AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: దసరాకి ఇంటికెళ్తున్నారా..? రైల్వేశాఖ నుంచి మరో సూపర్ న్యూస్.. ఈ ప్రాంతాల మీదుగా స్పెషల్ ట్రైన్స్..

రైల్వేశాఖ వరుస పండుగల క్రమంలో అనేక ప్రత్యేక రైళ్లను ప్రకటిస్తోంది. ఇప్పటినుంచే వీటిల్లో ఆన్‌లైన్ రిజర్వేషన్లను కూడా మొదలుపెట్టింది. పండక్కి సొంతూరుకెళ్లేవారు ఇప్పటినుంచే బుకింగ్ చేసుకుంటున్నారు. తాజాాగా హైదరాబాద్ నుంచి మరికొన్ని స్పెషల్ రైళ్లను ప్రకటించింది. వాటి వివరాలు ఇఫ్పుడు చూద్దాం.

Venkatrao Lella
|

Updated on: Oct 08, 2026 | 6:18 PM

Share
త్వరలో దసరా, దీపావళి పండుగలు వస్తున్న క్రమంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. పండుగల సమయాల్లో నగరాలు, పట్టణాల్లో నివాసం ఉండేవారు తమ సొంత ప్రాంతాలకు వెళుతుంటారు. దీంతో ఇలాంటి సమయాల్లో రైళ్లల్లో రద్దీ ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఈ రద్దీని తగ్గించడం కోసం రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను వివిధ మార్గాల్లో తిప్పుతూ ఉంటుంది.

1 / 5
ఈ క్రమంలో పండుగ సీజన్‌లో ప్రయాణికుల కోసం మరికొన్ని  ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. హైదరాబాద్-నిజాముద్దీన్ మధ్య ప్రత్యేక రైలు సర్వీసులను తిప్పనున్నారు. ఈ స్పెషల్ ట్రైన్లకు సంబంధించిన షెడ్యూల్, ఏయే స్టేషన్లలో ఆగుతుందనే వివరాలను రైల్వేశాఖ వెల్లడించింది. ప్రయాణికులు వీటిని గమనించి ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని సూచించింది

2 / 5
హైదరాబాద్-నిజాముద్దీన్(07031) ప్రత్యేక రైలు అక్టోబర్ 9వ తేదీన అందుబాటులో ఉంటుంది. ఇది హైదరాబాద్‌లో రాత్రి 11.25 గంటలకు బయల్దేరి తర్వాతి రోజు ఉదయం11.55 గంటలకు నిజాముద్దీన్ చేరుకుంటుంది. ఇక చర్లపల్లి-నిజాముద్దీన్(07035) ప్రత్యేక రైలు అక్టోబర్ 11న సర్వీసులు అందించనుంది. ఇది రాత్రి 11.55 గంటలకు బయల్దేరి తర్వాతి రోజు ఉదయం 11.55 గంటలకు నిజాముద్దీన్ చేరుకుంటుంది.

3 / 5
ఈ స్పెషల్ రైళ్లు కాజీపేట్, బల్హార్‌షా, నాగ్‌పూర్, ఇటార్సీ, జబల్‌పూర్, కట్నీ, సత్నా, చిత్రకూట్ ధామ్ కర్వీ, బాందా, వీజీఎల్ ఝాన్సీ, గ్వాలియర్, ఆగ్రా కాంట్ స్టేషన్లలో ఆగుతాయి. ఈ ప్రత్యేక ట్రైన్లలో స్లీపర్ క్లాస్‌తో పాటు జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయి

4 / 5
దసరా, దీపావళి కోసం తెలుగు రాష్ట్రాల మీదుగా రైల్వేశాఖ వందలాది ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వీటిని తిప్పనుంది. ఇప్పటికే వీటిల్లో అడ్వాన్స్ రిజర్వేషన్ల బుకింగ్స్ కూడా ప్రారంభించింది. దీంతో పండక్కి సొంతూరుకు వెళ్లేవారు ఇప్పటినుంచే తమ బెర్త్ కన్పార్మ్ చేసుకుంటున్నారు.

5 / 5
Follow Us