Coconut Fiber: కొబ్బరి పీచును పడేస్తున్నారా.. ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందటే..

కొబ్బరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె ఇలా కొబ్బరి వంటలు అన్నీ ఆరోగ్యకరమైనవే. కొబ్బరిని డైట్‌లో చేర్చుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కొబ్బరి కూడా చాలా రుచిగా ఉంటుంది. అయితే కొబ్బరి మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. కొబ్బరి పీచును కూడా చాలా మంచిది. కొబ్బరి పీచును ఎక్కువగా గిన్నెలు కడగటానికి, దేవుళ్లకు ధూపం వేయడానికి ఉపయోగిస్తూ ఉంటారు. చాలా మంది కొబ్బరి పీచును..

Coconut Fiber: కొబ్బరి పీచును పడేస్తున్నారా.. ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందటే..
Coconut Fiber
Follow us

|

Updated on: Oct 12, 2024 | 2:15 PM

కొబ్బరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె ఇలా కొబ్బరి వంటలు అన్నీ ఆరోగ్యకరమైనవే. కొబ్బరిని డైట్‌లో చేర్చుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కొబ్బరి కూడా చాలా రుచిగా ఉంటుంది. అయితే కొబ్బరి మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. కొబ్బరి పీచును కూడా చాలా మంచిది. కొబ్బరి పీచును ఎక్కువగా గిన్నెలు కడగటానికి, దేవుళ్లకు ధూపం వేయడానికి ఉపయోగిస్తూ ఉంటారు. చాలా మంది కొబ్బరి పీచును పడేస్తూ ఉంటారు. కానీ ఈ పీచుతో చాలా ఉపయోగాలు ఉన్నాయి. చాలా రకాలుగా కొబ్బరి పీచును ఉపయోగించుకోవచ్చు. మరి కొబ్బరి పీచును ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం.

స్కబ్బర్‌:

చాలా మంది పాత్రలు కడగటానికి స్క్రబ్బర్స్ కొంటూ ఉంటారు. కానీ కొబ్బరి పీచుతో కూడా మనం పాత్రలను కడగవచ్చు. పూర్వంలో ఎక్కువగా కొబ్బరి పీచునే వాడేవారు. కానీ ఈ మధ్య కాలంలో ఎక్కువగా స్క్రబ్బర్స్ ఉపయోగిస్తున్నారు. కొబ్బరి పీచుతో సామాన్లు కడగటం వల్ల గిన్నెలపై ఉండే బ్యాక్టీరియా వంటివి కూడా నశిస్తాయి. ఈ పీచుతో శుభ్రం చేస్తే ఎలాంటి మొండి మరకలు అయినా పోతాయి.

ఎరువు:

కొబ్బరి పీచును మనం ఎరువుగా కూడా ఉపయోగించుకోవచ్చు. కొబ్బరి పీచును నేల సారాన్ని పెంచుతాయి. ఇంట్లో ఉండే మొక్కలకు ఈ కొబ్బరి పీచును ఉపయోగించుకోవచ్చు. కొబ్బరి పీచును చిన్న ముక్కలుగా చేసి ఎండలో వేసి ఓ వారం రోజుల పాటు బాగా ఆరబెట్టాలి. ఆ తర్వాత దీన్ని మిక్సీలో వేసి పొడిలా చేసుకోవాలి. దీన్ని మొక్కలకు వేస్తే బాగా పెరుగుతాయి.

ఇవి కూడా చదవండి

నలుపు రంగు:

కొబ్బరి పీచుతో తెలుపు జుట్టును నలుపుగా మార్చుకోవచ్చు. చాలా మంది హెయిర్ కలర్స్ ఉపయోగిస్తూ ఉంటారు. ఇందులో రసాయనాలు కలిపి ఉంటాయి. కానీ కానీ కొబ్బరి పీచుతో నేచురల్‌గా హెయిర్ కలర్‌ను తయారు చేసుకోవచ్చు. ముందుగా పాన్‌లో కొబ్బరి పీచును వేసి మాడిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. చల్లారకా మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పొడిలో కొద్దిగా కొబ్బరి నూనె, కొద్దిగా ఆవనూనె కలిపి మీ తలకు రాసుకోవచ్చు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

కొబ్బరి పీచును పడేస్తున్నారా.. ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందటే..
కొబ్బరి పీచును పడేస్తున్నారా.. ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందటే..
పండగ రోజు ఘోర ప్రమాదం.. ఏడుగురు మృతి
పండగ రోజు ఘోర ప్రమాదం.. ఏడుగురు మృతి
Watch: కాంగ్రెస్‌తో పొత్తుకు సిద్ధం.. అసద్ కీలక వ్యాఖ్యలు
Watch: కాంగ్రెస్‌తో పొత్తుకు సిద్ధం.. అసద్ కీలక వ్యాఖ్యలు
మూత్రంలో ఈ రెండు లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను కలవాలి
మూత్రంలో ఈ రెండు లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను కలవాలి
ఆరోగ్యానికి ఓ గుప్పెడు చాలు.. రోజూ బాదం తింటే ఏం జరుగుతుందంటే..
ఆరోగ్యానికి ఓ గుప్పెడు చాలు.. రోజూ బాదం తింటే ఏం జరుగుతుందంటే..
జమ్మి చెట్టుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో.. అస్సలు ఊహించలేరు..
జమ్మి చెట్టుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో.. అస్సలు ఊహించలేరు..
పాన్‌ ఇండియా లెవల్లో ప్రతి ఒక్కరూ వెయిటింగ్‌.. ఆ మూవీస్ ఏంటి.?
పాన్‌ ఇండియా లెవల్లో ప్రతి ఒక్కరూ వెయిటింగ్‌.. ఆ మూవీస్ ఏంటి.?
హెచ్చరిక.. కాఫీ, కూల్‌ డ్రింక్‌ అధికంగా తాగితే స్ట్రోక్‌ రిస్క్‌!
హెచ్చరిక.. కాఫీ, కూల్‌ డ్రింక్‌ అధికంగా తాగితే స్ట్రోక్‌ రిస్క్‌!
భాగామతి ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాదం వెనుక కుట్ర కోణం..
భాగామతి ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాదం వెనుక కుట్ర కోణం..
ఏ వయసుకి ఎంత బరువు ఉండాలో తెలుసా? ఒక్క రహస్యంతో సగం రోగాలు మటాష్
ఏ వయసుకి ఎంత బరువు ఉండాలో తెలుసా? ఒక్క రహస్యంతో సగం రోగాలు మటాష్