కొన్ని రోజుల క్రితం ఒక మహిళ పార్లర్‌లో తన వెంట్రుకలను శుభ్రం చేసుకుంటుండగా సడెన్‌గా స్ట్రోక్ వచ్చింది. అంతకుముందు వరకు ఎంతో ఆరోగ్యంగా కనిపించిన ఆమె ఉన్నట్లుండి పూర్తిగా అనారోగ్యానికి గురైంది. దీనికి కారణం ఆమెను జుట్టును శుభ్రం చేసుకునే విధానమే. ఆమె లాగే చాలామంది స్నానం చేసేటప్పుడు లేదా జుట్టును శుభ్రపరచుకునేటప్పుడు కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. ఇవి జుట్టు నిర్జీవంగా మార్చడమే కాకుండా వాటి పెరుగుదలపై కూడా చెడు ప్రభావం చూపుతుంది. హెయిర్‌ఫాల్‌కు దారి తీస్తుంది. దీంతో పాటు ఆరోగ్యం పరంగా పలు సమస్యలు తలెత్తుతాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా స్నానం చేసే సమయంలో కొందరు నేరుగా తలపై నీళ్లు పోసుకుంటుంటారు. ఇలా చేయడం వల్ల ఒక్కోసారి స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందని నివేదికలు వెల్లడించాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇలా చేయడం వల్ల నాడీ వ్యవస్థ పై ప్రతికూల ప్రభావం పడుతుంది . ఇది క్రమంగా స్ట్రోక్‌కు దారి తీస్తుంది. తలస్నానం చేసేటప్పుడు ముందుగా పాదాలకు నీరు పోయాలి.
ఎంత చల్లగా ఉన్నా, స్నానానికి ఎక్కువగా వేడిచేసిన నీళ్లు వాడకూడదు. అధిక వేడి నీరు చర్మంపై దద్దుర్లకు దారి తీస్తుంది. శరీరాన్ని పొడిగా మారుస్తుంది. చలికాలంలో సరైన స్నానం చేయాలనుకుంటే, ఎల్లప్పుడూ గోరువెచ్చని నీటిని మాత్రమే వాడండి. ఇక స్నానం చేసిన తర్వాత వాడిన టవల్స్ ను ఉతకకపోవడం వల్ల సమస్యలు వస్తాయి. టవల్స్‌పై ఉండే మురికి జుట్టు, చర్మంపై పేరుకుపోతుంది. ఇది మొటిమల నుండి దద్దుర్లు వరకు అనేక రకాల సమస్యలను కలిగిస్తుంది. కాబట్టి టవల్స్‌ను వారానికి కనీసం రెండుసార్లు కడగాలి. ఇక మీరు సరైన సబ్బును ఎంచుకోకపోతే, అది శరీరంలోని మంచి బ్యాక్టీరియాను కూడా చంపుతుంది. రసాయనాలు ఎక్కువగా ఉన్న సబ్బు లేదా హార్డ్ సోస్ మీ చర్మాన్ని పొడిగా మార్చుతుంది. ఎందుకంటే ఇది చర్మంలోని సహజ నూనెను తీసివేస్తుంది. ఇక బాత్ టబ్ చేసే అలవాటు ఉన్న వారు స్నానం చేసిన వెంటనే బాత్ టబ్ ను శుభ్రం చేయాలి. తేమ కారణంగా అందులో ప్రమాదకరమైన బ్యాక్టీరియా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. బాత్ టబ్‌ను క్రమం తప్పకుండా శుభ్రం చేయడం వల్ల ఇన్‌ఫెక్షన్‌ను నివారించవచ్చు. ఇక ఉదయాన్నే చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. అయితే నిద్రపోయే ముందు చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల నిద్రలేమి సమస్యలు తలెత్తుతాయంటున్నారు నిపుణులు. ఇక జుట్టు బలహీనంగా, పలుచగా ఉన్నవారు ప్రతిరోజూ తలస్నానం చేయడం మంచిది కాదు. వారానికి రెండుసార్లు హెడ్ బాత్ చేయడం బెస్ట్. సో చూశారుగా తలస్నానం చేసేటప్పుడు ఎలాంటి పొరపాట్లు చేయకూడదో..
నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.
మరిన్ని హెల్త్ వార్తల కోసం..