AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diabetes: ఆదమరిస్తే అంతే సంగతి.! డయాబెటిస్ వచ్చినవారు ఇలా చేయకపోతే యముడికి షేక్‌హ్యాండ్ ఇచ్చినట్టే

మద్యపానం ఆరోగ్యానికి హానికరం.పొగతాగితే  పోవడం ఖాయమనే హెచ్చరికల సంగతి తెలిసిందే.మరి భారత్‌  ముఖ్యంగా  సౌత్‌ ఇండియా ..గేట్‌ వే ఆఫ్‌ మౌత్‌గా ..మరణానికి దారి ఇదే అనేలా  మారుతోందనే చేదు నిజం తెలుసా? ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి లుక్కేయండి.

Diabetes: ఆదమరిస్తే అంతే సంగతి.! డయాబెటిస్ వచ్చినవారు ఇలా చేయకపోతే యముడికి షేక్‌హ్యాండ్ ఇచ్చినట్టే
Types Of Diabetes And Prevention
Ravi Kiran
|

Updated on: Jan 23, 2026 | 9:12 AM

Share

డయాబెటీస్‌.. షుగర్‌.. ఎలాంటి హెచ్చరికలు లేకుండా చాపకింద నీరులా ఆరోగ్యాన్ని నిర్వీర్యం చేస్తోంది. భారత్‌లో అంతకంతకూ డయాబెటిక్‌ కేసులు పెరుగుతున్నాయి. నివేదికల ప్రకారం ఇప్పటికే భారత్‌లో 10 కోట్ల మందికి పైగా డయాబెటిస్‌ ఉంది. మరో 13.6 కోట్ల మంది ప్రీ-డయాబెటిస్ దశలో ఉన్నారని గణాంకాలు చెప్తున్నాయి. ఆరోగ్య భారత్‌ సంకల్పానికి మాత్రమే కాదు దేశ ఆర్ధిక వ్యవస్థకూ సవాల్‌ విసురుతోంది చక్కర వ్యాధి. ఇది నమ్మక తప్పని చేదు నిజం మరి. ఇటు ప్రజారోగ్యాన్ని అటు ఆర్ధిక వ్యవస్థకు  పొగ పెట్టేలా డయాబెటీస్‌ మౌనంగానే మరణ మృదంగం మోగిస్తోంది.ICMR-INDIAB అధ్యయనం ప్రకారం దేశ జనాభాలో డయాబెటిస్ ప్రాబల్యం 11.4 శాతం ఉంది.పట్టణాల్లో ఇది 14.2 శాతంగా ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో 8.3 శాతంగా నమోదైంది.

ఇది చదవండి: ‘ఆ సాంగ్ వల్లే హీరోయిన్‌గా సినిమాలు మానేశా.!’

తమిళనాడు, గోవా, పంజాబ్, మహారాష్ట్రల్లో డయాబెటిస్ కేసులు ఎక్కువగా ఉన్నట్లు  అధ్యయనాల్లో తేలింది. ఇక్కడ ఆందోళన కల్గించే అంశం ఏంటంటే  డయాబెటిస్ ఉన్న వారిలో 60 శాతం మందికి  వాళ్లకు  ఆ వ్యాధి ఉందన్న విషయం కూడా తెలియదు. ఆల్‌ ఏజ్‌ గ్రూప్‌లను  డయాబెటిస్‌ మూడు రకాలుగా టార్గెట్‌ చేస్తోంది. టైప్‌ 1 డయాబెటిస్‌..జన్యు పరంగా సక్రమించేది. ఫ్యామిలీ హిస్టరీ కారణాలు. ఎక్కువగా చిన్నారుల్లో యువతలో కన్పిస్తోంది. శరీరం ఇన్సులిన్‌ ఉత్పత్తి చేయదు, సో వాళ్లకు లైఫ్‌ లాంగ్  ఇన్సులిన్‌ వాడాల్సిందే .టైప్–2 డయాబెటిస్ భారత్‌లో అత్యధికంగా కన్పిస్తోంది. లైఫ్ స్టైల్, ఊబకాయం,స్ట్రెస్ వల్ల వచ్చేది. గెస్టేషనల్ డయాబెటిస్ :గర్భధారణ సమయంలో మహిళల్లో వస్తుంది. సరైన ఆహారం, వ్యాయామంతో డయాబెటిస్‌ను  రివర్సల్‌ చేసుకునే ఛాన్స్ వుందంటున్నారు డాక్టర్లు.

ఇవి కూడా చదవండి

డయాబెటిస్‌తో యమడేంజరే. నిర్లక్ష్యం చేస్తే  హార్ట్‌ అటాక్‌ రావొచ్చు..లంగ్స్‌, కిడ్నీ ఫెయిల్‌ కావచ్చు. కంటి చూపు పోవచ్చు. ఇలా ఎన్నో సమస్యలుంటాయి. భయపడతే భయం. షుగర్‌ వ్యాధిని కంట్రోల్‌ చేసుకోవచ్చనేది వైద్యపరంగా నిజం. అవగాహన..అప్రమత్తత ముఖ్యం. వాళ్లు వీళ్లు అని కాదు ప్రతీ ఒక్కరూ రెగ్యూలర్‌గా హెల్త్‌ చెకప్‌ చేయించుకోవడమే  డయాబెటిస్‌ నియంత్రణకు.. నివారణకు సరైన మార్గం. భారత్‌లో డయాబెటీస్‌ గ్రాఫ్‌ అంతకంతకూ పెరుగుతోంది.  దేశ ఆర్ధిక వ్యవస్థకు కూడా సవాల్‌గా పరిణమిస్తోంది. డయాబెటీస్‌ కేసులకు కళ్లెం వేయాలంటే అవగాహన పెంచుకోవడమే అసలైన మందు. డయాబెటిస్‌ నిజంగా ప్రమాదకరమా? డేంజర్‌గా ప్రొజెక్ట్‌ చేస్తూ  సర్వే సంస్థలు  ఫార్మా కంపెనీలకు కొమ్ము కాస్తున్నాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సభ్య సమాజానికి సర్వేలు ఇస్తున్న సందేశాల వెనుక వ్యాపారప్రయోజనాలున్నాయన్నారు చేతన ఫౌండేషన్‌ నరసింహారెడ్డి. ప్రపంచంలోనే అత్యధిక డయాబెటిస్ బాధితులు ఉన్న దేశాల్లో భారత్ ఒకటి. అలాగని టెన్షన్‌ పడాల్సిందేమి లేదు. ఆరోగ్యకరమన జీవన విధానం..మంచి ఆహారపు అలవాట్లు..అన్నింటికి నిత్యం వ్యాయామం చేస్తూ ఒత్తిళ్లకు దూరంగా వుండాలన్నది వైద్యుల సలహా.

ఇది చదవండి: షూట్‌లో అలా గాజులు పగలుగొట్టాలి.. బాలకృష్ణ వచ్చి ఏమన్నారంటే.?

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.