
వివాహం అనేది రెండు హృదయాలను కలిపే విడదీయరాని బంధం. వివాహం అనేది భార్యాభర్తల మధ్య దీర్ఘకాలిక సంబంధం. ఇందులో ఇద్దరూ సుఖ దుఃఖాలలో ఒకరినొకరు ఆదరిస్తారు. కానీ ప్రస్తుతం జనరేషన్‌లో చాలా మంది లేట్ మ్యారేజెస్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే 30 సంవత్సరాల వయస్సులో వివాహం చేసుకోవడం సరైనదేనా కాదా? అనేది చాలా మందిలో మొదల్లలో మొదుతున్న ప్రశ్న. ఎందుకంటే నేటి కాలంలో, చాలా మంది 29 నుండి 30 సంవత్సరాల వయస్సులో వివాహం చేసుకుంటున్నారు. మీరు కూడా దీని గురించి చాలా గందరగోళంగా ఉంటే, మీరు కూకూ ఇది తెలుసుకోండి.
కొందరు నిపుణుల ప్రకారం.. 30 సంవత్సరాల వయస్సులో వివాహం చేసుకోవడం అనేది చాలా తప్పుడు నిర్ణయం. ఒక జంట 30 సంవత్సరాల తర్వాత వివాహం చేసుకుంటే, ముఖ్యంగా మహిళలు, వారి సంతానోత్పత్తి బలహీనపడటం ప్రారంభమవుతుంది. అలాంటి సమయంలో వారు గర్భం దాల్చలేరు. ఇక మగవాళ్ల విషయానికి వస్తే పురుషుడితో 30 సంవత్సరాల వయస్సు వరకు స్పెర్మ్ నాణ్యత, స్పెర్మ్ కౌంట్ బాగానే ఉంటాయి, కానీ 30 సంవత్సరాల వయస్సు తర్వాత, స్పెర్మ్ నాణ్యత క్షీణించడం ప్రారంభమవుతుంది. దీని కారణంగా కూడా వారి సంతానోత్పత్తిలో సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది.
ఇది కూడా చదవండి: మీ పిల్లలు చదివిన వాటిని మర్చిపోతున్నారా? ఈ టిప్స్ ఫాలో అవ్వండి.. సమస్యకు చెక్ పెట్టండి!
ఆలస్యంగా వివాహం చేసుకునే జంటలు పిల్లల ప్రణాళికలో చాలా సమస్యలను ఎదుర్కొంటారు. కాబట్టి మీరు 30 సంవత్సరాల తర్వాత వివాహం చేసుకోవాలని ఆలోచిస్తుంటే, ఖచ్చితంగా దీనిపై శ్రద్ధ వహించండి. ఎందుకంటే అలాంటి సమయంలో, మహిళల సంతానోత్పత్తి, పురుషుల స్పెర్మ్ కౌంట్ తగ్గడం ప్రారంభమవుతుంది, ఇది పిల్లల ప్రణాళికలో సమస్యలను కలిగిస్తుంది. ఇది కాకుండా, ఒక జంట ఆలస్యంగా వివాహం చేసుకుంటే, వారి కుటుంబ జీవితం అంత బాగా సాగదని నిపుణులు అంటున్నారు.
ప్రస్తుత జీవనశైలితో మనం బ్రతికేది మహా అయితే 60 ఏళ్లు.. ఇక 30 ఏళ్లు తర్వాత తర్వాత పెళ్లి అంటే అప్పటికే మన లైఫ్ సగం అయిపోతుంది. 30 ఏళ్ల తర్వాత చాలా మంది తమ కెరీర్‌పై ఎక్కువగా దృష్టి పెడతారు. ఈ క్రమంలో సంబంధాలకు ఎక్కవగా దగ్గరగా ఉండలేరు. అంతేకాకుండా, ఆలస్యంగా వివాహం చేసుకోవడం వల్ల శారీరక సాన్నిహిత్యంలో సమస్యలు తలెత్తుతాయి. ఆలస్యంగా వివాహం చేసుకున్న వారు తరచుగా చిరాకు పడతారు. ప్రతి చిన్న విషయానికి గొడవ పడటం ప్రారంభిస్తారు. ఇది వివాహ బంధానికి పెనుముప్పుగా మారవచ్చు. అలాగే 30 ఏళ్ల తర్వాత పెళ్లి మీ లైంగిక జీవితంపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది.
ఇది కూడా చదవండి: ఏంటీ వాటర్ బాటిల్స్ క్యాప్ కలర్స్ వెనక ఇంత కథ ఉందా?.. కచ్చితంగా తెలుసుకోండి!.. లేదంటే మీకే నష్టం!
అటువంటి పరిస్థితిలో, ఆ జంట ఒకరి కోరికలను ఒకరు తీర్చుకోలేరు. కాబట్టి 24 నుండి 25 సంవత్సరాల వయస్సులోనే ప్రేమ లేదా పెద్దలు కుదిర్చిన వివాహాలలో చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. దీని తర్వాత, వారు 27 నుండి 28 సంవత్సరాల వయస్సులో పిల్లలను ప్లాన్ చేసుకోవాలని. ఎందుకంటే చాలా ఆలస్యం అయితే, వారు పిల్లలను కనడంలో వివిధ సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: బావులను గుండ్రంగా ఎందుకు నిర్మిస్తారో మీకు తెలుసా?.. వాటి వెనకున్న శాస్త్రీయ కారణాలు తెలుసుకోండి!
( NOTE: పైన పేర్కొన్న అంశాలు వైద్య నిపుణులు, ఇంటర్నెట్ నుంచి సేకరించిన వివరాల ఆధారంగా అందించబడినవి.. వీటిపై మీరు ఏవైనా సందేహాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం)
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.