Cleaning Hack: సిల్క్ చీరపై నూనె మరకలను ఇలా ఈజీగా తొలగించుకోవచ్చు.. మళ్ళి కొత్తగా మారిపోతాయి.. ఎలా అంటే..
కానీ చాలా సార్లు, పార్టీలో ఆహారం తింటున్నప్పుడు లేదా డ్రింక్స్ తాగేటప్పుడు.. ఏదో ఒకటి లేదా మరొకటి మీద పడతాయి. చీరలపై మరకలు పడితే అంత త్వరగా వదలిపెట్టవు. వీటిని ఈజీగా వదిలిపెట్టాలంటే చాలా మంది డ్రై క్లీనింగ్ సెంటర్‌కు పరుగులు పెడతారు. ఇలా కాకుండా మనమే డ్రై క్లీనింగ్ సెంటర్‌కు వెళ్లకుండానే ఇంట్లోనే పని పూర్తి చేసుకోవచ్చు. అయితే ముందు సిల్క్ చీరలను ఎలా వాష్ చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..
సిల్క్ చీరలు.. వాటి అందం, డిజైన్ చాలా ప్రత్యేకంగా ఉంటాయి. సిల్క్ చీరలను అన్ని సందర్భాల్లో కట్టుకోవడానికి అనుకూలంగా ఉంటాయి. సమయం, సందర్భం, పెళ్లి, పార్టీ, పూజ.. ఇలా ప్రత్యేక సందర్భం లేకుండా సిల్క్ చీరలను ధరిస్తుంటారు. ఎందుకంటే ఇది చాలా అందంగా, చాలా లైట్ వెయిట్‌తో ఉండటం ఈ చీర ప్రత్యేకత. కానీ చాలా సార్లు, పార్టీలో ఆహారం తింటున్నప్పుడు లేదా డ్రింక్స్ తాగేటప్పుడు.. ఏదో ఒకటి లేదా మరొకటి మీద పడతాయి.
దీని వల్ల చీరపై మరకలు ఏర్పడుతాయి. ఈ మరకలు చీర అందాన్ని పాడుచేయడమే కాకుండా ఖరీదైన చీరను కూడా పాడు చేస్తాయి. సిల్క్ చీర నుంచి మరకలు పోవాలంటే.. మహిళలు డ్రై క్లీనింగ్ కోసం పంపుతారు. కానీ మీరు దీన్ని ఇంట్లో శుభ్రం చేయాలనుకుంటే.. కొన్ని సులభమైన చిట్కాలతో మీరు ఈ మరకలను సులభంగా వదిలించుకోవచ్చు, మీకు ఇష్టమైన చీరను మళ్లీ అందంగా మార్చుకోవచ్చు. కొత్తగా చేసుకోవచ్చు. ఇంట్లోనే చీరపై ఉన్న మరకలను ఎలా సులభంగా తొలగించుకోవచ్చు.
గ్లిజరిన్..
ముందుగా ఒక బకెట్ తీసుకుని అందులో నీళ్లు కలపండి. అప్పుడు ఒక చెంచా డిటర్జెంట్, 2 స్పూన్ల గ్లిజరిన్‌తో కలిపి మిక్స్ చేయండి.. ఆ తర్వాత చీరలో చిన్న భాగానికి వేసుకుని చీర రంగు బయటకు వస్తోందో లేదో చూసుకోండి.. రంగు రాకపోతే చీర మొత్తం ఈ ద్రావణంలో వేసి కాసేపు నానబెట్టండి. తర్వాత చల్లటి నీళ్లతో ఉతకండి.. కానీ ఎక్కువగా రుద్దకూడదు. ఉతికిన తర్వాత పూర్తిగా ఆరబెట్టండి. చివరగా ఐరన్ (ఇస్త్రీ ) చేయండి. ఇలా చేస్తే పట్టు చీరపై ఉన్న మరకలు సులువుగా తొలగిపోతాయి.
బేకింగ్..
బేకింగ్ సోడా మరకలను తొలగించడానికి ఒక గొప్ప ప్రయత్నం అని చెప్పవచ్చు. 2 చెంచాల బేకింగ్ సోడా తీసుకుని.. దానికి కొంచెం నీరు పోసి పేస్ట్‌ను రెడీ చేసుకోండి. పేస్ట్ సులభంగా అప్లై చేయండి. ఇప్పుడు ఈ పేస్ట్‌ను బ్రష్ సహాయంతో చీరపై ఉన్న మరకపై అప్లై చేయండి. సుమారు 10-15 నిమిషాల పాటు ఇలాగే వదిలేయండి. తద్వారా పేస్ట్ మరకపై సరిగ్గా అప్లై చేయండి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో చీరను బాగా ఉతకాలి. ఆ తర్వాత చీరను ఆరబెట్టాలి.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి