AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ice Bath Benefits: సెలబ్రెటీలు చేసే మంచు స్నానం గురించి తెలుసా? నిమిషాల్లో ఒంటి నొప్పులన్నీ మాయం

బాత్‌టబ్‌ నిండా ఐస్‌ గడ్డలు వేసుకుని అందులో కూర్చోవడం అంటే వింటుంటేనే ఒళ్లు జలదరిస్తుంది కదా కానీ ఇలా చేస్తే స్ట్రెస్‌ వల్ల వచ్చే వంటి నొప్పులు దూరం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఐస్‌ బాత్‌ కింద పిలిచే ఇలాంటి స్నానాన్ని చాలా మంది ప్రొఫెషనల్ అథ్లెట్లు, అలాగే ఫిట్‌నెస్ ఫ్రీక్స్ శరీరానికి సమర్థవంతమైన రికవరీ సాధనంగా ఉపయోగపడుతుందని చెబుతూ ఉంటారు.

Ice Bath Benefits: సెలబ్రెటీలు చేసే మంచు స్నానం గురించి తెలుసా? నిమిషాల్లో ఒంటి నొప్పులన్నీ మాయం
Samantha
Nikhil
|

Updated on: May 03, 2023 | 7:30 AM

Share

సాధారణంగా ఫ్రిజ్‌లోని మంచినీరు అనుకోకుండా మనపై వలికితేనే ఒక్కసారిగా ఉలిక్కిపడతాం. చలికాలంలో చన్నీళ్ల స్నానం  అంటే భయపడిపోతాం. అయితే బాత్‌టబ్‌ నిండా ఐస్‌ గడ్డలు వేసుకుని అందులో కూర్చోవడం అంటే వింటుంటేనే ఒళ్లు జలదరిస్తుంది కదా కానీ ఇలా చేస్తే స్ట్రెస్‌ వల్ల వచ్చే వంటి నొప్పులు దూరం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఐస్‌ బాత్‌ కింద పిలిచే ఇలాంటి స్నానాన్ని చాలా మంది ప్రొఫెషనల్ అథ్లెట్లు, అలాగే ఫిట్‌నెస్ ఫ్రీక్స్ శరీరానికి సమర్థవంతమైన రికవరీ సాధనంగా ఉపయోగపడుతుందని చెబుతూ ఉంటారు. ఇటీవల శాకుంతలం సినిమాతో ప్రేక్షకులను పలుకరించిన హీరోయిన్‌ సమంత కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఐస్‌ బాత్‌ చేస్తున్న ఫొటోను షేర్‌ చేసింది. ప్రస్తుతం సీటాడెల్‌ యాక్షన్ సీక్వెన్స్‌ల కోసం సమంతా భారీ వర్కవుట్‌లు చేస్తోంది. దీన్ని వల్ల వచ్చే స్ట్రెస్‌ నుంచి కోలుకోవడానికి ఐస్ బాత్ చికిత్సను సమంత ఆశ్రయించింది. ‘ఇది టార్చర్‌ సమయం అంటూ ఆమె పోస్ట్‌ చేసిన చిత్రం ప్రస్తుతం వైరల్‌గా మారింది. అయితే ఐస్ బాత్ కొత్తగా చేసే వాళ్లు కేవలం 15 నిమిషాల్లో ఐస్ టబ్‌లోంచి వచ్చేయ్యాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ ఐస్‌ బాత్‌ వల్ల కలిగే ఉపయోగాలు ఏంటో ఓసారి తెలుసుకుందాం.

  • ఐస్‌ బాత్‌ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలివే
  • ఐస్‌ బాత్‌ చేయడం వల్ల శరీరంలో వచ్చే వాపులను తగ్గించడంలో సాయం చేస్తుంది. 
  • భారీ వ్యాయాయాలు చేసిన తర్వాత కండరాల పునరుద్ధరణలో ఈ ఐస్‌ బాత్‌సహాయపడుతుంది. 
  • చల్లటి ఐస్‌ గడ్డల వల్ల మీ రక్తనాళాలు కుంచించుకుపోయి చిన్నవిగా తయారవుతాయి. మీరు బాత్‌ టబ్‌ నుంచి బయటికి వచ్చిన వెంటనే, ఉష్ణోగ్రతలో మార్పు వాటిని వేగంగా తిరిగి తెరవడానికి సహాయపడుతుంది. ఇది కండరాలకు ఆక్సిజన్, పోషకాలను కూడా అందిస్తుంది. అలాగే కండరాల నొప్పులను నివారిస్తుంది. 
  • ఐస్ బాత్ చేస్తే రోగనిరోధక శక్తిని మెరగు అవుతుంది. 
  • మంచు స్నానాలు మీ శరీరాన్ని శాంతపరచడం వల్ల మానసిక ఆరోగ్యం, నిద్రను మెరుగుపరుస్తుంది.
  • హైపర్థెర్మియా నుంచి ఉపశమనం పొందడానికి ఐస్‌ బాత్‌ సహాయపడుతుంది. 
  • ముఖ్యంగా భారీ వర్క్‌ అవుట్‌ సెషన్ తర్వాత మంచు స్నానాలు ఒక ఆహ్లాదకరమైన అనుభూతిని ఇస్తుంది. 

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..