- Telugu News Photo Gallery Technology photos These are the top kitchen gadgets available on Amazon, check details in telugu
Smart kitchen gadgets: వంట గది అందాన్ని పెంచే కిచెన్ గాడ్జెట్స్.. వీటితో ఎన్నో ప్రయోజనాలు
ఇంటిలోని అన్ని ప్రదేశాలలో వంట గది చాాలా ముఖ్యమైంది. కుటుంబ సభ్యులందరి ఆరోగ్యానికి చాలా కీలకంగా ఉంటుంది. వంట గది ఆధునికంగా, శుభ్రంగా ఉన్నప్పుడే ఇంట్లో వారందరికీ మనశ్శాంతి లభిస్తుంది. ఆధునిక కాలంలో అనేక కొత్త వంట గది ఉపకరణాలు (కిచెన్ గాడ్జెట్స్) అందుబాటులోకి వచ్చాయి. ఇవి వంట పనిని సులభం చేయడంతో పాటు సమయాన్ని కూడా ఆదా చేస్తాయి. వీటిని ఉపయోగించుకుని రుచికరమైన ఆహారాన్ని చాలా తొందరగా తయారు చేసుకోవచ్చు. అలాగే వంట గదిలో మీ శ్రమను కూడా బాగా తగ్గిస్తాయి. ఈ నేపథ్యంలో అమెజాన్ లో తక్కువ ధరకు అందుబాటులో ఉన్న వంట గది ఉపకరణాలు, వాటి ఉపయోగాలు, ధరల వివరాలను తెలుసుకుందాం.
Updated on: May 02, 2025 | 8:07 PM

వంటగదిలోని అతి ముఖ్యమైన వస్తువు గ్యాస్ స్టవ్. ఇది సౌకర్యవంతంగా ఉంటేనే వంట పనిని చాలా సుఖంగా, వేగంగా చేయగలం. బియాండ్ అప్లయన్సెస్ నుంచి విడుదలైన గ్యాస్ స్టవ్ ఎంతో ఉపయోగంగా ఉంటుంది. ఎల్పీజీ శక్తితో పనిచేసే ఈ స్టవ్ లో డిజిటల్ టైమర్ ఉంది. దీంతో ఆహారం అతిగా ఉడక్కుండా నిరోధిస్తుంది. ఆటో ఇగ్నిషన్ బర్నర్ల కారణంగా లైటర్ అవసరం ఉండదు. స్టైలిష్ డిజైన్, భద్రత, పటిష్టమైన గాజుతో దీన్ని రూపొందించారు. గ్యాస్ వినియోగాన్ని తగ్గించడంతో పాటు మన భారతీయ వంటలకు చక్కగా సరిపోతుంది.

భోజనం చేసిన తర్వాత ప్లేట్లను శుభ్రం చేసే యంత్రాన్నే డిష్ వాషర్ అంటారు. ఈ రోజుల్లో ప్రతి ఇంటిలోనూ దీని అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో బాష్ కంపెనీ నుంచి విడుదలైన 13 ప్లేస్ సెట్టింగ్ ల, ఫ్రీ స్టాండ్ డిష్ వాషర్ చాలా బాగుంటుంది. మీరు తిన్న తర్వాత ఆ పాత్రలను దీనిలో వేేస్తే చాలు. తక్కువ విద్యుత్ , నీటిని ఉపయోగించుకుని సామగ్రిని తళతళలాడేలా చేస్తుంది. సాధారణంగా మీరు పాత్రలను కడగాలంటే సుమారు 60 లీటర్ల నీరు అవసరమవుతుంది. కానీ బాష్ డిష్ వాషర్ కేవలం పది లీటర్ల నీటితో శుభ్రం చేసేస్తుంది. అమెజాన్ లో రూ.47,500కు బాష్ డిష్ వాషర్ అందుబాటులో ఉంది.

వంట చేసినప్పుడు వెలువడే పొగ, నూనె వాసనలు బయటకు పంపడానికి కిచెన్ చిమ్నీ చాలా అవసరం. ఫేబర్ నుంచి విడుదలైన 60 సెం.మీ ఆటో క్లీన్ చిమ్నీ ఈ పనిని చాలా సమర్థవంతంగా చేస్తుంది. పొగలు, గ్రీజు, డీప్ ఫ్రై చేసినప్పుడు వెలువడే పొగలను లాక్కుని, వంట గదిని ఎప్పటికప్పుడు తాజాగా ఉంచుతుంది. టచ్ ఫ్రీ ఆపరేటింగ్, ఐక్లీన్ రిమైండర్, బలమైన బాఫిల్ ఫిల్టర్, తక్కువ శబ్దం, ఆటో క్లీన్, మూడ్ లైట్ దీని ప్రత్యేకతలు. గోడకు అమర్చుకునే ఈ చిమ్నీని అమెజాన్ లో రూ.14,290కి కొనుగోలు చేయవచ్చు.

ఆధునిక కాలంలో మైక్రోవేవ్ లు అనేక ఫీచర్లతో అందుబాటులోకి వచ్చాయి. అలాంటి వాటిలో ఎల్జీ 28 ఎల్ కన్వెక్షన్ మైక్రోవేవ్ ఓవెన్ ఒకటి. దీంతో బేకింగ్, గ్రిల్లింగ్, స్టీమింగ్, డీఫ్రాస్టింగ్ తో పాటు కేవలం 12 నిమిషాల్లోనే జేసెమ్ ను తయారు చేసుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే వంట గదిలో ఆల్ రౌండర్ అన్నమాట. 251 ఆటో కుక్ ఎంపికలు, స్టెయిన్ లెస్ స్టీల్ చాంబర్, చైల్డ్ లాక్ తదితర ఫీచర్లు బాగున్నాయి. బేకరీ తరహా ఆహార పదార్థాలను ఇంటిలోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. అమెజాన్ లో రూ.12,989కి మైక్రో ఓవెన్ అందుబాటులో ఉంది.

ఆరోగ్యంగా ఉండాలంటే తక్కువ నూనెతో వంటకాలు తయారు చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. కానీ అలా తయారు చేయడం వల్ల ఆహారానికి రుచి రాదు. ఇలాంటి సమయంలో ఫిలిప్స్ ఎయిర్ ప్రైయర్ చాలా ఉపయోగంగా ఉంటుంది. కేవలం పది శాతం నూనెతో క్రిస్ప్సీ ఫ్రైస్, జ్యూసీ కబాబ్ లను తయారు చేసుకోవచ్చు. దీనిలోని రాపిడ్ ఎయిర్ టెక్నాలజీతో ఇష్టమైన ఆహారాన్ని వండుకోవచ్చు. గ్రిల్ చేయడం, రోస్ట్ చేయడం, మళ్లీ వేడి చేయడం, కరిగించడం, డీహైడ్రేడ్ చేయడం.. ఇలా అన్ని పనులు చిటికెలో పూర్తవుతాయి. సాధారణ ఓపెన్ కంటే దాదాపు 70 శాతం తక్కువ విద్యుత్ ను ఉపయోగిస్తుంది. అమెజాన్ లో రూ.4,799కి ఫిలిప్స్ ఎయిర్ ప్రైయర్ అందుబాటులో ఉంది.




