Banana: జలుబు, దగ్గుతో బాధపడేవాళ్లు అరటిపండ్లు తింటే ఏమవుతుందో తెలుసా?

దగ్గు, జలుబు ఉన్నవారు అరటిపండ్లు తినకూడదని చాలా మంది అనుకుంటారు. ఎందుకంటే ఇవి చల్లని స్వభావం కలిగి ఉంటాయి. దీంతో శరీరంలో శ్లేష్మాన్ని పెంచుతాయి. కానీ ఇది నిజమేనా? అనే సందేహం కూడా లేకపోలేదు. దీని గురించి వైద్యులు ఏమి చెబుతున్నారో ఇక్కడ తెలుసుకుందాం..

Banana: జలుబు, దగ్గుతో బాధపడేవాళ్లు అరటిపండ్లు తింటే ఏమవుతుందో తెలుసా?
Banana

Updated on: Mar 09, 2026 | 1:38 PM

అరటిపండ్లు సాధారణంగా అన్ని సీజన్లలో లభిస్తాయి. అయితే దగ్గు, జలుబు ఉన్నవారు అరటిపండ్లు తినకూడదని చాలా మంది అనుకుంటారు. ఎందుకంటే ఇవి చల్లని స్వభావం కలిగి ఉంటాయి. దీంతో శరీరంలో శ్లేష్మాన్ని పెంచుతాయి. కానీ ఇది నిజమేనా? అనే సందేహం కూడా లేకపోలేదు. దీని గురించి వైద్యులు ఏమి చెబుతున్నారో ఇక్కడ తెలుసుకుందాం. డాక్టర్ దీపక్ సుమన్ ప్రకారం అరటిపండ్లు విటమిన్ B6 మాత్రమే కాకుండా మంచి మొత్తంలో పొటాషియం కూడా కలిగి ఉంటాయి. ఇది శరీరానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అరటిపండ్లు తినడం వల్ల జలుబు వస్తుందని, జలుబు సమస్యలు తీవ్రమవుతాయని అనడానికి ఎటువంటి ఆధారాలు లేవు. దగ్గు సమస్య ఉంటే అరటిపండ్లు తినడం వల్ల కఫం పెరుగుతుందనేది కూడా నిజం కాదు. అలాగే అరటిపండ్లు దగ్గు, జలుబును నేరుగా తీవ్రతరం చేయవు. అయితే మలబద్ధకం సమస్యలు ఉన్నవారు మాత్రమే అరటిపండ్లు తినకుండా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. అలాగే జలుబు, దగ్గు సమస్యలు ఉన్నవారు రాత్రి సమయాల్లో అరటి పండ్లు తీసుకోకపోవడమే మంచిది,

అరటిపండు ఎవరికి మంచిది కాదు?

  • కఫం పెరిగిన వారికి
  • అలెర్జీ రినిటిస్ రోగులు
  • గొంతు ఇన్ఫెక్షన్లు లేదా టాన్సిల్ సమస్యలు ఉన్నవారికి మంచిది కాదు.

ముఖ్యంగా అర‌టిపండ్లను ఖాళీ క‌డుపుతో తీసుకోవ‌డం వ‌ల్ల శరీరం ఐరన్‌ను గ్రహించే సామ‌ర్థ్యం త‌గ్గుతుంది. దీంతో శ‌రీరం మొత్తం శ‌క్తి స్థాయిలు కూడా త‌గ్గుతాయి. రోగ‌నిరోధ‌క శ‌క్తి కూడా త‌గ్గుతుంది. అలాగే అర‌టిపండులో క్యాల‌రీలు త‌క్కువ‌గా ఉన్నప్పటికీ దీనిని తిన్న కొన్ని నిమిషాల‌కే ఆక‌లి పెరుగుతుంది. దీని వ‌ల్ల మ‌నం అతిగా తినే అవ‌కాశం కూడా ఉంది. త‌ద్వారా శ‌రీర బ‌రువు కూడా పెరిగే అవకాశం ఉంది. అర‌టిపండులోని అధిక ఫైబ‌ర్ కొంద‌రిలో క‌డుపు నొప్పికి కార‌ణ‌మవుతుంది. ఫైబ‌ర్ సాధార‌ణ మోతాదులో తీసుకోవ‌డం వ‌ల్ల ప్రయోజ‌న‌క‌రంగా ఉంటుంది. సున్నిత‌మైన జీర్ణాశ‌యం ఉన్న వారు ఖాళీ క‌డుపుతో అర‌టిపండును తీసుకోక‌పోవ‌డ‌మే మంచిది. అందుకే అర‌టిపండును తీసుకోవాలా వ‌ద్దా అనే అంశాన్ని శ‌రీర తత్వాన్ని బ‌ట్టి నిర్ణయించుకోవాల‌ని వైద్యులు తెలియ‌జేస్తున్నారు

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us