Valentines day gifts: వాలెంటైన్స్ డేకి ఏ బహుమతి బాగుంటుందో తెలుసా..? కింది వాటిని ఇస్తే అదుర్స్..!
ప్రేమికుల దినోత్సవ సంబరాలకు సమయం దగ్గరపడుతోంది. మరో నాలుగు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఈ వేడుక ఘనంగా జరుపుకోనున్నారు. స్నేహితులు ప్రేమికులుగా మారడానికి, ప్రేమికులు పెళ్లి బంధంలోకి అడుగుపెట్టడానికి వాలెంటైన్స్ డే మంచి ముహుూర్తంలా భావిస్తారు. ఇప్పటికే పెళ్లయిన వారు వాలెంటైన్స్ డే ఘనంగా జరుపుకొవడానికి ప్రణాళిక వేసుకుంటారు.

ప్రేమికుల రోజు అనగానే ఎక్కువ మంది యువకులు ఆలోచించేది తమ ప్రియురాలికి ఏ బహుమతి ఇవ్వాలనే విషయంపైనే. దాన్ని నిర్ణయించుకోవడానికి తర్జనభర్జనలు పడతారు. అయితే ఈ కింద తెలిపిన వాటిని బహుమతులుగా ఇస్తే చాలా బాగుంటుంది.
స్లైలిష్ వాచ్ లు
వాలెంటైన్స్ డే గుర్తుగా ప్రియురాలికి స్లైలిష్ వాచ్ బహుమతిగా ఇస్తే బాగుటుంది. ఆమె దైనందిక జీవితానికి ఆధునికతను జోడిస్తుంది. యువతి వ్యక్తిత్వానికి నప్పేలా రోజ్ గోల్డ్ లేదా ఆధునిక డిజైన్ ను ఎంచుకోండి. ఈ వాచ్ ను చూసినప్పుడల్లా ఆమెకు మీ ప్రేమ గుర్తుకు వస్తుంది. మీ ఇద్దరి మధ్య దూరాన్ని దగ్గర చేస్తే ఆత్మీయ కానుకగా నిలుస్తుంది.
హెడ్ ఫోన్లు
అధిక నాణ్యత కలిగిన హెడ్ ఫోన్లను ప్రియురాలికి బహుమతిగా ఇవ్వడం చాలా బాగుంటుంది. ఆమె తనకు ఇష్టమైన ట్యూన్లు వైబ్ చేసినా, ప్రయాణంలో ముఖ్యమైన కాల్స్ మాట్లాడాల్సి వచ్చినా ఇవి చాలా ఉపయోగంగా ఉంటాయి. రణగొణ ధ్వనుల నుంచి ప్రశాంతంగా ఉండటానికి, ప్రేమ పాటలను వింటూ ఆస్వాదించడానికి వీలుంటుంది. సంగీతంతో పాటు మీ ఆలోచన ఆమెను చుట్టుమడుతుంది.
లగ్జరీ హ్యాండ్ బ్యాగులు
విలాసవంతమైన లగ్జరీ హ్యాండ్ బ్యాగులు కూడా బహుమతికి ఇచ్చి ప్రియురాలికి ఆనందం కలిగించొచ్చు. అద్భుతమైన డిజైన్ తో ఆకట్టుకునే హ్యాండ్ బ్యాగులు ఆమె అందాన్ని, ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతాయి. తన ముఖ్యమైన వస్తువుల కోసం బ్యాగులో చేతిని ఉంచిన ప్రతిసారి మీ ఆలోచన ఆమెను తాకుతుంది.
స్కిన్ కేర్ ప్రోడక్టులు
ఆధునిక కాలంలో స్కిన్ కేర్ ప్రోడక్టుల వినియోగం విపరీతంగా పెరిగింది. పురుషులతో సమానంగా మహిళలు నేడు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. ఎండ, వానల్లో పనిచేస్తున్నారు. దీంతో చర్మ సంరక్షణ ఉత్పత్తుల వాడకం తప్పనిసరి అయ్యింది. మంచి స్కిన్ కేర్ ప్రొడక్టులను ప్రియురాలికి బహుమతిగా ఇస్తే చాలా బాగుంటుంది. అవి ఆమెకు బాగా ఉపయోగపడడంతో పాటు ఆమెపై మీరు చూపిస్తున్న శ్రద్ధకు నిదర్శనంగా నిలుస్తాయి.
ఆభరణాలు
అద్భుతమైన డిజైన్లతో రూపొందించిన ఆభరణాల సెట్లను ప్రియురాలికి బహుమతిగా ఇవ్వవచ్చు. మంచి నెక్లస్, మెరిసే బ్రాస్ లెట్, అందమైన చెవి రింగులు తదితర వాటిని అందజేయడం ద్వారా వాలైంటైన్స్ డేను మరింత ప్రకాశవంతం చేసుకోవచ్చు.
ఫెర్ఫూమ్స్
విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న పెర్ఫూమ్ లను బహుమతిగా ఇవ్వడం వల్ల ప్రేమ పరిమళాలు మరింత పెరుగుతాయి. వాటిని వాడిన ప్రతిసారీ మంచి సువాసనతో ఆమెకు ప్రత్యేక గుర్తింపును తీసుకువస్తాయి. నిరంతరం మీరు ఆమెకు దగ్గరగా ఉన్నారనే భావనను కలిగిస్తాయి.
చాకెట్లు
ప్రేమ, ఆప్యాయత, మాధుర్యాన్ని అందించే చాక్లెట్లను వాలెంటైన్స్ డే బహుమతులుగా అందజేయవచ్చు. విలాసవంతమైన ట్రిఫుల్స్ నుంచి క్లాసిక్ మిల్క్ చాక్లెట్ల వరకూ ఆమెకు నచ్చిన వాటిని గిఫ్ట్ గా ఇవ్వడం బాగుంటుంది. చాలా చాకెట్లను చక్కని లవ్ సింబల్ గుర్తులో తయారు చేస్తారు. వీటిని ఇవ్వడం ద్వారా మీ ప్రేమను వ్యక్త పరిచి, రుచిని ఆస్వాదించవచ్చు.