AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: మీకు తలనొప్పి వస్తుందా? జాగ్రత్త.. ఆ వ్యాధికి వార్నింగ్ సిగ్నల్ కావొచ్చు..

మైగ్రేన్ సాధారణ తలనొప్పికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. దీనికి సకాలంలో చికిత్స చేయకపోతే అది మీ దైనందిన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ వ్యాధి బారిన పురుషుల కంటే స్త్రీలే ఎక్కవ పడతారు. లక్షణాలు, నివారణల గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Health Tips: మీకు తలనొప్పి వస్తుందా? జాగ్రత్త.. ఆ వ్యాధికి వార్నింగ్ సిగ్నల్ కావొచ్చు..
ఇలా మీ రోజువారి జీవితంలో కొన్ని అలవాట్లను మార్చుకోవడం ద్వారా మీరు కచ్చితంగా మార్పును చూస్తారు. ఒక వేళ ఇవన్ని ప్రయత్నించిన తర్వాత కూడా మీ సమస్య పరిష్కారం కాకపోతే వైద్యులను సంప్రదించండి.
Krishna S
|

Updated on: Aug 01, 2025 | 4:36 PM

Share

తలనొప్పి అనేది ఒక సాధారణ విషయం. కానీ ఈ నొప్పి పదే పదే..నిర్దిష్ట సమయాల్లో వస్తే దానిని లైట్ తీసుకోవద్దు. ప్రతీసారి ఇది సాధారణ తలనొప్పి కాకపోవచ్చు. ఇది తలలోని ఒక సైడ్‌లో విపరీత నొప్పితో పాటు  కొన్నిసార్లు వికారం, వాంతులు, సౌండ్‌తో ఇబ్బంది వంటి లక్షణాలు ఉంటే మైగ్రేషన్ కావచ్చు. ఇది ఏ వయసులోనైనా రావచ్చు. స్త్రీలు..పురుషుల కంటే ఎక్కవగా దీని బారిన పడతారు. మైగ్రేన్ యొక్క లక్షణాలు సాధారణ తలనొప్పికి భిన్నంగా ఉంటాయి. ఇది తరచుగా తల ఒక వైపున తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది. ఇది కొన్ని గంటల నుండి చాలా రోజుల వరకు ఉంటుంది. కొంతమందికి మైగ్రేన్ ప్రారంభమయ్యే ముందు వార్నింగ్ సిగ్నల్స్ వస్తాయి. మరికొందరికి అకస్మాత్తుగా తీవ్రమైన నొప్పి వస్తుంది.

మైగ్రేన్ యొక్క సాధారణ లక్షణాలు..

  • తల యొక్క ఒక వైపు తీవ్రమైన నొప్పి
  • కాంతి, భారీ శబ్దం లేదా వాసన వల్ల చికాకు
  • వికారం లేదా వాంతులు
  • అలసట లేదా తలతిరగడం
  • మెడలో భారంగా ఉండటం
  • మాట్లాడటం లేదా ఆలోచించడంలో ఇబ్బంది

మైగ్రేన్ నొప్పి ఎందుకు వస్తుంది?

మైగ్రేషన్‌కు అనేక కారణాలు ఉండవచ్చు. నిద్ర లేకపోవడం, అధిక ఒత్తిడి, అసమతుల్య దినచర్య, ఖాళీ కడుపుతో ఉండటం, హార్మోన్ల మార్పులు, చాక్లెట్, చీజ్ లేదా ప్రాసెస్ చేసిన ఆహారాలు వంటి కొన్ని ఆహారాలు, వాతావరణంలో మార్పులు, అధిక కెఫిన్ లేదా స్క్రీన్ సమయం వంటివి మైగ్రేన్‌ను ప్రేరేపిస్తాయి.

మైగ్రేన్ నివారించడానికి చిట్కాలు..

  • క్రమం తప్పకుండా పూర్తి నిద్ర
  • ఆకలితో ఉండకూడదు. సమయానికి సమతుల్య భోజనం తినండి
  • స్క్రీన్ సమయాన్ని తగ్గించాలి. ముఖ్యంగా అర్థరాత్రి సమయంలో..
  • హెవీ లైట్లు లేదా బలమైన వాసనలు ఉన్న వాతావరణాలను నివారించండి
  • యోగా, ప్రాణాయామం, ధ్యానంతో ఒత్తిడిని తగ్గించండి
  • నొప్పి ప్రారంభమైన వెంటనే నిశ్శబ్ద చీకటి గదిలో విశ్రాంతి తీసుకోండి
  • కొంతమంది తలపై కోల్డ్ కంప్రెస్ లేదా ఐస్ ప్యాక్ ఉంచడం ద్వారా ఉపశమనం పొందుతారు
  • చాక్లెట్, చీజ్, ప్రాసెస్ చేసిన మాంసం, కెఫిన్ వంటి మైగ్రేన్‌ను ప్రేరేపించే ఆహారాలకు దూరంగా ఉండండి.

ఎప్పుడు చెక్ చేసుకోవాలి..?

మైగ్రేన్ పదే పదే వస్తుంటే, ఇంటి నివారణలు ఉపశమనం కలిగించకపోతే లేదా దృష్టి లోపం, మాట్లాడటంలో ఇబ్బంది, తిమ్మిరి లేదా మూర్ఛ వంటి తీవ్రమైన లక్షణాలు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. మైగ్రేన్‌ను పూర్తిగా నయం చేయడం సాధ్యం కాదు. కానీ సరైన సమయంలో దానిని గుర్తించి నిరోధించడం ద్వారా దాని ప్రభావాన్ని చాలా వరకు తగ్గించవచ్చు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..