పుచ్చకాయలను తినడమే కాదు.. ఇలా ఉపయోగిస్తే మొహం మెరిసిపోవాల్సిందే.. ఇంకా మొటిమలు సైతం

వేసవి కాలంలో చర్మం హైడ్రేటెడ్‌గా ఉండటానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవడం వల్ల వ్యాధులకు దూరంగా ఉంటాం.

పుచ్చకాయలను తినడమే కాదు.. ఇలా ఉపయోగిస్తే మొహం మెరిసిపోవాల్సిందే.. ఇంకా మొటిమలు సైతం
Summer Acne

Edited By:

Updated on: Apr 23, 2023 | 9:50 AM

వేసవి కాలంలో చర్మం హైడ్రేటెడ్‌గా ఉండటానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవడం వల్ల వ్యాధులకు దూరంగా ఉంటాం. అదే సమయంలో, మామిడి తర్వాత, పుచ్చకాయకు వేసవిలో అత్యధిక డిమాండ్ ఉంటుంది. శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచేందుకు పుచ్చకాయ బెస్ట్ ఫ్రూట్. ఈ పండులో నీటి పరిమాణం ఎక్కువగా ఉంటుంది. పుచ్చకాయ తినడమే కాదు, దాని జ్యూస్ తయారు చేసుకుని తాగవచ్చు. ఈ పండులో ఒక ప్రత్యేకత ఏమిటంటే ఇది చర్మానికి కూడా చాలా మేలు చేస్తుంది.

చర్మవ్యాధి నిపుణుల అభిప్రాయం ప్రకారం, పుచ్చకాయ ఫేస్ మాస్క్ మన చర్మానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది ముఖంపై మొటిమలతో పోరాడడంలో సహాయపడుతుంది. దీనితో పాటు, ఇది మన చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది.

పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం, పుచ్చకాయ మన చర్మానికి మేలు చేస్తుంది. పుచ్చకాయ రసాన్ని కాటన్ సహాయంతో ముఖంపై 10 నిమిషాల పాటు అప్లై చేయడం వల్ల చర్మంలో చికాకు ఎరుపుదనం నుండి ఉపశమనం లభిస్తుంది. ఇది శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ స్థాయిని పెంచుతుంది, దీని కారణంగా గాయాలు త్వరగా నయం అవుతాయి. పుచ్చకాయలో అధిక మొత్తంలో నీటితోపాటు యాంటీ ఆక్సిడెంట్లు, మల్టీవిటమిన్లు మినరల్స్ కూడా ఉన్నాయి. ఇందులో విటమిన్ సి, లైకోపీన్ ఉంటాయి, ఇవి చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి దూరంగా ఉంచుతాయి.

ఇవి కూడా చదవండి

అంతే కాకుండా పుచ్చకాయలో విటమిన్ A తో పాటు పెంతోటిక్ యాసిడ్ లభ్యం కావడం వల్ల డల్ స్కిన్‌ను కాంతివంతం చేస్తుంది. పుచ్చకాయ చక్కటి గీతలు ముడతలకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

-పుచ్చకాయ, తేనె పెరుగు మాస్క్:

మెత్తని పుచ్చకాయను తేనె పెరుగుతో కలిపి ముఖానికి 10 నిమిషాల పాటు అప్లై చేయాలి. దీని తర్వాత మీరు మీ ముఖాన్ని మంచినీటితో కడగాలి.

– పుచ్చకాయ టొమాటో మాస్క్:

చర్మాన్ని మృదువుగా చేయడానికి పుచ్చకాయ టొమాటో ఫేస్ మాస్క్ ను ముఖానికి రాసుకోవచ్చు.

పుచ్చకాయ అరటి మాస్క్:

అరటిపండు పుచ్చకాయలను బాగా మెత్తగా చేసి, దాని మాస్క్‌ను ముఖంపై 20 నిమిషాల పాటు ఉంచండి.

– పుచ్చకాయను ఐస్ క్యూబ్ లు గా మార్చి ముఖంపై అప్లై చేసి మసాజ్ చేసుకోవడం ద్వారా మొటిమలను శాశ్వతంగా దూరం చేసుకునే అవకాశం ఉంది

– పుచ్చకాయ రసంలో బేకింగ్ సోడాను కలిపి ముఖానికి అప్లై చేస్తే మొటిమలకు శాశ్వతంగా గుడ్ బై చెప్పే అవకాశం ఉంది

– పుచ్చకాయ రసంలో అలోవెరా కలిపి ముఖానికి అప్లై చేసుకోవడం ద్వారా మొటిమల నుంచి వాటిపై వచ్చే మచ్చల గురించి మీ చర్మాన్ని కాపాడుకునే వీలుంది అంతేకాదు అలోవెరా మీ చర్మం లోని మృత కణాలను తొలగించి కొత్త జీవకణాలను ప్రోత్సహిస్తుంది అలాగే బ్యాక్టీరియాను తొలగించడంలో కూడా సహాయపడుతుంది.

– అలాగే ప్రతిరోజు పుచ్చకాయ రసం తాగడం ద్వారా కూడా మీ చర్మం హైడ్రేటెడ్ గా ఉండి మొటిమలు ఇతర చర్మవ్యాధులకు దూరంగా ఉంటుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..