AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పూరీలు నూనె పీల్చకుండా, క్రిస్పీగా రావాలా?ఈ అద్భుతమైన చిట్కాలు మీ కోసమే..!

తెలుగువారి ఇళ్లల్లో ఆదివారం లేదా పండుగల వేళ చేసుకునే ప్రత్యేక ఉపహారాల్లో పూరీ ఒకటి. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తినే ఈ వంటకంలో ఒకే ఒక్క సమస్య తరచూ వేధిస్తుంటుంది. అదే పూరీలు ఎక్కువగా నూనె పీల్చుకోవడం. నూనె జిడ్డుగా మారిన పూరీలు తినడం ఆరోగ్యానికి మంచిది కాదు సరే సరి, రుచిని కూడా పాడుచేస్తాయి. ఈ సమస్యకు పరిష్కారంగా కంటెంట్ క్రియేటర్ అనితా మోహన్ కొన్ని సులువైన, ప్రతిరోజూ పాటించదగిన చిట్కాలను పంచుకున్నారు.

పూరీలు నూనె పీల్చకుండా, క్రిస్పీగా రావాలా?ఈ అద్భుతమైన చిట్కాలు మీ కోసమే..!
Crispy Poori RecipeImage Credit source: tv9 telugu
Jyothi Gadda
|

Updated on: Oct 08, 2026 | 6:57 PM

Share

పూరీలు నూనె ఎక్కువగా పీల్చకుండా, బంతిలా పొంగుతూ క్రిస్పీగా రావడానికి ప్రముఖ కంటెంట్ క్రియేటర్ అనితా మోహన్ కొన్ని సులువైన కిచెన్ హ్యాక్స్ పంచుకున్నారు. ఆమె చెప్పిన వివరణ మేరకు.. చాలామంది పూరీ పిండిని చపాతీ పిండిలా మెత్తగా కలుపుతుంటారు. కానీ, పూరీ పిండిని తగినన్ని నీళ్లు మాత్రమే పోసి గట్టిగా, బిగుతుగా కలపాలి. పిండి ఎంత గట్టిగా ఉంటే నూనె అంత తక్కువగా పీల్చుకుని పూరీలు చక్కగా పొంగుతాయి. పిండి కలిపేటప్పుడు ఒకట్రెండు స్పూన్ల ఉప్మా రవ్వ కలిపితే పూరీలు ఎక్కువసేపు మెత్తబడకుండా కరకరలాడుతూ ఉంటాయి. పిండి కలిపిన వెంటనే పూరీలు చేయడం కంటే, దానిని మూతపెట్టి కనీసం 30 నిమిషాల పాటు ఫ్రిజ్‌లో పెట్టాలి. చల్లబడిన పిండి వేడి నూనెలో పడినప్పుడు నూనెను పీల్చుకోదు. పండుగ రోజుల్లో ముందుగానే పిండి సిద్ధం చేసుకునేవారికి ఇది బాగా ఉపయోగపడుతుంది.

పూరీలు వేయించడానికి ముందు కాగుతున్న నూనెలో చిటికెడు ఉప్పు వేయాలి. ఇది నూనెపై ఒక రక్షక పొరలా పనిచేసి పూరీలు ఎక్కువ నూనె పీల్చకుండా అడ్డుకుంటుంది. అయితే ఉప్పు పరిమాణం చాలా తక్కువగా ఉండాలి, లేకపోతే నూనె పైకి తుల్లే ప్రమాదం ఉంటుంది.

అలాగే, పూరీలు ఒత్తేటప్పుడు పొడి పిండి చల్లితే అది నూనెలో మాడిపోయి నూనె పాడవుతుంది. పీట, కర్రకు కాస్త నూనె రాసి పూరీలను ఒత్తుకోవడం మంచిది. ఇప్పుడు నూనె బాగా వేడెక్కిన తర్వాతే మీడియం-హై ఫ్లేమ్‌పై పూరీలను వేయించాలి. చల్లటి నూనెలో వేస్తే పూరీ స్పాంజిలా నూనెను తాగేస్తుంది. ఈ చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే తక్కువ నూనెతో, హెల్దీగా, కరకరలాడే రుచికరమైన పూరీలను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఎల్‌నినో ఎఫెక్ట్‌.. చేతికొచ్చిన పంట కళ్లముందే ఎండిపోతుంటే..
ఎల్‌నినో ఎఫెక్ట్‌.. చేతికొచ్చిన పంట కళ్లముందే ఎండిపోతుంటే..
పిల్లల లంచ్ బాక్స్‌లోకి బెస్ట్..కడుపు నిండా తినాలంటే ఇవి పెట్టండి
పిల్లల లంచ్ బాక్స్‌లోకి బెస్ట్..కడుపు నిండా తినాలంటే ఇవి పెట్టండి
రియాద్‌ను వణికించిన క్షిపణి దాడి.. విమాన సర్వీసులు రద్దు!
రియాద్‌ను వణికించిన క్షిపణి దాడి.. విమాన సర్వీసులు రద్దు!
పూరీలు నూనె పీల్చకుండా, క్రిస్పీగా రావాలా?ఈ అద్భుతమైన చిట్కాలు
పూరీలు నూనె పీల్చకుండా, క్రిస్పీగా రావాలా?ఈ అద్భుతమైన చిట్కాలు
జెన్ జీ అమ్మాయి, ముదిరిన అబ్బాయి ! దుమ్మురేపుతున్న సినిమా
జెన్ జీ అమ్మాయి, ముదిరిన అబ్బాయి ! దుమ్మురేపుతున్న సినిమా
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
అమెరికాలో మళ్లీ ఉరిశిక్ష.. క్రిస్టా పైక్ ఘటన తర్వాత మరొకరు
అమెరికాలో మళ్లీ ఉరిశిక్ష.. క్రిస్టా పైక్ ఘటన తర్వాత మరొకరు
ఇక వాడి పనైపోయినట్లే.. దమ్మున్నోడు దొరికేశాడుగా..!
ఇక వాడి పనైపోయినట్లే.. దమ్మున్నోడు దొరికేశాడుగా..!
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్‌ చేసిన యువకుడు
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్‌ చేసిన యువకుడు