అమలాపురంలో జరిగిన జనసేన స్థానిక సంస్థల ఎన్నికల ఇంచార్జుల సమావేశంలో డేగల నాగేంద్ర భారీ బంగారు ఆభరణాలతో అందరి దృష్టిని ఆకర్షించారు. తనకు బంగారం అంటే ఎంతో ఇష్టమని చెబుతూనే, రాబోయే ఎన్నికల్లో జనసేన అభ్యర్థుల విజయానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. రామచంద్రపురంలో జనసేన సభ్యత్వాలను అత్యధికంగా నమోదు చేయించానని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు.