Lips Color for Health: పెదాల రంగుతో శరీరంలోని అనారోగ్య సమస్యలను కనిపెట్టవచ్చా..
ఆరోగ్య విషయంలో ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే.. అవి శరీరంపై ఏదో ఒక రూపంలో సంకేతాలను తెలియజేస్తుంది. అందుకే ఎప్పుడూ ముందుగా శరీరాన్ని గమనిస్తూ ఉండాలి. ఏదైనా తేడాగా అనిపిస్తే వెంటనే ఆస్పత్రికి వెళ్లడం చాలా మంచిది. ముందుగానే గమనించడం వల్ల చిన్న సమస్యతోనే ఆగిపోతుంది. లేదంటే పెద్ద ప్రమాదానికి దారి తీయవచ్చు. ఇలా మీ పెదాలు ఎన్నో సీక్రెట్స్‌ని చెప్తాయి. కానీ వాటిని పెద్దగా ఎవరూ పట్టించుకోరు. మీ పెదాల రంగును బట్టి మీరు ఎలాంటి..

ఆరోగ్య విషయంలో ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే.. అవి శరీరంపై ఏదో ఒక రూపంలో సంకేతాలను తెలియజేస్తుంది. అందుకే ఎప్పుడూ ముందుగా శరీరాన్ని గమనిస్తూ ఉండాలి. ఏదైనా తేడాగా అనిపిస్తే వెంటనే ఆస్పత్రికి వెళ్లడం చాలా మంచిది. ముందుగానే గమనించడం వల్ల చిన్న సమస్యతోనే ఆగిపోతుంది. లేదంటే పెద్ద ప్రమాదానికి దారి తీయవచ్చు. ఇలా మీ పెదాలు ఎన్నో సీక్రెట్స్‌ని చెప్తాయి. కానీ వాటిని పెద్దగా ఎవరూ పట్టించుకోరు. మీ పెదాల రంగును బట్టి మీరు ఎలాంటి సమస్యతో బాధ పడుతున్నారో తెలుసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. పెదాలపై ఎరుపు, తెలుపు, నలుపు, నీలం రంగులను బట్టి మీ ఆరోగ్యం ఎలా ఉందో చెప్పొచ్చు.
తెల్లని పెదాలు:
పెదవుల రంగు తెల్లగా ఉంటే.. శరీరంలో రక్తం తగ్గిందని అర్థం చేసుకోవచ్చు. తెల్లని పెదాలు రక్త హీనత సమస్యకు సంకేతం. అంతేకాకుండా రక్తంలో బిలుర్బిన్ పరిమాణం కూడా పెరిగిందని అనుకోవచ్చు. కొన్ని సార్లు వైరల్ ఇన్ ఫెక్షన్ల వల్ల కూడా పెదాలు తెల్లగా కనిపిస్తాయి.
ఎర్రని పెదాలు:
చాలా మంది పెదవులు ఎర్రగా ఉండటాన్ని ఇష్ట పడతారు. పెదాలు ఎర్రగా ఉంటే చూడటానికి కూడా చాలా బావుంటుంది అనుకుంటారు. కానీ నిజానికి పెదవులు ఎరుపుగా ఉండటం వల్ల.. కాలేయానికి సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని నిపుణులు చెబుతున్నారు.
నీలి రంగు పెదవులు:
కొంత మందికి పెదవులు అనేవి నీలి రంగులో ఉంటాయి. ఇలా నీలి రంగులో పెదవులు ఉంటే.. శరీరంలో సరైన విధంగా ఆక్సిజన్ లెవల్స్ లేవని అర్థం చేసుకోవచ్చు. ఇది ఒక్కోసారి అత్యవసర పరిస్థితికి కూడా సంకేతం కావచ్చని నిపుణులు అంటున్నారు. అంతే కాకుండా నవజాత పిల్లలు పెదవులు నీలం రంగులో కనిపిస్తే.. వారి ఊపిరి తిత్తులు సరిగా పని చేయడం లేదనడానికి సంకేతం కావచ్చు.
నల్లని పెదాలు:
సాధారణంగా బ్యూటీ ప్రాడెక్ట్స్‌ని ఎక్కువగా ఉపయోగించడం వల్ల పెదాలు నల్లగా మారతాయని చాలా మంది అనుకుంటారు. కానీ జీర్ణ సంబంధిత సమస్యలు ఉంటే పెదాలు నల్లగా కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. పెదాల రంగుతో పాటు మీ ఆరోగ్య విషయంలో ఇంకేమైన సమస్యలు ఉంటే వెంటనే వైద్యులను కలవడం మంచిది. ఈ విషయంలో సొంత వైద్యం పనికి రాదు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా నిపుణులను సంప్రదించడం మేలు.




