AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mustard Oil: ఆవాల నూనెతో వంట చేస్తే ఏం జరుగుతుందో తెలుసా..

ఆవాలను పూర్వం నుంచి కూడా ఆహారంలో ఒక భాగం చేశారు. ఆవాలను తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఆవాల పిండితో పులిహార చేసినా, ఆవకాయ పెట్టినా ఆహా ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఆవాలను కేవలం ఆరోగ్యం కోసమే కాకుండా.. చర్మ సంరక్షణకు కూడా ఉపయోగిస్తారు. ఆవాల నుంచి తయారు చేసిన నూనె కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడంటే వంట నూనెలో ఎన్నో రకాలు వచ్చాయి. కానీ ఇంతకు ముందు ఎక్కువగా ఆవాల నూనెతో..

Mustard Oil: ఆవాల నూనెతో వంట చేస్తే ఏం జరుగుతుందో తెలుసా..
Mustard Oil
Chinni Enni
| Edited By: |

Updated on: Jul 21, 2024 | 7:47 PM

Share

ఆవాలను పూర్వం నుంచి కూడా ఆహారంలో ఒక భాగం చేశారు. ఆవాలను తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఆవాల పిండితో పులిహార చేసినా, ఆవకాయ పెట్టినా ఆహా ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఆవాలను కేవలం ఆరోగ్యం కోసమే కాకుండా.. చర్మ సంరక్షణకు కూడా ఉపయోగిస్తారు. ఆవాల నుంచి తయారు చేసిన నూనె కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడంటే వంట నూనెలో ఎన్నో రకాలు వచ్చాయి. కానీ ఇంతకు ముందు ఎక్కువగా ఆవాల నూనెతో వంటలు తయారు చేసేవారు. ఆవాల నూనె కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులో ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి. ఉంటాయి. మరి ఆవాల నూనెతో వంట తయారు చేసి తినడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

చెడు కొవ్వును తగ్గిస్తుంది:

ఆవాల నూనెను వంటల్లో ఉపయోగించడం వల్ల చెడు కొవ్వు అనేది తగ్గుతుంది. ఇందులో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి మంచి కొవ్వులు ఉంటాయి ఉంటాయి. ఇవి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గిస్తాయి. దీని వల్ల గుండె జబ్బులు, అధిక బరువు నుంచి రిలీఫ్ పొందుతారు.

రక్త పోటు కంట్రోల్:

మస్టర్డ్ ఆయిల్‌తో వంటలు చేయడం వల్ల శరీరంలో రక్త పోటు కూడా తగ్గుతుంది. కాబట్టి హైబీపీతో బాధ పడేవారు ఆవ నూనె వంటల్లో ఉపయోగించడం మంచిది. దీని వల్ల గుండె సంబంధిత సమస్యలు కూడా కంట్రోల్ అవుతాయి.

ఇవి కూడా చదవండి

ఫ్రీ రాడికల్స్‌ నశిస్తాయి:

ఆవ నూనెను వంటకు ఉపయోగించడం వల్ల శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్‌ను నశిస్తాయి. ఆవనూనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఇందుకు సహాయం చేస్తాయి. ఫ్రీ రాడికల్స్.. కణాలకు నష్టాన్ని కలిగించి క్యాన్సర్ కు దారి తీస్తాయి.

రోగ నిరోధక శక్తిని పెరుగుతుంది:

ఆవనూనెతో తయారు చేసిన వంటలు తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. దీని వల్ల అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారు. ఇన్ ఫెక్షన్లతో పోరాడే శక్తి లభిస్తుంది.

వాపులు, నొప్పులు తగ్గుతాయి:

ఆవనూనెలో యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి కీళ్ల నొప్పులు, వాపులను తగ్గించడంలో సహాయ పడుతుంది. అలాగే చర్మ, జుట్టు సమస్యలు తగ్గి అందంగా కనిపిస్తారు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Follow Us
అతి త్వరలో వీళ్ళు మొత్తాన్ని ఏలేస్తారు.. మీరున్నారా?
అతి త్వరలో వీళ్ళు మొత్తాన్ని ఏలేస్తారు.. మీరున్నారా?
జూన్ 14 రాశిఫలాలు: ఆ రాశి నిరుద్యోగులకు ఉద్యోగ యోగం..
జూన్ 14 రాశిఫలాలు: ఆ రాశి నిరుద్యోగులకు ఉద్యోగ యోగం..
అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక ఒప్పందం దిశగా.. హోర్ముజ్ జలసంధి..
అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక ఒప్పందం దిశగా.. హోర్ముజ్ జలసంధి..
మంత్రం జపించేటప్పుడు అక్షర దోషం వస్తే పాపమా? శాస్త్రం ఏమి చెబు..
మంత్రం జపించేటప్పుడు అక్షర దోషం వస్తే పాపమా? శాస్త్రం ఏమి చెబు..
ఈ నక్షత్రంలో జన్మించిన వారిని ఓడించడం కష్టం.. మీ నక్షత్రం కూడా..
ఈ నక్షత్రంలో జన్మించిన వారిని ఓడించడం కష్టం.. మీ నక్షత్రం కూడా..
ఇంట్లో గజ్జెల చప్పుడు వినిపిస్తుందా? అమ్మవారి అనుగ్రహానికి ఇది సం
ఇంట్లో గజ్జెల చప్పుడు వినిపిస్తుందా? అమ్మవారి అనుగ్రహానికి ఇది సం
ఆదివారం సూర్యారాధన ఎందుకు చేయాలి? 99% మందికి తెలియని ఆధ్యాత్మిక..
ఆదివారం సూర్యారాధన ఎందుకు చేయాలి? 99% మందికి తెలియని ఆధ్యాత్మిక..
శ్మశానం దగ్గర అనుమానాస్పదంగా ముగ్గురు.. పోలీసలు వచ్చి చూడగా
శ్మశానం దగ్గర అనుమానాస్పదంగా ముగ్గురు.. పోలీసలు వచ్చి చూడగా
తొలి వన్డేలో అఫ్గానిస్తాన్‌పై ఘన విజయం
తొలి వన్డేలో అఫ్గానిస్తాన్‌పై ఘన విజయం
అన్ని దరిద్రాలను తరిమికొట్టే అమావాస్య..ఇలా చేస్తే మీకు తిరుగులేదు
అన్ని దరిద్రాలను తరిమికొట్టే అమావాస్య..ఇలా చేస్తే మీకు తిరుగులేదు