Lemon Water: నిమ్మకాయ నీటిని ఈ సమయంలో తాగితే మంచి బెనిఫిట్స్..

| Edited By: TV9 Telugu

Jul 10, 2024 | 7:41 PM

నిమ్మకాయ ఆరోగ్యానికి, అందానికి ఎంతో మంచిది. నిమ్మకాయలో పలు రకాల విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో నిమ్మకాయ ఎంతో ప్రభావంగా పని చేస్తుంది. నిమ్మకాయను ఎన్నో రకాలు ఉపయోగిస్తూ ఉంటారు. చాలా మంది నిమ్మకాయను బరువు తగ్గేందుకు ఉపయోగిస్తారు. లెమన్ వాటర్ తాగితే బరువు తగ్గుతారన్న విషయం అందరికీ తెలుసు. బాడీలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో నిమ్మకాయ ఎఫెక్టీవ్‌గా పని చేస్తుంది. కానీ నిమ్మకాయ నీళ్లు..

Lemon Water: నిమ్మకాయ నీటిని ఈ సమయంలో తాగితే మంచి బెనిఫిట్స్..
Lemon Water
Follow us on

నిమ్మకాయ ఆరోగ్యానికి, అందానికి ఎంతో మంచిది. నిమ్మకాయలో పలు రకాల విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో నిమ్మకాయ ఎంతో ప్రభావంగా పని చేస్తుంది. నిమ్మకాయను ఎన్నో రకాలు ఉపయోగిస్తూ ఉంటారు. చాలా మంది నిమ్మకాయను బరువు తగ్గేందుకు ఉపయోగిస్తారు. లెమన్ వాటర్ తాగితే బరువు తగ్గుతారన్న విషయం అందరికీ తెలుసు. బాడీలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో నిమ్మకాయ ఎఫెక్టీవ్‌గా పని చేస్తుంది. కానీ నిమ్మకాయ నీళ్లు తాగడానికి సరైన సమయం మాత్రం చాలా మందికి తెలీదు. మరి లెమన్ వాటర్ ఎప్పుడు తాగాలి? ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో ఇప్పుడు చూద్దాం.

ఈ సమయంలో తాగాలి:

సాధారణంగా నిమ్మకాయ నీళ్లను ఎప్పుడు కావాలంటే అప్పుడు తాగవచ్చు. కానీ బరువు తగ్గాలి అనుకునేవారు మాత్రం ఒకే సమయంలో తాగాలి. అలా తాగితేనే మంచి ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. లెమన్ వాటర్ పరగడుపున ఏమీ తినకుండా.. తాగితే చాలా బెటర్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇలా తాగితే త్వరగా బరువు తగ్గుతారు.

టీ, కాఫీలు తాగకూడదు:

లెమన్ వాటర్ తాగడం మొదలు పెడితే.. మీరు టీ, కాఫీలను తాగడం మానేయండి. టీ, కాఫీల బదులు ఈ లెమన్ వాటర్ పరగడుపున తాగితే.. కలిగే బెనిఫిట్స్ అన్నీ ఇన్నీ కాదు. శరీరంలోని మురికిని తొలగించి.. పొట్టను క్లీన్ చేస్తుంది.

ఇవి కూడా చదవండి

లెమన్ వాటర్ ఇలా తాగాలి:

వెయిట్ లాస్ అవడానికి లెమన్ వాటర్ తాగాలి అనుకుంటే మీరు ఇలానే గాలి. ఒక గ్లాస్‌లో గోరు వెచ్చటి నీటిని తీసుకోండి. అందులో సగం నిమ్మకాయ ముక్క రసాన్ని పిండండి. ఈ నీళ్లను ఉదయాన్నే తాగాలి. అయితే తేనె అనేది వేడి నీటిలో కలపకూడదు. కాబట్టి గోరు వెచ్చగా ఉన్న నీటిలోనే కలపాలి.

చర్మం కాంతివంతం:

మీకు కాంతివంతంగా ఉన్న చర్మం కావాలంటే.. ఖచ్చితంగా ఇప్పటి నుంచే నిమ్మకాయ నీటిని తాగడం మొదలు పెట్టండి. ఇలా తాగడం వల్ల రక్తం శుభ్ర పడుతుంది. చర్మంపై మచ్చలు, పింపుల్స్ పోయి.. చర్మం క్లియర్ అవుతుంది. కొద్ది రోజుల్లోనే గ్లోయింగ్ స్కిన్ పొందుతారు.

బాడీ హైడ్రేట్:

నిమ్మకాయ నీళ్లు తాగడం వల్ల శరీరం అనేది హైడ్రేట్ అవుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, పోషకాలు శరీరాన్ని డీ హైడ్రేషన్ బారి నుంచి కాపాడుతుంది. ప్రస్తుతం వర్షా కాలం కాబట్టి.. ఈ సమయంలో ఈ నీటిని తాగితే ఎంతో మంచిది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..