AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రతి గంటకు 5నిమిషాలు ఇలా చేశారంటే ఫిట్‌గా ఉంటారు.. ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే..

డెస్క్ ఉద్యోగాల వల్ల రోజూ గంటల తరబడి కూర్చోవడం ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. బరువు పెరగడం, షుగర్, గుండె జబ్బులు, కండరాల తిమ్మిరి వంటివి నివారించడానికి ప్రతి గంటకు కేవలం 5 నిమిషాలు నడవడం ఎంతో మేలు చేస్తుంది. ఇది కేలరీలు బర్న్ చేసి, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. మానసిక ఆరోగ్యాన్ని, ఉత్పాదకతను పెంచుతుంది.

ప్రతి గంటకు 5నిమిషాలు ఇలా చేశారంటే ఫిట్‌గా ఉంటారు.. ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే..
Desk Job Health
Jyothi Gadda
|

Updated on: Dec 07, 2025 | 11:57 AM

Share

ప్రస్తుతం చాలా మంది డెస్క్‌ జాబ్‌లు చేస్తున్నారు. దీంతో వారికి రోజులో 8 నుంచి 10 గంటల పాటు కూర్చుని ఉండాల్సి వస్తుంది. ఫలితంగా  అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. కానీ, ఇలాంటి వారికి కొన్ని చిట్కాలు పాటించటం వల్ల సమస్యలను దూరంగా ఉంచే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.  ఎక్కువ గంటలు కూర్చుని పనిచేసేవారు ప్రతి గంటకు 5 నిమిషాలు నడిస్తే ఆ సమస్యలు అన్నీ దూరం చేసుకోవచ్చునని చెబుతున్నారు. ఒకే చోట ఎక్కువ సేపు కూర్చొని పని చేయడం వల్ల త్వరగా బరువు పెరుగుతారు. కానీ, ప్రతి గంటకు ఒక 5 నిమిషాలు నడిస్తే కేలరీలు బర్న్‌ అవుతాయి. బరువు తగ్గొచ్చు అంటున్నారు నిపుణులు.

రెగ్యులర్‌గా ప్రతి గంటకు 5 నిమిషాల పాటు వాకింగ్ చేయడం వల్ల రక్తప్రవాహం మెరుగుపడుతుంది. దీని వల్ల గుండె సమస్యలు రావు. ప్రతి గంటకు ఒక ఐదు నిమిషాలు వాక్‌ చేస్తే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఆఫీస్‌లో ప్రతి గంటకు 5 నిమిషాలు నడిస్తే భవిష్యత్‌లో డయాబెటిస్‌ రిస్క్‌ తగ్గుతుంది. ఆఫీస్‌లో ప్రతి గంటకు ఒక సారి లేచి వాకింగ్ చేయడం వల్ల రక్తపోటు కంట్రోల్ అవుతుంది. రక్తప్రసరణ మెరుగుపడటం వల్ల బీపీ అదుపులోకి వస్తుంది.

ఎక్కువ సేపు కూర్చొని ఉండటం వల్ల కండరాల తిమ్మిరి సమస్య వస్తుంది. రెగ్యులర్‌గా ప్రతి గంటకు ఒక సారి నడవటం వల్ల కండరాల తిమ్మిరి తగ్గుతుంది. గంటకు 5 నిమిషాల పాటు వాకింగ్ చేయడం వల్ల ఎముకలు కూడా బలంగా మారుతాయి. ఆస్టియోపోరోసిస్ రిస్క్ తగ్గుతుంది. గంటకు 5 నిమిషాలు నడవటం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఎండార్పిన్లు ఎక్కువగా రిలీజ్ అవుతాయి. ఒత్తిడి తగ్గుతుంది. ప్రతి గంటకు ఒక ఐదు నిమిషాలు నడిస్తే క్రియేటివిటీ పెరుగుతుంది. పనిలో ఉత్పాదకత పెరుగుతుంది. పని ఈజీగా పూర్తి అవుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్‌స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..