Asafoetida: ఆహారంలో ఇంగువని కలిపి తీసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా?
ఇంగువ గురించి స్పెషల్‌గా పరిచయాలు అవసరం లేదు. అందరికీ ఇంగువ గురించి తెలుసు. ఇంగువను ఎక్కువగా వంటల్లోనే ఉపయోగిస్తూ ఉంటారు. ఇంగువల వలన వంటలకు మరింత రుచి పెరుగుతుంది. ముఖ్యంగా సాంబార్, పప్పు చారు, పులిహోర వంటి రెసిపీలకు ఖచ్చితంగా ఇంగువ ఉండాల్సిందే. ఇంగువ తినడం వల్ల కేవలం రుచి మాత్రమే కాదు. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఇంగువను వంటల్లో ఉపయోగించడానికి ముఖ్య కారణం..

ఇంగువ గురించి స్పెషల్‌గా పరిచయాలు అవసరం లేదు. అందరికీ ఇంగువ గురించి తెలుసు. ఇంగువను ఎక్కువగా వంటల్లోనే ఉపయోగిస్తూ ఉంటారు. ఇంగువల వలన వంటలకు మరింత రుచి పెరుగుతుంది. ముఖ్యంగా సాంబార్, పప్పు చారు, పులిహోర వంటి రెసిపీలకు ఖచ్చితంగా ఇంగువ ఉండాల్సిందే. ఇంగువ తినడం వల్ల కేవలం రుచి మాత్రమే కాదు. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఇంగువను వంటల్లో ఉపయోగించడానికి ముఖ్య కారణం.. పలు అనారోగ్య సమస్యలను తగ్గించుకోవడం కోసం. పురాతన కాలం నుంచి ఇంగువను ఇంటి వైద్యంగా యూజ్ చేస్తున్నారు. ఇంగువతో జీర్ణ సమస్యలకు బైబై చెప్పొచ్చు. అదే విధంగా ఆహారంలో ఇంగువను చేర్చుకోవడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇంట్రెస్టింగ్ విషయాలు:
ఇంగువను చాలా అరుదుగా భారత దేశంలో పడిస్తారు. ఇంగువ రేటు కూడా ఎక్కువే. ఫెరులా-ఫోటిడా అనే మొక్క నుంచి ఇంగువను తయారు చేస్తారు. ఈ రసాన్ని ఎండబెట్టి.. ఇంగువ తయారు చేస్తారు. పాకిస్తాన్, ఇరాన్, ఆప్ఫనిస్తాన్, బెలూచిస్తాన్, కాబూల్ పర్వత ప్రాంతాల్లో ఇది ఎక్కువగా లభ్యమవుతుంది. పురాతన కాలం నుంచి ఇంగువను వంటల్లో ఉపయోగిస్తున్నారు.
శరీరంలో మంటను తగ్గిస్తుంది:
ఇంగువను తీసుకోవడం వల్ల శరీరంలో మంట తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే ఇందులో యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి శరీరంలో మంట, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. అలాగే ఇతర అనారోగ్య సమస్యలు కూడా రాకుండా చేస్తుంది.
చర్మం అందంగా:
ఇంగువను తీసుకోవడం వల్ల చర్మం సమస్యలు కూడా తగ్గుతాయి. చాలా మంది మొటిమల సమస్యతో బాధ పడేవారు ఇంగువను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే చర్మం కూడా అందంగా మారుతుంది. చర్మంపై ఉండే పలు రకాల సూక్ష్మ క్రిములతో ఇంగువ పోరాడుతుంది.
నెలసరి నొప్పులు:
ఇంగువలో యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు, అనాల్జేసిక్ లక్షణాలు ఉన్నాయి. వీటి వలన పీరియడ్స్‌లో వచ్చే నొప్పి, చికాకు, కడుపు సమస్యల్ని తగ్గిస్తుంది.
రక్తం పోటు తగ్గుతుంది:
ఇంగువ తీసుకోవడం వల్ల బీపీ కూడా కంట్రోల్ అవుతుంది. ఇంగువలో ఉండే మూలకాలు.. రక్త ప్రసరణను నార్మల్ చేసి.. రక్తం సన్నబడటానికి హెల్ప్ చేస్తుంది. దీంతో బీపీ అనేది నార్మల్ అవుతుంది. దీంతో గుండె ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. అలాగే శరీరంలో రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)








