Cleaning Tips: వాటర్ బాటిల్స్‌ను ఇలా క్లీన్ చేస్తే మురికి అంతా పోతుంది..

| Edited By: Ram Naramaneni

Jul 21, 2024 | 7:44 PM

నీటిని తరచూ తాగుతూ ఉండాలి కాబట్టి చాలా మంది వాటర్ బాటిల్స్‌ను ఉపయోగిస్తూ ఉంటారు. బయటకు ఎక్కడికి వెళ్లాలన్నా కూడా వాటర్ బాటిల్స్ యూజ్ చేస్తాం. ఇలా నీటిని తాగడం మంచిదే అయినా.. వాటర్ బాటిల్స్ క్లీన్ చేయడం కూడా చాలా ముఖ్యం. ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి. ఏదో పైపైన క్లీన్ చేస్తే సరిపోదు. రోజంతా నీటిని అందులో ఉంచుతాం కాబట్టి జాగ్రత్తగా శుభ్రం చేసుకోవాలి. చాలా మంది వాటర్ బాటిల్స్ క్లీన్ చేసే సమయంలో తప్పులు చేస్తూ..

Cleaning Tips: వాటర్ బాటిల్స్‌ను ఇలా క్లీన్ చేస్తే మురికి అంతా పోతుంది..
Cleaning Tips
Follow us on

నీటిని తరచూ తాగుతూ ఉండాలి కాబట్టి చాలా మంది వాటర్ బాటిల్స్‌ను ఉపయోగిస్తూ ఉంటారు. బయటకు ఎక్కడికి వెళ్లాలన్నా కూడా వాటర్ బాటిల్స్ యూజ్ చేస్తాం. ఇలా నీటిని తాగడం మంచిదే అయినా.. వాటర్ బాటిల్స్ క్లీన్ చేయడం కూడా చాలా ముఖ్యం. ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి. ఏదో పైపైన క్లీన్ చేస్తే సరిపోదు. రోజంతా నీటిని అందులో ఉంచుతాం కాబట్టి జాగ్రత్తగా శుభ్రం చేసుకోవాలి. చాలా మంది వాటర్ బాటిల్స్ క్లీన్ చేసే సమయంలో తప్పులు చేస్తూ ఉంటారు. ఇప్పుడు చెప్పే చిట్కాలను ఉపయోగించి వాటర్ బాటిల్స్ క్లీన్ చేస్తే బ్యాక్టీరియా, సూక్ష్మ క్రిములు కూడా రాకుండా ఉంటాయి.

ఉప్పు – పసుపు:

ఒక గిన్నెలో కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసి కలపాలి. వీటిని బాటిల్స్‌లో వేసి కొద్దిగా నీరు పోసి మిక్స్ చేసి పొడవైన బ్రష్‌తో స్క్రబ్ చేయాలి. ఇప్పుడు షేక్ చేసి గోరు వెచ్చటి నీటితో చక్కగా క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల బాటిల్స్‌కి సూక్మ క్రిములు అనేవి చేరకుండా ఉంటాయి.

నిమ్మరసం – ఉప్పు:

నిమ్మరసం, ఉప్పు కలిపిన మిశ్రమాన్ని వాటర్ బాటిల్స్‌లో వేసి బ్రష్‌తో స్క్రబ్ చేయాలి. ఆ తర్వాత కొద్దిగా గోరు వెచ్చటి నీరు పోసి షేక్ చేయాలి. ఆ తర్వాత బాటిల్స్‌ను సాధారణ వాటర్‌తో క్లీన్ చేయాలి.

ఇవి కూడా చదవండి

బేకింగ్ సోడా:

బేకింగ్ సోడాతో కూడా వాటర్ బాటిల్స్ క్లీన్ చేసుకోవచ్చు. వాటర్‌ బాటిల్‌లో కొద్దిగా బేకింగ్ సోడా, కొద్దిగా గోరు వెచ్చటి నీరు వేసి పొడవైన బ్రష్‌తో బాటిల్ రుద్దాలి. ఆ తర్వాత ఇంకొంచెం నీళ్లు వేసి షేక్ చేయాలి. ఆ తర్వాత గోరు వెచ్చటి నీటితో శుభ్రం చేయాలి.

వైట్ వెనిగర్:

వైట్ వెనిగర్‌తో కూడా వాటర్ బాటిల్స్ శుభ్ర పరచుకోవచ్చు. వీటితో క్లీన్ చేసినా మురికి, సూక్ష్మ క్రీములు నశిస్తాయి. వైట్ వెనిగర్ బాటిల్స్‌లో వేసి బ్రష్‌తో రుద్దాలి. ఇలా రుద్దిన తర్వాత ఓ పది నిమిషాలు పక్కన పెట్టి.. గోరు వెచ్చటి నీటితో క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మురికి చక్కగా వదులుతుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..