AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sleep: రాత్రి పడుకునే ముందు ఒక్క గ్లాస్ తాగితే చాలు.. నిమిషాల్లోని నిద్రలోకి జారుకుంటారు!

మారుతున్న లైఫ్‌స్టై్ల్, పని ఒత్తిడి, విపరీతమైన మొబైల్ వాడకం కారణంగా చాలా మంది అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. వాటిలో నిద్రలేమి కూడా ఒకటి. రాత్రి ఎక్కవ సేపు ఫోన్ చూడడం లేదా ఇతర కారణాల వల్ల చాలా మందికి త్వరగా నిద్ర పట్టదు. కానీ ఒక జ్యూస్ తాగడం వల్ల మీరు వీలైనంత త్వరగా నిద్రలోకి జారుకుంటారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ జ్యూస్ ఏంటో తెలుసుకుందాం.

Sleep: రాత్రి పడుకునే ముందు ఒక్క గ్లాస్ తాగితే చాలు.. నిమిషాల్లోని నిద్రలోకి జారుకుంటారు!
Drinking Tart Cherry Juice Before Bed
Anand T
|

Updated on: Sep 12, 2026 | 2:06 PM

Share

నేటి జీవనశైలిలో పని ఒత్తిడి కారణంగా చాలా మంది రాత్రి త్వరగా నిద్రపోలేక పోతున్నారు. పడుకున్నా మధ్యలో మెలుకువ రావడం, వంటి వాటి వల్ల క్వాలిటీ స్లీప్ పొందలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జీవనశైలితో పాటు ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల ఈజీగా ఈ సమస్యను అదిగమించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవును టార్ట్ చెర్రీ జ్యూస్ నిద్రలేమిని తగ్గించడంలో సహాయపడుతుందని కొన్ని అధ్యయనాలు కూడా చెబుతున్నాయి. ఇందులో సహజ మెలాటోనిన్‌తో పాటు నిద్రకు తోడ్పడే ముఖ్యమైన పోషకాలు ఉంటాయట.. పడుకోవడానికి 1-2 గంటల ముందు ఈ జ్యూస్ తాగితే నిద్ర త్వరగా పచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

నిద్రకు టార్ట్ చెర్రీ ఎలా సహాయపడుతుంది?

ఈ పండ్లలో మన స్లీప్ సైకిల్‌ను నియంత్రించే మెలాటోనిన్ హార్మోన్ సహజంగా లభిస్తుంది. అలాగే ఇందులో ఉండే ట్రిప్టోఫాన్, మెగ్నీషియం మెదడును ప్రశాంతపరిచి నాణ్యమైన నిద్రకు తోడ్పడతాయి. అంతేకాకుండా ఈ జ్యూస్‌లో ఉండే పాలీఫెనాల్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు శరీరంలో మంట తగ్గించి, నిద్ర నాణ్యతను పెంచుతాయి.

ఏ చెర్రీ మంచిది?

అయితే ఇందులో మనకు రెండు రకాల చెర్రీల అందుబాటులో ఉన్నాయి. వాటిలో స్వీట్ చెర్రీ కంటే మాంట్‌మోరెన్సీ రకానికి చెందిన పుల్లటి టార్ట్ చెర్రీల్లోనే నిద్రకు తోల్పడే మెలాటోనిన్, యాంటీఆక్సిడెంట్లు అధిక మొత్తంలో ఉంటాయని అద్యయానాల్లో తేలింది. కాబట్టి మీరు నిద్రలేమితో బాధపడుతుందటే.. ఎల్లపుప్పుడూ పుల్లటి టార్ట్ చెర్రీలనే తీసుకోండి.

ఎప్పుడు, ఎలా తీసుకోవాలి?

అయితే వీటిని రాత్రి పడుకోవడానికి 1 నుండి 2 గంటల ముందు ఒక చిన్న గ్లాసు జ్యూస్‌గా చేసుకొని తాగడం మంచిది. మరో విషయం ఈ జ్యూస్‌లో మీరు ఎలాంటి చక్కెర కలుపుకోవద్దు. రా జ్యూస్‌ నే తాగండి. అయితే కేవలం ఈ జ్యూస్ మాత్రమే మీ నిద్ర నాణ్యతను పెంచదు. దీనితో పాటు ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, మేల్కొనడం అలవాటు చేసుకోవాలి. సాయంత్రం వేళల్లో టీ, కాఫీ వంటి కెఫిన్ పదార్థాలకు దూరంగా ఉండాలి. నిద్రించే ముందు మొబైల్, టీవీ స్క్రీన్లకు పక్కన పెట్టడం వల్ల మీరు నాణ్యమైన నిద్రను పొందుతారు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us