ఏంటీ వాటర్ బాటిల్స్ క్యాప్ కలర్స్ వెనక ఇంత కథ ఉందా?.. కచ్చితంగా తెలుసుకోండి!.. లేదంటే మీకే నష్టం!
వాటర్ బాటిల్స్ గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. మనం బయటకు వెళ్లినప్పుడు దాహం వేస్తే షాప్‌లో వాటర్ బాటిల్ కొని మన దాహాన్ని తీర్చుకుంటాం. అయితే మనం కొనే వాటర్ బాటిల్ మూతలు ఒక్కో బ్రాండ్‌ను బట్టి కొక్కో కలర్‌లో ఉంటాయి. నీలం, తెలుపు, ఆకుపచ్చ, పసుపు లేదా నలుపు ఇలా వేర్వేరు రంగు క్యాప్స్ వాటర్ బాటిల్స్‌కు ఉంటాయి. అలా ఎందుకు ఉంటాయో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? లేదు కదా. అయితే వాటర్ బాటిల్ మూత ఇలా వేర్వేరు రంగుల్లో ఎందుకు ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Updated on: Sep 12, 2025 | 11:52 AM

ఒక వాటర్ బాటిల్‌కు ఉండే మూత కలర్ దాని డిజైన్‌లో భాగం మాత్రమే కాదు, అవి బాటిలో లోపల ఉన్న నీటి నాణ్యత, వాటి మూలాన్ని కూడా తెలియజేస్తాయి. చాలా దుకాణాల్లో అమ్మే వాటర్ బాటిళ్లపై నీలిరంగు మూతలు ఉండటం మీరు చూసి ఉంటారు. మీరు కొన్ని బాటిల్‌కు నీలిరంగు మూత ఉంటే ఈ నీటిని నేరుగా స్ప్రింగ్ నుంచి తీసుకుంటారని అర్థం. అంటే ఇది మినరల్ వాటర్ అని అర్థం. ఈ నీరు ఆరోగ్యానికి చాలా మంచిదని భావిస్తారు.

తెల్లటి మూత: నీలిరంగు క్యాప్ తర్వాత, వాటర్ బాటిల్స్‌పై మనం ఎక్కువగా చూసేది తెల్లటి కలర్ క్యాప్. బాటిల్‌పై వైట్ క్యాప్ ఉంటే ఈ నీటిని యంత్రం ద్వారా శుద్ధి చేశారని అర్థం. అంటే, ఈ నీటిని శుద్ధి చేసి RO ప్లాంట్ లేదా ఇలాంటి ఫిల్టర్ యంత్రం ద్వారా నింపుతారు. ఈ నీరు కూడా సురక్షితమైనది అలాగే త్రాగడానికి కూడా మంచిది.

నల్లటి మూత: దుకాణాల్లో నల్లటి మూత ఉన్న బాటిల్స్ చాలా అరుదుగా కనిపిస్తాయి. ఎందుకంటే ఈ నీరు చాలా ఖరీదైనది. ఈ నీటిని ఆల్కలీన్ వాటర్ అంటారు. వీటిని ప్రత్యేకంగా శుద్ధి చేస్తారు. అలాగే, ఈ నీటిలో అనేక ఖనిజాలు ఉంటాయి. ఈ నీటిని ఎక్కువగా సెలబ్రిటీలు, అథ్లెట్లు ఉపయోగిస్తారు.

పసుపు రంగు మూత: కొన్ని నీటి సీసాలకు పసుపు రంగు క్యాప్స్ కూడా ఉంటాయి. మీరు కొనే బాటిల్‌పై పసుపు రంగు క్యాప్ ఉంటే ఈ నీరు విటమిన్లు, ఎలక్ట్రోలైట్లతో సమృద్ధిగా ఉంటుందని అర్థం. ఈ నీరు శరీరానికి శక్తిని ఇస్తుంది. కాబట్టి మన ఆరోగ్యానికి ఈ నీరు చాలా మంచిదని భావిస్తారు.

ఆకుపచ్చ మూత: ఆకుపచ్చ మూత ఉన్న సీసాలలో సహజంగా శుద్ధి చేయబడిన నీరు ఉంటుంది. ఈ నీరు సహజ వనరుల నుండి వస్తుంది అలాగే ఈ నీటిని నేరుగా శుద్ధిచేసి బాటిల్స్‌లో నింపుతారు. కాబట్టి ఇకపై మీరు వాటర్ బాటిల్ కొనేటప్పుడు దాని క్యాప్ రంగును దృష్టిలో ఉంచుకొని కొనండి. ఇది మీ ఆరోగ్యానికి, రుచికి ఉత్తమమైన నీటిని ఎంచుకోవడానికి సహాయపడుతుంది.




