AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇక వాడి పనైపోయినట్లే.. వెళ్లి టెస్ట్‌లు ఆడుకోమనండి.. దమ్మున్నోడు దొరికేశాడుగా..!

Namandheer Debut: వెస్టిండీస్‌తో తొలి టీ20లో అరంగేట్రం చేసిన నమ్మధీర్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. నమ్మధీర్ రాకతో వాషింగ్టన్ సుందర్ వైట్ బాల్ కెరీర్ ముగిసినట్లేనని, అతడు ఇక టెస్ట్ క్రికెట్‌పైనే దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. సుందర్ ఫిట్‌నెస్ సమస్యలు, నమ్మధీర్ ఆల్ రౌండ్ నైపుణ్యాలను శ్రీకాంత్ ప్రస్తావించారు.

ఇక వాడి పనైపోయినట్లే.. వెళ్లి టెస్ట్‌లు ఆడుకోమనండి.. దమ్మున్నోడు దొరికేశాడుగా..!
Namandheer Debut
Venkata Chari
|

Updated on: Oct 08, 2026 | 6:40 PM

Share

Namandheer Debut: లక్నోలోని ఎకానా క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన తొలి టీ20 లో టీం ఇండియా వెస్ట్ ఇండీస్ పై అద్భుత విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్, ఆల్ రౌండ్ ప్రదర్శనతో టీం ఇండియా ఏకంగా ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో అరంగేట్రాటగాడు, ఆల్ రౌండర్ నమ్మధీర్ టీం ఇండియా తరపున తన అంతర్జాతీయ టీ20 కెరియర్ ను ఘనంగా ఆరంభించాడు. ఈ తొలి మ్యాచ్ లో బ్యాటింగ్ లో అవకాశం రానప్పటికీ, బౌలింగ్ లో మాత్రం అద్భుతమైన ప్రదర్శన కనపరిచాడు. తన నాలుగు ఓవర్లలో 31 పరుగులు ఇచ్చి మూడు కీలక వికెట్లు పడగొట్టాడు. ఈ ప్రదర్శనతో టీ20 అరంగేట్రంలో భారత్ తరపున అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన మూడో బౌలర్ గా అతడు రికార్డు సృష్టించాడు.

ఈ నేపథ్యంలో, నమ్మధీర్ ప్రదర్శనపై భారత మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ ప్రశంసల వర్షం కురిపించారు. నమ్మధీర్ ఒక అద్భుతమైన ఆటగాడని, అతడి రాకతో వాషింగ్టన్ సుందర్ వైట్ బాల్ కెరియర్ ఇక ముగిసినట్లేనని శ్రీకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి వెస్ట్ ఇండీస్ తో టీ20 సిరీస్ కు ప్రకటించిన మొదటి జట్టులో నమ్మధీర్కు చోటు దక్కలేదు. అయితే, వాషింగ్టన్ సుందర్‌ను రెడ్ బాల్ క్రికెట్ ప్రాక్టీస్ కోసం రంజిత్ ట్రోఫీ ఆడేందుకు బీసీసీఐ రిలీజ్ చేయడంతో నమ్మధీర్‌కు అనూహ్యంగా జట్టు నుంచి పిలుపు వచ్చింది. వచ్చిన అవకాశాన్ని నమ్మధీర్ రెండు చేతులా అందిపుచ్చుకున్నాడని, తన ప్రదర్శనతో సెలెక్టర్ల నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడని శ్రీకాంత్ పేర్కొన్నారు.

ఎక్కువమంది చదివినది: IND vs WI: రాంచీలో శ్రేయస్ సేన సరికొత్త చరిత్రకు సిద్ధం..? ఇప్పటి వరకు ఎవరూ సాధించని రికార్డ్‌పై కన్ను!

ఇవి కూడా చదవండి

ఈ సందర్భంగా కృష్ణమాచారి శ్రీకాంత్ మాట్లాడుతూ, సుందర్ స్థానంలో అనుకోకుండా వచ్చిన నమ్మధీర్ అవకాశాన్ని చక్కగా వినియోగించుకున్నాడని అన్నారు. ఇప్పటికే వన్ డే లోనూ రాణించిన నమ్మధీర్‌ను ఇకపై తుది జట్టు నుంచి పక్కన పెట్టే సాహసం సెలెక్టర్లు చేయలేరని శ్రీకాంత్ అభిప్రాయపడ్డారు. దీంతో వాషింగ్టన్ సుందర్ పరిమిత ఓవర్ల కెరియర్ ముగిసినట్టేనని, అతడు ఇక టెస్ట్ క్రికెట్ పైనే దృష్టి పెట్టాలని పేర్కొన్నాడు. అంతేకాదు, వాషింగ్టన్ సుందర్ ఫిట్నెస్ సమస్యను ప్రస్తావిస్తూ, సుందర్ ప్రతి రెండు మ్యాచ్ల తర్వాత ఏదో ఒక గాయం బారిన పడుతూ ఉంటాడని శ్రీకాంత్ గుర్తుచేశారు.

ఎక్కువమంది చదివినది: IND vs WI 2nd T20I: 2వ టీ20 నుంచి అతన్ని పీకేయాల్సిందే.. ఆ టీమిండియా డేంజరస్ ప్లేయర్ ఎంట్రీ?

ప్రస్తుతం అతడి స్థానంలో సరైన ఆల్ రౌండర్ దొరికాడని శ్రీకాంత్ అన్నారు. నమ్మధీర్ బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లోనూ మంచి నైపుణ్యం కలిగి ఉన్నాడని, బౌలింగ్ వేసేటప్పుడు బ్యాటర్ మైండ్ సెట్ ను ముందే పసిగడతాడని శ్రీకాంత్ ప్రశంసించారు. తను వేగంగా వేసినప్పుడు బంతి సిక్సర్ వైపు వెళ్తే వెంటనే అలర్ట్ అయ్యి వేగాన్ని తగ్గించి తెలివిగా బౌలింగ్ చేస్తాడని వివరించారు. వైట్ బాల్ క్రికెట్ కు అతడు సరిగ్గా సరిపోతాడని శ్రీకాంత్ స్పష్టం చేశారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us