Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chicken Or Fish: చికెన్ లేదా చేపలు..! ఏది ఆరోగ్యానికి మంచిది..?

ఆహారంలో చికెన్, చేపలు ముఖ్యమైనవి. రెండింటిలోనూ ప్రోటీన్ సమృద్ధిగా ఉంటుంది. చికెన్ తింటే శరీర పెరుగుదల, శక్తి పెరుగుతుంది. ఇందులో ఐరన్, జింక్, సెలీనియం ఎక్కువగా ఉంటాయి. అయితే బ్రాయిలర్ చికెన్ ఎక్కువగా తినకూడదు. చేపలలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, కాల్షియం, ఫాస్ఫరస్ ఎక్కువ.

Chicken Or Fish: చికెన్ లేదా చేపలు..! ఏది ఆరోగ్యానికి మంచిది..?
Chicken Fish
Follow us
Prashanthi V

|

Updated on: Feb 14, 2025 | 5:55 PM

మానవ జీవితంలో ఆహారం ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. శరీరానికి కావలసిన పోషకాలను అందించే ఆహార పదార్థాలను తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో అవసరం. మాంసాహారం ఆహారాలలో కూడా ప్రతి ఒక్కటి దాని సొంత స్వంత ప్రయోజనాలను కలిగి ఉంటాయి. మాంసాహారం ఆహారాలలో ఏది ఉత్తమమైనది అనే ప్రశ్న తరచుగా తలెత్తుతుంది. భిన్న రుచులు, పోషక విలువలు కలిగిన ఈ ఆహార పదార్థాలపై అభిప్రాయాలు వేరువేరుగా ఉంటాయి. చాలా మంది చికెన్, చేపలను ఇష్టంగా తింటారు. రెండింటిలోనూ ప్రోటీన్లు ఎక్కువ. కానీ ఏది తింటే ఆరోగ్యానికి మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.

చికెన్ ఆరోగ్య ప్రయోజనాలు

చికెన్‌లో ప్రోటీన్ ఎక్కువ. ఇది తింటే శరీరం పెరుగుతుంది, శక్తి వస్తుంది. డయాబెటిస్, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి చికెన్ మంచిది. కానీ ఎక్కువగా తినడం మంచిది కాదు. ముఖ్యంగా బ్రాయిలర్ చికెన్ ఎక్కువగా తింటే ఆరోగ్య సమస్యలు వస్తాయి. నాటుకోడి తింటే మంచిది. కోడి మాంసంలో విటమిన్ బి3, జింక్, సెలీనియం, ఐరన్‌లు ఎక్కువ.

చేపల ఆరోగ్య ప్రయోజనాలు

సీ ఫుడ్ చాలా ఆరోగ్యకరం. దీనిలో పోషకాలు ఎక్కువ. గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో చేపలు సహాయపడతాయి. దీనిలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, ప్రోటీన్, విటమిన్ ఎ ఎక్కువ. వారానికి రెండు సార్లు సీ ఫుడ్ తింటే ఆరోగ్యంగా ఉంటారు. సముద్ర చేపలు తింటే మెదడు పనితీరు మెరుగుపడుతుంది. కళ్ళు బాగా కనిపిస్తాయి. క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. చేపలు తింటే ఎముకల అరుగుదల తగ్గుతుంది. రాత్రి నిద్ర బాగా పడుతుంది.

చేప, చికెన్ ఏది మంచిది..?

చికెన్, చేప రెండింటిలోనూ వేర్వేరు పోషకాలు ఉంటాయి. రెండూ మన ఆరోగ్యానికి మంచివే. కాబట్టి ఈ రెండింటిలో ఏది ఉత్తమమైనది చెప్పడం కష్టం. చికెన్‌లో ఐరన్, జింక్, సెలీనియం ఎక్కువగా ఉంటాయి. చేపలలో కాల్షియం, ఫాస్ఫరస్, ఒమేగా-3లు ఎక్కువగా ఉంటాయి.

చికెన్, చేప రెండూ ప్రోటీన్ కు మంచి మూలాలు. కాబట్టి మీకు ఏ పోషకాలు ఎక్కువగా కావాలో వాటిని బట్టి ఆహారం తీసుకోవచ్చు. కానీ ఏది అయినా సరే ఎక్కువగా తినకూడదు.