తెలంగాణ సీఐడీ కానిస్టేబుల్ అరుణ్ కుమార్ ప్రేమ పేరుతో ఇద్దరు యువతులను మోసం చేసి అరెస్టయ్యాడు. పదేళ్లుగా ప్రేమించిన యువతికి తెలియకుండా మరో యువతిని రహస్యంగా పెళ్లాడటంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ప్రియురాలు, భార్య ఫిర్యాదులతో పోలీసులు అరుణ్ కుమార్ను రిమాండ్కు తరలించారు.