AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తంగేడు నుంచి గునుగు వరకు.. బతుకమ్మ పూలలో దాగున్న అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు!

తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ కేవలం ఆటపాటలు, ఆధ్యాత్మికతకే పరిమితం కాదు. ప్రకృతితో మమేకమైన ఈ పండుగ వెనుక అపారమైన ఆయుర్వేద విజ్ఞానం దాగి ఉంది. బతుకమ్మను పేర్చడానికి ఉపయోగించే రంగురంగుల పూలలో బోలెడన్ని ఔషధ గుణాలు ఉన్నాయని నిపుణులు వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా వర్షాకాలం ముగిసే సమయంలో వచ్చే అనేక రోగాల నుండి శరీరాన్ని కాపాడటంలో ఈ పూలు కీలక పాత్ర పోషిస్తాయి.

తంగేడు నుంచి గునుగు వరకు.. బతుకమ్మ పూలలో దాగున్న అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు!
Bathukamma Flowers
Jyothi Gadda
|

Updated on: Oct 08, 2026 | 6:34 PM

Share

బతుకమ్మ పండుగలో ఉపయోగించే తంగేడు, గునుగు వంటి పూలలో అద్భుతమైన ఆయుర్వేద, ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర పుష్పమైన తంగేడు పూల కషాయం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడటంతో పాటు నరాల బలహీనతను తగ్గిస్తుంది. ప్రకృతిని ఆరాధించడమే కాక ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే ఈ పండుగ అంతర్యం.

1. తంగేడు పూలు

తెలంగాణ రాష్ట్ర పుష్పమైన తంగేడుకు ఆయుర్వేదంలో ప్రత్యేక స్థానం ఉంది. ఈ పూల కషాయం లేదా టీ తాగడం వల్ల డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. వీటి పొడిని తీసుకోవడం వల్ల అతిమూత్ర వ్యాధి, నరాల బలహీనత తగ్గుతాయి. అంతేకాక, ఈ పూలలో ఉండే సారం శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది.

2. గునుగు పూలు

బతుకమ్మ నిర్మాణంలో ప్రధానంగా వాడే గునుగు పూలు జీర్ణ సంబంధిత సమస్యల ఉపశమనానికి తోడ్పడతాయి. ఇవి బీపీ ని తగ్గించడంలోనూ, ముక్కు నుండి రక్తస్రావం కావడం లేదా నోటి పూత వంటి సమస్యలను నయం చేయడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. చర్మంపై గాయాలు, పొక్కులను తగ్గించే గుణం వీటికి ఉంది.

ఇవి కూడా చదవండి

3. బంతి, చామంతి

బంతి పూలలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కడుపులో వేడిని తగ్గించడమే కాకుండా, చిగుళ్ల వాపు, పంటి నొప్పులు మరియు చర్మ వ్యాధులను నివారిస్తాయి. చామంతి పూలు ముఖంపై మొటిమలు, మచ్చలను తగ్గించి చర్మాన్ని ప్రకాశవంతంగా మారుస్తాయి.

4. గుమ్మడి, నందివర్ధనం, తామర

గుమ్మడి పూలు: విటమిన్-A, విటమిన్-C లభించే గుమ్మడి పూలలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మెండుగా ఉంటాయి. ఇవి వయసు రీత్యా వచ్చే కీళ్ల నొప్పులను తగ్గిస్తాయి.

నందివర్ధనం: ఈ పూల పరిమళం, రసం తలనొప్పి నుంచి తక్షణ ఉపశమనాన్ని ఇస్తాయి.

తామర పూలు: శరీరంలోని అంతర్గత వేడిని తగ్గించి, జీర్ణక్రియను వేగవంతం చేస్తాయి.

5. మందారం, కనకాంబరాలు

గౌరీదేవికి ఇష్టమైన మందార పూలు కేశ సంరక్షణకు అత్యుత్తమం. జుట్టు ఒత్తుగా, నల్లగా పెరిగేలా ఇవి తోడ్పడతాయి. కనకాంబరాలలో ఉండే యాంటీ మైక్రోబియల్ గుణాలు ఇన్ఫెక్షన్లను నివారిస్తాయి. బతుకమ్మ పండుగ ముగిసాక ఈ పూలన్నింటినీ నీటిలో నిమజ్జనం చేయడం వల్ల, నీటిలో ఉన్న బాక్టీరియా నశించి నీరు శుద్ధి అవుతుంది. ఇలా పూల ద్వారా ఆరోగ్యాన్ని పొందుతూ ప్రకృతిని గౌరవించడమే బతుకమ్మ పండుగ పరమార్థం.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us