకు కారణం కూడా పొట్టకు సంబంధించినదే. తక్కువ సమయంలో ఎక్కువ మోతాదులో ఆహారం తీసుకున్న సమయంలో కూడా ఎక్కిళ్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

ఫుడ్‌ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో షాకింగ్‌ విషయాలు...!
ఫుడ్‌ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో షాకింగ్‌ విషయాలు...!
జియోలో కేవలం రూ.1748 రీఛార్జ్‌తో 336 రోజుల వ్యాలిడిటీ..
జియోలో కేవలం రూ.1748 రీఛార్జ్‌తో 336 రోజుల వ్యాలిడిటీ..
ఘాటైన చూపుతో చంపేస్తున్న రాశి ఖన్నా.. బ్యూటిఫుల్ ఫొటోస్
ఘాటైన చూపుతో చంపేస్తున్న రాశి ఖన్నా.. బ్యూటిఫుల్ ఫొటోస్
కుప్పకూలిన "సునామీ స్వింగ్", ఒకరు మృతి, 13మందికి సీరియస్!
కుప్పకూలిన
శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇక వాట్సాప్‌లో దర్శనం టిక్కెట్లు!
శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇక వాట్సాప్‌లో దర్శనం టిక్కెట్లు!
మీ కాలేయంలోని కొవ్వును వెన్నలా కరిగించే పానియం ఇది.. తయారీ ఇలా..
మీ కాలేయంలోని కొవ్వును వెన్నలా కరిగించే పానియం ఇది.. తయారీ ఇలా..
ప్రేమలో ఉన్న ప్రతి కుర్రాడు పాడుకునే ఏకైక సాంగ్..
ప్రేమలో ఉన్న ప్రతి కుర్రాడు పాడుకునే ఏకైక సాంగ్..
చిరంజీవి రిజెక్ట్ చేసిన కథతో పవన్ కల్యాణ్ సినిమా.. కట్ చేస్తే..
చిరంజీవి రిజెక్ట్ చేసిన కథతో పవన్ కల్యాణ్ సినిమా.. కట్ చేస్తే..
కష్టాల్లో ఉన్న భారత్‌ను ఆదుకున్న సూర్య..అమెరికా టార్గెట్ 162
కష్టాల్లో ఉన్న భారత్‌ను ఆదుకున్న సూర్య..అమెరికా టార్గెట్ 162
ఇదేం పిచ్చిరా బాబా.. రీల్‌ రీక్రియేట్ చేస్తుండగా జారీన ఛైర్..
ఇదేం పిచ్చిరా బాబా.. రీల్‌ రీక్రియేట్ చేస్తుండగా జారీన ఛైర్..