High cholesterol: మూత్రంలో ఈ రెండు లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను కలవాలి.. ఎందుకంటే?

సాధారణంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే గుండెపోటు, స్ట్రోక్ వంటి సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. కొలెస్ట్రాల్ పసుపు రంగులో ఉండి.. జిగటగా ఉండే ఓ పదార్థం. ఈ కొలెస్ట్రాల్ కాలేయంలో పేరుకుపోతే, అది రక్తంలో చేరడం ప్రారంభమవుతుంది. అధిక కొలెస్ట్రాల్ వివిధ సమస్యలకు దారితీస్తుంది. ఇది పెరగడానికి ముందు శరీరం వివిధ లక్షణాలు కనిపిస్తాయి..

Srilakshmi C

|

Updated on: Oct 12, 2024 | 1:57 PM

కొన్నిసార్లు కాళ్ళలో నొప్పి అధికంగా ఉంటుంది. కాళ్లు చచ్చుబడిపోయినట్లు అనిపిస్తుంది. కాళ్ల రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోయి ఉండటం వల్ల ఇలా జరుగుతుంది. ఫలితంగా కాళ్లకు సరైన రక్త ప్రసరణ జరగక ఎక్కడికక్కడ నిలిచిపోతుంది. అందుకే పాదాల నొప్పి మొదలవుతుంది. ఇది రాత్రి నిద్రిస్తున్నప్పుడు కూడా జరగవచ్చు.

1 / 5
కాలి కండరాలు ఎప్పుడు ఒత్తిడికి గురవుతాయి. దీనివల్ల అరికాళ్ల కింద మంటలు వస్తుంటాయి. రక్తంలో కొలెస్ట్రాల్ పెరిగితే, కాళ్ల నరాలు దెబ్బతింటాయి. దీంతో కాళ్లలో తిమ్మిర్లు, కాలి వాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. అలాగే రక్తంలో కొలెస్ట్రాల్ పెరిగితే, రాత్రిపూట పాదాలు చల్లగా మారిపోతాయి. శీతాకాలం, వేసవి, వర్షాకాలం.. సీజన్‌ ఏదైనా అన్ని సీజన్లలో రాత్రిపూట పాదాలు చల్లగా మారిపోతుంటే వెంటనే వైద్యల వద్దకు వెళ్లాలి. ఇది రక్తంలో చెడు కొలెస్ట్రాల్ సంకేతం.

2 / 5
మూత్రంలో స్ఫటికాలు: శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు, అది స్ఫటికాల ద్వారా మూత్రంలో రావడం ప్రారంభమవుతుంది. కొలెస్ట్రాల్ స్ఫటికాలు చిన్న పరిమాణంలో ఉంటే మూత్రం ద్వారా వెళ్లడం సాధారణం. కానీ దాని పరిమాణం పెరిగేకొద్దీ కిడ్నీ దెబ్బతినే ప్రమాదం ఉంది. దీనిని నెఫ్రోటిక్ సిండ్రోమ్ యొక్క లక్షణం అని కూడా పిలుస్తారు. మీకు ఇలాంటి అనుభవం ఉంటే, వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

3 / 5
కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే మూత్రంలో నురుగు ఏర్పడటం ప్రారంభమవుతుంది. అంతేకాకుండా మూత్రం రంగు కొద్దిగా ముదురుగా ఉంటుంది. వీటిల్లో ఏదైనా లక్షణం కనిపిస్తే, ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించడం మంచిది.

4 / 5
కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే అలసట పెరుగుతుంది. దురద, చాలా పొడి వంటి చర్మ లక్షణాలు కూడా కనిపిస్తాయి. అంతేకాకుండా, అధిక రక్తపోటు కూడా ఉంటుంది. కళ్లపై పసుపు రంగు మచ్చలు కనిపిస్తే అది అధిక కొలెస్ట్రాల్ లక్షణంగా అనుమానించాలి. అందుకే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని తనిఖీ చేయడానికి లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష రెగ్యులర్‌గా చేయించుకోవాలి. ఇది రక్తంలో కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్, అధిక సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ (HDL), తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ (LDL) మొత్తాన్ని తనిఖీ చేసే రక్త పరీక్ష.

5 / 5
Follow us