AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

L And T Finance: గోల్డ్ లోన్ వ్యాపారంలోకి మరో ఎన్‌బీఎఫ్‌సీ.. గ్రామీణ ప్రాంతల్లో వ్యాపార విస్తరణే ముఖ్యం

భారతదేశంలోని ప్రముఖ నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల్లో ఒకటైన ఎల్అండ్‌టీ ఫైనాన్స్ గోల్ట్ లోన్ వ్యాపారంలోకి అడుగుపెట్టబోతుంది. పాల్ మర్చంట్స్ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (పీఎంఎఫ్ఎల్) గోల్డ్ లోన్ విభాగాన్ని కొనుగోలు చేయడం ద్వారా గోల్డ్ లోన్ వ్యాపారంలోకి అడుగుపెడుతున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆ కంపెనీ గోల్డ్ రంగంలో ఎలాంటి వృద్ధి ఆశిస్తుంది? అలాగే ఆ కంపెనీ లక్ష్యాల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

L And T Finance: గోల్డ్ లోన్ వ్యాపారంలోకి మరో ఎన్‌బీఎఫ్‌సీ.. గ్రామీణ ప్రాంతల్లో వ్యాపార విస్తరణే ముఖ్యం
Gold Loan
Nikhil
|

Updated on: Feb 08, 2025 | 3:01 PM

Share

ఎల్అండ్‌టీ ఫైనాన్స్ కంపెనీ పాల్ మర్చంట్స్ ఫైనాన్స్ జతకట్టడం వల్ల ఈ ఫ్రాంచైజ్ కంపెనీ సెక్యూర్డ్ లోన్ ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియోకు అదనంగా ఉంటుంది.ఇది మొత్తం క్యాష్ డీల్ అని స్లంప్ సేల్ ప్రాతిపదికన ముగింపు వరకు కొన్ని సర్దుబాట్లతో పాటు రూ. 537 కోట్ల మొత్తాన్ని చెల్లిస్తామని ఎల్ అండ్ టి ఫైనాన్స్ తెలిపింది. అయితే ఈ వ్యాపార బదిలీ 2025-26 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం నాటికి ముగిసే అవకాశం ఉంది. చండీగఢ్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్ ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లోని మార్కెట్‌లే టార్గెట్‌గా ఎల్ అండ్ టీ గోల్డ్ లోన్ వ్యాపారం చేయనుందని నిపుణులు చెబుతున్నారు. 

ముఖ్యంగా ఎల్ అండ్ టీ ఫైనాన్స్ వద్ద తన శాఖల 24/7 రిమోట్ పర్యవేక్షణ కోసం పూర్తిగా పనిచేసే నెట్‌వర్క్, భద్రతా కేంద్రం ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.  అలాగే దాదాపు 700 మంది ఉద్యోగులతో ఎల్అండ్ టీ ఫైనాన్స్ 130 శాఖలను లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ ఫిబ్రవరి 7న రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. ఈ సందర్భంగా ఎల్‌టీఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ & సీఈఓ సుదీప్త రాయ్ మాట్లాడుతూ స్థిరమైన వృద్ధిని, ఆకర్షణీయమైన రాబడిని అందించడానికి మేము కట్టుబడి ఉన్నామని తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో బంగారు రుణాలను ప్రజలకు విరివిగా అందించడమే తమ లక్ష్మని తెలిపారు. 

ఎల్ అండ్ టీ ఫైనాన్స్ హోల్డింగ్స్ 2025 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో నికర లాభం రూ.626.4 కోట్లుగా నమోదైంది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే రూ.640 కోట్ల నుంచి 2.1 శాతం తగ్గింది. అలాగే ఈ కంపెనీల లాభం వరుసగా 10 శాతం తగ్గింది. ఎన్‌బీఎఫ్‌సీ మేజర్ నికర వడ్డీ ఆదాయం (ఎన్ఐఐ) 11.4 శాతం పెరిగి రూ.1,833 కోట్ల నుంచి రూ.2,041 కోట్లకు చేరుకుంది. ఎల్ అండ్ టీ స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏ) గత త్రైమాసికంలో 3.19 శాతం నుంచి 3.23 శాతానికి పెరిగాయి. అయితే నికర ఎన్‌పీఏ 0.97 శాతంగా ఉంది. అలాగే ఈ కంపెనీ వడ్డీ ఆదాయం సంవత్సరానికి 15.1 శాతం పెరిగి రూ.3,306.30 కోట్ల నుంచి రూ.3,806.38 కోట్లకు చేరుకుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..