రాత్రి భోజనం తర్వాత ఈ తప్పులు చేస్తున్నారా? జాగ్రత్త.. ఇలా అయితే మీ బరువు అమాంతంగా..
నేటి జీవన శైలి, ఆహారపు అలవాట్ల కారణంగా అధిక బరువు ప్రతి ఒక్కరికీ పెద్ద సమస్యగా మారుతోంది. అంతే కాకుండా మధుమేహం, అధిక రక్తపోటు వంటి వ్యాధుల వల్ల కూడా ఊబకాయం పెరుగుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. చాలా మంది తెలిసో తెలియకో రాత్రి భోజనం తర్వాత చేసే ఈ తప్పులు..
నేటి జీవన శైలి, ఆహారపు అలవాట్ల కారణంగా అధిక బరువు ప్రతి ఒక్కరికీ పెద్ద సమస్యగా మారుతోంది. అంతే కాకుండా మధుమేహం, అధిక రక్తపోటు వంటి వ్యాధుల వల్ల కూడా ఊబకాయం పెరుగుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. చాలా మంది తెలిసో తెలియకో రాత్రి భోజనం తర్వాత చేసే ఈ తప్పులు అధిక బరువు పెరగడానికి కారణం అవుతుంది. రాత్రిపూట ఆహారం తిన్న వెంటనే నిద్రపోవడం వల్ల ఊబకాయం బారీన పడుతుంటారు. ఇది జీర్ణవ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుంది. సాధారణంగా చాలా మంది ఆహారం తిన్న తర్వాత చేసే కొన్ని రకాల తప్పులు ఆరోగ్య నిపుణులు ఈ కింద పేర్కొన్నారు. అవేంటో తెలుసుకుందాం..
నీళ్లు అధికంగా తాగడం
శరీరం హైడ్రేటెడ్ గా ఉండాలంటే నీళ్లు తాగడం చాలా ముఖ్యం. కానీ, ఆహారం తిన్న వెంటనే నీరు తాగితే ఆరోగ్యానికి మేలు కంటే కీడే అధికంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఆహారం శరీరంలోకి వెళ్లినప్పుడల్లా, అది జీర్ణం కావడానికి కనీసం రెండు గంటల సమయం పడుతుంది. ఈ మధ్య నీళ్లు తాగితే జీర్ణక్రియపై ప్రభావం చూపుతుంది. అందువల్ల, ఆహారం తిన్న తర్వాత కనీసం 45 నుంచి 60 నిమిషాల గ్యాప్ తర్వాత నీళ్లు తాగడం అలవాటు చేసుకోవాలి. ఆహారం తినే ముందు నీళ్లు తాగాలనుకుంటే అరగంట ముందు తాగాలి.
తిన్న వెంటనే నిద్రపోవడం
తిన్న వెంటనే నిద్రపోవడం వల్ల ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. దీని వల్ల బరువు పెరగడం, యాసిడ్ రిఫ్లక్స్, గుండెల్లో మంట, గ్యాస్ ఎసిడిటీ, ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలు వస్తాయి. ఆహారం, నిద్ర మధ్య కనీసం 3 నుంచి 4 గంటల వరకు గ్యాప్ ఉండటం చాలా ముఖ్యం.
కెఫిన్ తీసుకోవడం
కొంతమంది టీ, కాఫీలను అలసట నుంచి ఉపశమనం పొందడానికి ఉదయం, సాయంత్రం వేళల్లో తీసుకుంటుంటారు. ఆహారం తిన్న వెంటనే టీ లేదా కాఫీ తాగేస్తారు. కాఫీ లేదా టీ వంటి పానీయాల్లో కెఫిన్ అధికంగా ఉంటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. తిన్న వెంటనే కెఫిన్ తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. శరీరం ఆహారాన్ని జీర్ణం చేసుకోలేకపోవడం వల్ల గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు మొదలవుతాయి. ఫలితంగా బరువు కూడా పెరగడం ప్రారంభమవుతుంది.
రాత్రి భోజనం ఆలస్యంగా తినడం
రాత్రి భోజనం ఆలస్యంగా తినడం చాలా మందికి అలవాటు. పనుల్లో పడిపోయి ఆలస్యంగా తిని, ఆ తర్వాత తిన్న వెంటనే నిద్రకు ఉపక్రమిస్తారు. బరువు పెరగడానికి ఇది కూడా ఒక కారణం. నిద్రపోవడానికి కనీసం 2-3 గంటల ముందు రాత్రి భోజనం చేయాలి. తద్వారా జీర్ణవ్యవస్థకు ఆహారాన్ని జీర్ణం చేయడానికి తగినంత సమయం లభిస్తుంది. ఉదయం 7-8 గంటలలోపు బ్రేక్ ఫాస్ట్ తినాలి. రాత్రి 10-11 గంటలకు నిద్రపోవాలి. రాత్రి భోజనం చేసిన వెంటనే వాకింగ్ చెయ్యాలి. ఆ తర్వాత నిద్రపోతే చక్కగా నిద్రరావడంతోపాటు ఆహారం కూడా బాగా జీర్ణం అవుతుంది.
నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.