Coriander Seeds: ప్రతిరోజూ ఒక స్పూన్ ధనియాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..

ధనియాల గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. వీటి గురించి అందరికీ తెలుసు. కొత్తిమీర, ధనియాలు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ధనియాల్లో శరీరానికి అవసరం అయ్యే ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ధనియాలను తినడం వల్ల చాలా వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. ధనియాలను కూరల్లో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ధనియాల పొడి వేయడం వల్ల కూరలకు రుచి కూడా వస్తుంది. అంతే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా..

Coriander Seeds: ప్రతిరోజూ ఒక స్పూన్ ధనియాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..
Coriander Seeds
Follow us

|

Updated on: Jul 21, 2024 | 1:30 PM

ధనియాల గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. వీటి గురించి అందరికీ తెలుసు. కొత్తిమీర, ధనియాలు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ధనియాల్లో శరీరానికి అవసరం అయ్యే ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ధనియాలను తినడం వల్ల చాలా వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. ధనియాలను కూరల్లో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ధనియాల పొడి వేయడం వల్ల కూరలకు రుచి కూడా వస్తుంది. అంతే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ప్రతి రోజూ ఒక స్పూన్ ధనియాలు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ధనియాలను డైలీ తీసుకోవడం వల్ల ఎం ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

చర్మ ఆరోగ్యం:

ధనియాలను ప్రతి రోజూ తినడం వల్ల చర్మ సమస్యలు దూరమవుతాయి. చర్మ ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. ధనియాలను పొడిలా తయారు చేసుకుని చర్మానికి రాస్తే.. పింపుల్స్, మచ్చలు తగ్గుతాయి. డెడ్ స్కిన్ సెల్స్ పోతాయి.

ఇమ్యూనిటీ పెరుగుతుంది:

ధనియాల్లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. కాబట్టి ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. దీంతో ఇతర అనారోగ్య సమస్యలతో పోరాడే శక్తి లభిస్తుంది. ఇన్ ఫెక్షన్లు, వైరస్‌‌లు రాకుండా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

జీర్ణ సమస్యలు మాయం:

ప్రస్తుత కాలంలో చాలా మంది జీర్ణ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటున్నారు. కానీ ధనియాలను ప్రతి రోజూ మీ ఆహారంలో చేర్చుకుంటే తిన్న ఆహారాన్ని త్వరగా అరగేలా చేస్తాయి. అలాగే కడుపు ఉబ్బరం, నొప్పి, గ్యాస్, అల్సర్ వంటి సమస్యలను కూడా తగ్గిస్తాయి.

పీరియడ్స్ నొప్పులు:

నెలసరి సమయంలో చాలా మంది లేడీస్‌కి నొప్పులు, హెవీ బ్లీడింగ్ అవడం జరుగుతూ ఉంటాయి. కానీ ధనియాలు తినడం వల్ల పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పులు తగ్గుతాయి. అంతే కాకుండా హెవీ బ్లీడింగ్‌ను కూడా కంట్రోల్ చేస్తాయి.

ఐరన్ మెండు:

ధనియాల్లో ఐరన్ శాతం అనేది ఎక్కువ మొత్తంలో లభ్యమవుతుంది. కాబట్టి ధనియాలను మీ ఆహారంలో చేర్చుంటే.. హిమోగ్లోబిన్ లెవల్స్‌ అనేవి పెంచడానికి ధనియాలు సహాయ పడతాయి.

బరువు తగ్గుతారు:

ధనియాలను ప్రతి రోజూ తినడం వల్ల అధిక బరువు నుంచి ఉపశమనం పొందుతారు. ప్రస్తుత కాలంలో చాలా మంది ఊబకాయంతో కూడా ఇబ్బంది పడుతున్నారు. ధనియాలను తిన్నా, ధనియాల నీటిని తాగినా.. ఈ సమస్యల నుంచి ఉపశమనం పడవచ్చు. చెడు కొలెస్ట్రాల్ కూడా కరుగుతుంది.

డయాబెటీస్ కంట్రోల్:

డయాబెటీస్‌ ఉన్నవారికి హెల్ప్ చేసే వాటిల్లో ధనియాలు కూడా ఒకటి. ప్రతి రోజూ ఒక స్పూన్ ధనియాలను నమిలి తినడం వల్ల షుగర్ వ్యాధిని తగ్గించుకోవచ్చు. అదే విధంగా ధనియాల కషాయం లేదా టీని తాగినా రక్తంలో షుగర్ లెవల్స్ అనేవి తగ్గుతాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ప్రతిరోజూ ఒక స్పూన్ ధనియాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..
ప్రతిరోజూ ఒక స్పూన్ ధనియాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..
మువ్వన్నెల జెండా తొలిసారిగా ఎగిరింది ఎప్పుడంటే..?
మువ్వన్నెల జెండా తొలిసారిగా ఎగిరింది ఎప్పుడంటే..?
నాగచైతన్యకు అమ్మగా, ఫ్రెండ్‌గా, లవర్‌గా నటించిన ఏకైక హీరోయిన్
నాగచైతన్యకు అమ్మగా, ఫ్రెండ్‌గా, లవర్‌గా నటించిన ఏకైక హీరోయిన్
వర్షాలే.. వర్షాలే.. మూడు రోజుల వెదర్ రిపోర్ట్ వచ్చేసింది..
వర్షాలే.. వర్షాలే.. మూడు రోజుల వెదర్ రిపోర్ట్ వచ్చేసింది..
దివ్యాంగ చిన్నారికి సూపర్ గిఫ్ట్ ఇచ్చిన స్మృతి మంధాన.. వీడియో
దివ్యాంగ చిన్నారికి సూపర్ గిఫ్ట్ ఇచ్చిన స్మృతి మంధాన.. వీడియో
భార్యాభర్తలు విడిపోయేది అందుకేనట.. ఈ తప్పులు అస్సలు చేయకండి..
భార్యాభర్తలు విడిపోయేది అందుకేనట.. ఈ తప్పులు అస్సలు చేయకండి..
ఈసారి బడ్జెట్‌లో పన్ను చెల్లింపుదారులకు ఊరట..?
ఈసారి బడ్జెట్‌లో పన్ను చెల్లింపుదారులకు ఊరట..?
పెద్ద కథే ఉందిగా.. శరీరంలో జింక్ లోపిస్తే ఏం జరగుతుందో తెలుసా..?
పెద్ద కథే ఉందిగా.. శరీరంలో జింక్ లోపిస్తే ఏం జరగుతుందో తెలుసా..?
మహానటి సినిమాలో చిన్నప్పటి సావిత్రి ఆ స్టార్ నటుడి మనవరాలా?
మహానటి సినిమాలో చిన్నప్పటి సావిత్రి ఆ స్టార్ నటుడి మనవరాలా?
అంతఃపురంలో సౌందర్య కొడుకుగా నటించిన ఈ చిన్నోడు..
అంతఃపురంలో సౌందర్య కొడుకుగా నటించిన ఈ చిన్నోడు..