Lifestyle: పెరుగుతో ఈ క్యాన్సర్‌కు చెక్.. పరిశోధనల్లో ఆసక్తికర విషయాలు..
అయితే వీటితో పాటు పెరుగు క్యాన్సర్‌ను కూడా చెక్ పెట్టడంలో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను దరిచేరనివ్వకుండా పెరుగు ఉపయోగపడుతుందని అంటున్నారు. ఇదేదో అషామాషీగా చెప్పిన విషయం కాదు, పరిశోధనలు చేసి మరీ వెల్లడించారు. స్మోకింగ్ చేయని వారికి కూడా లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని...

పెరుగు ఆరోగ్యానికి మేలు చేస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులోని ఎన్నో ఔషధ గుణాలు ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. ముఖ్యంగా జీర్ణక్రియతో పాటు మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు పెరుగుతో సొంతం చేసుకోవచ్చు. ఇందులోని ప్రోటీన్, కాల్షియం శరీరానికి ఇన్‌స్టాంట్ శక్తిని అందిస్తాయి. అలాగే పెరుగుతో చేసే మజ్జిగతో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తెలిసిందే. ఆరోగ్య నిపుణులు సైతం పెరుగును కచ్చితంగా ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తుంటారు.
అయితే వీటితో పాటు పెరుగు క్యాన్సర్‌ను కూడా చెక్ పెట్టడంలో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను దరిచేరనివ్వకుండా పెరుగు ఉపయోగపడుతుందని అంటున్నారు. ఇదేదో అషామాషీగా చెప్పిన విషయం కాదు, పరిశోధనలు చేసి మరీ వెల్లడించారు. స్మోకింగ్ చేయని వారికి కూడా లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే లంగ్ క్యాన్సర్ బారిన పడిన వారిలో సుమారు 20 శాతం సిగరెట్స్ జోలికి వెళ్లనివారు. వాయు కాలుష్యంతో పాటు మరికొన్ని కారణాల వల్ల లంగ్ క్యాన్సర్ వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
అయితే ప్రతీ రోజు క్రమం తప్పకుండా పెరుగు తీసుకుంటే లంగ్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుందని చెబుతున్నారు. రోజుకు సుమారు 85 గ్రాముల పెరుగు తినే మగవారికి, 113 గ్రాముల పెరుగు తినే ఆడవారికి ఊపిరితిత్తుల క్యాన్సర్ ముప్పు 19% వరకు తక్కువగా ఉంటుందని పరిశోధనల్లో వెల్లడైంది. పెరుగుతోపాటు ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల కూడా క్యాన్సర్ ముప్పు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. పరిశోధనల్లో భాగంగా మొత్తం 14 లక్షల మందిపై నిర్వహించిన 10 అధ్యయనాల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..
