AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sreesanth Father Death: టీమిండియా మాజీ పేసర్ ఇంట్లో తీవ్ర విషాదం.. తండ్రి కన్నుమూత

Sreesanth Father Death: టీమిండియా మాజీ పేసర్ శ్రీశాంత్ తండ్రి వి.శాంతకుమారన్ నాయర్ (89) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కోచిలోని లిసీ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. విదేశాల్లో ఉన్న కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాత భౌతికకాయాన్ని కొత్తమంగళంలోని నివాసానికి తరలించనున్నారు.

Sreesanth Father Death: టీమిండియా మాజీ పేసర్ ఇంట్లో తీవ్ర విషాదం.. తండ్రి కన్నుమూత
Sreesanth Father
Rakesh
|

Updated on: Sep 12, 2026 | 1:30 PM

Share

Sreesanth Father Death: టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ ఎస్.శ్రీశాంత్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి వి.శాంతకుమారన్ నాయర్ (89) శుక్రవారం రాత్రి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన లిసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ వార్తతో క్రికెట్ ప్రపంచం తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయింది. రాత్రి సమయంలో కోచిలోని ప్రముఖ లిసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శాంతకుమారన్ నాయర్ తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. 89 సంవత్సరాల వయసున్న ఆయన వయోభారంతో పాటు కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆయన మృతి విషయాన్ని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) రిటైర్డ్ రీజనల్ మేనేజర్‌గా పనిచేసిన ఆయన సహచరులు, కుటుంబ సభ్యులు మీడియాకు వెల్లడించారు.

విదేశాల నుంచి రానున్న కుటుంబ సభ్యులు

ప్రస్తుతం శాంతకుమారన్ నాయర్ భౌతిక కాయాన్ని ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు. శ్రీశాంత్ కుటుంబ సభ్యులు కొందరు ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు. వారు స్వదేశానికి చేరుకున్న తర్వాత భౌతిక కాయాన్ని తమ సొంత ఊరైన కొత్తమంగళం నివాసానికి తరలించనున్నారు. శనివారం బంధువుల రాక పూర్తయిన తర్వాత ఆఖరి చూపు కోసం ఏర్పాట్లు చేయనున్నారు.

ఆదివారం అంత్యక్రియలు

శాంతకుమారన్ నాయర్ భౌతికకాయాన్ని ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అభిమానులు, బంధువుల సందర్శనార్థం నివాసంలో ఉంచనున్నారు. ఆ తర్వాత సాయంత్రం 4 గంటల సమయంలో సొంత గ్రామంలో అధికారికంగా అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబీకులు స్పష్టం చేశారు. ఆయన మృతికి పలువురు మాజీ క్రికెటర్లు, ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.

భారత క్రికెట్‌లో శ్రీశాంత్ సుదీర్ఘ ప్రస్థానం

43 ఏళ్ల ఎస్ శ్రీశాంత్ 2022లో అన్ని రకాల క్రికెట్ ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. భారత్ తరఫున 27 టెస్టులు, 53 వన్డేలు, 10 టీ20 మ్యాచ్‌లు ఆడిన ఆయన వరుసగా 87, 75, 7 వికెట్లు పడగొట్టారు. 2007 టీ20 ప్రపంచకప్‌తో పాటు 2011 వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో ఆయన కీలక సభ్యుడిగా ఉన్నారు. ఐపీఎల్ ఫిక్సింగ్ ఆరోపణల నుంచి 2015లో కోర్టు నిర్దోషిగా విడుదల చేసినప్పటికీ, అంతర్జాతీయ మైదానంలో మళ్లీ రీఎంట్రీ చేయలేకపోయారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
టీమిండియా మాజీ పేసర్ ఇంట్లో తీవ్ర విషాదం
టీమిండియా మాజీ పేసర్ ఇంట్లో తీవ్ర విషాదం
90's కుర్రాళ్లు మళ్లీ మళ్లీ పాడుకుంటున్న సాంగ్..
90's కుర్రాళ్లు మళ్లీ మళ్లీ పాడుకుంటున్న సాంగ్..
గణేష్ చతుర్థి రోజున చంద్రుడిని చూస్తే అశుభమా? శ్రీకృష్ణుడికే..
గణేష్ చతుర్థి రోజున చంద్రుడిని చూస్తే అశుభమా? శ్రీకృష్ణుడికే..
తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన.. ఈ జిల్లాల్లోనే..
తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన.. ఈ జిల్లాల్లోనే..
ఒకే ఒక్క స్పూన్ తాగితే.. యూరినరీ ఇన్ఫెక్షన్ దెబ్బకు పరార్
ఒకే ఒక్క స్పూన్ తాగితే.. యూరినరీ ఇన్ఫెక్షన్ దెబ్బకు పరార్
ఢిల్లీలో మెరిసిన రష్యా, చైనా అధ్యక్షుల బుల్లెట్‌ప్రూఫ్ కార్లు
ఢిల్లీలో మెరిసిన రష్యా, చైనా అధ్యక్షుల బుల్లెట్‌ప్రూఫ్ కార్లు
ఒకే ఇన్నింగ్స్‌లో ఎక్కువ సిక్స్‌లు కొట్టిన బ్యాటర్లు వీరే
ఒకే ఇన్నింగ్స్‌లో ఎక్కువ సిక్స్‌లు కొట్టిన బ్యాటర్లు వీరే
బిగ్ బాస్‏లోకి ఆ సీరియల్ హీరోయిన్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ..
బిగ్ బాస్‏లోకి ఆ సీరియల్ హీరోయిన్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ..
వచ్చే వారంలో బ్యాంక్ సెలవులు ఇవే.. మొత్తం ఎన్ని రోజులంటే..?
వచ్చే వారంలో బ్యాంక్ సెలవులు ఇవే.. మొత్తం ఎన్ని రోజులంటే..?
నెలసరి వస్తే మైల గుడిసెలకే.. శతాబ్దాలుగా కొనసాగుతున్న వింత ఆచారం
నెలసరి వస్తే మైల గుడిసెలకే.. శతాబ్దాలుగా కొనసాగుతున్న వింత ఆచారం