Cold Water: చల్లని నీళ్లు తాగితే బరువు పెరుగుతారా? నిపుణులు ఏమంటున్నారంటే..
నీరు దాహం తీరుస్తుంది. అంతేకాకుండా ఇది శరీరంపై కూడా ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా వేసవిలో చల్లటి నీరు దొరికితే, అమృతంలా అనిపిస్తుంది. వేసవిలో దాహం ఎక్కువగా ఉంటుంది. దాహం తీర్చుకోవడానికి చల్లటి నీరు లేదా శీతల పానీయాలు తాగాలని కోరుకోవడం సహజం. కానీ వేసవిలో చల్లటి నీరు తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు ఏమైనా వస్తాయా? చల్లటి నీరు తాగడం వల్ల బరువు పెరుగుతారా?..

దాహం తీరడానికి చాలా మంది చల్లని నీళ్లు తాగేందుకు ఇష్టపడతారు. కానీ ఇలా నిత్యం చల్లని నీళ్లు తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. అసలు ఆరోగ్యాంగా ఉండాలంటే ఎంత నీరు తాగాలి, వేడి నీరు లేదా చల్లటి నీరు ఈ రెండిటిలో ఏది ఆరోగ్యానికి మరింత మేలు చేస్తుంది? దీని వలన మీ శరీరంలో కలిగే మార్పుల గురించి ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాలి. నీరు దాహం తీరుస్తుంది. అంతేకాకుండా ఇది శరీరంపై కూడా ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా వేసవిలో చల్లటి నీరు దొరికితే, అమృతంలా అనిపిస్తుంది. వేసవిలో దాహం ఎక్కువగా ఉంటుంది. దాహం తీర్చుకోవడానికి చల్లటి నీరు లేదా శీతల పానీయాలు తాగాలని కోరుకోవడం సహజం. కానీ వేసవిలో చల్లటి నీరు తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు ఏమైనా వస్తాయా? చల్లటి నీరు తాగడం వల్ల బరువు పెరుగుతారా? అనే సందేహం చాలా మందికి ఉంటుంది. పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం..
చల్లని నీళ్లు తాగితే బరువు తగ్గడం లేదా బరువు పెరగడం సంగతి పక్కన పెడితే.. నీళ్లలో కేలరీలు సున్నా ఉంటాయి. కాబట్టి చల్లటి నీరు తాగడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోతుందని అనుకోవడం అపోహ. చల్లటి నీరు తాగడం వల్ల కొవ్వు కణాలు స్తంభింపజేయవు. అలాగని గోరువెచ్చని నీరు తాగడం వల్ల అవి కరిగిపోవు. శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడానికి నీరు అవసరం. శరీరంలో నీరు లేకపోతే నీరసం వస్తుంది. ఇది జీవక్రియకు అంతరాయం కలిగిస్తుంది. కాబట్టి ఎక్కువ నీరు తాగడం అలవాటు చేసుకోవాలి.
అయితే చల్లటి నీళ్లు తాగడం జీర్ణవ్యవస్థకు అంత మంచిది కాదు. ఫలితంగా జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. జీర్ణక్రియ సజావుగా సాగడానికి, గోరువెచ్చని నీరు త్రాగడం మంచిది. వ్యక్తి రోజుకు ఎన్నిసార్లు, ఎంత పరిమాణంలో నీరు తాగాలంటే.. ప్రతి కిలోగ్రాము శరీర బరువుకు 35 మి.లీ నీరు తాగాలని నిపుణులు అంటున్నారు. శరీరంలో హైడ్రేషన్‌ను నిర్వహించడానికి ఈ మేరకు నీళ్లు అవసరం. అయితే గది ఉష్ణోగ్రతకు తగిన మేర నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిది. బదులుగా చల్లటి నీరు తాగడం వల్ల జీర్ణ సమస్యలు, గొంతు నొప్పి, కొన్ని సందర్భాల్లో తలనొప్పి వంటి సమస్యలు కూడా వస్తాయి.
గమనిక: ఈ కంటెంట్ సాధారణ సమాచారం మాత్రమే అందిస్తుంది. మరింత సమాచారం కోసం వైద్యుడిని సంప్రదించడం మర్చిపోవద్దు.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.








