Bilva Patra: బిల్వ పత్రం పరగడుపున తింటే ఏం జరుగుతుందో తెలుసా?

హిందూ సంప్రదాయంలో బిల్వ పత్రాన్నిఎంతో పవిత్రమైన మొక్కగా పరిగణిస్తారు. వీటిని ఎక్కువగా శివ పూజలో కూడా ఉపయోగిస్తారు. మూడు ఆకులు కలిపి ఉండే ఈ బిల్వ పత్రం మొక్కను ప్రతి ఇంట్లో కూడా పెట్టుకుంటారు. ఇలా పెట్టుకోవడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోయి.. పాజిటివ్ ఎనర్జీ నెలకుంటుంది. అంతే కాకుండా ఇంటికి అదృష్టాన్ని కూడా తెచ్చి పెడుతుందని నమ్ముతారు. ఈ చెట్టుకు బిల్వ పండు కూడా ఉంటుంది. బిల్వ చెట్టు, ఆకులు, పండ్లలో ఎన్నో రకాల ఔషధాలు..

Bilva Patra: బిల్వ పత్రం పరగడుపున తింటే ఏం జరుగుతుందో తెలుసా?
Bilva Patra

Updated on: Jun 05, 2024 | 6:01 PM

హిందూ సంప్రదాయంలో బిల్వ పత్రాన్నిఎంతో పవిత్రమైన మొక్కగా పరిగణిస్తారు. వీటిని ఎక్కువగా శివ పూజలో కూడా ఉపయోగిస్తారు. మూడు ఆకులు కలిపి ఉండే ఈ బిల్వ పత్రం మొక్కను ప్రతి ఇంట్లో కూడా పెట్టుకుంటారు. ఇలా పెట్టుకోవడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోయి.. పాజిటివ్ ఎనర్జీ నెలకుంటుంది. అంతే కాకుండా ఇంటికి అదృష్టాన్ని కూడా తెచ్చి పెడుతుందని నమ్ముతారు. ఈ చెట్టుకు బిల్వ పండు కూడా ఉంటుంది. బిల్వ చెట్టు, ఆకులు, పండ్లలో ఎన్నో రకాల ఔషధాలు ఉంటాయి. బిల్ల ఆకులను ఉపయోగించడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు. ఈ ఆకుల్ని డైట్‌లో చేర్చుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

రోగ నిరోధక శక్తి పెరుగుదల:

శరీరంలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండాలి. లేదంటే రోగాల బారిన పడుతూ ఉంటారు. వాటిని తట్టుకునే శక్తి కూడా ఉండదు. బిల్వ పత్రంలో రోగ నిరోధక శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ ఆకుల్ని మీ డైలీ రొటీన్‌లో చేర్చుకుంటే చాలా మంచిది. పరగడుపున బిల్ల పత్రం ఆకు లేదా బిల్వ ఆకుల నీటిని తాగినా చాలా మంచిది. దీంతో ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది. జలుబు, దగ్గును తగ్గిస్తుంది. మీ శరీర ఆరోగ్యం కూడా బాగుంటుంది.

గుండె ఆరోగ్యం:

బిల్వ చెట్టు ఆకుల్ని తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. ఎందుకంటే ఈ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి లభిస్తుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో సహాయ పడతాయి. వీటిని తీసుకోవడం వల్ల బీపీ కంట్రోల్ అవుతుంది. గుండె సంబంధిత సమస్యల్ని కూడా తగ్గిస్తుంది.

ఇవి కూడా చదవండి

డయాబెటీస్ కంట్రోల్:

బిల్వ పత్రాలను తీసుకోవడం వల్ల డయాబెటీస్ కూడా నియంత్రణలోకి వస్తుంది. ఇది ఇన్సులిన్ స్థాయిలను పెంచి కాలేయంలోకి గ్లూకోజ్‌ని నిర్వహిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గించడంలో చక్కగా హెల్ప్ చేస్తుంది. ఖాళీకడుపున తీసుకోవడం వల్ల షుగర్ కంట్రోల్ అవుతుంది.

యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మెండు:

బిల్వ పత్రంలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి ఇన్ ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతుంది. ఆయుర్వేదంలో కూడా ఎన్నో ఔషధాల్లో బిల్ పత్రాన్ని ఉపయోగిస్తున్నారు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..