ఖైరతాబాద్ గణేష్ దర్శనానికి వెళ్లే భక్తులకు ట్రాఫిక్ పోలీసులు పలు సూచనలు చేశారు. సెప్టెంబర్ 12 నుండి 24 వరకు ఉదయం 11 గంటల నుంచి రాత్రి రద్దీ తగ్గేంత వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. పలు రూట్లలో వాహనాల మళ్లింపు, పార్కింగ్ ప్రదేశాలు కేటాయించారు. అత్యవసర సహాయం కోసం హెల్ప్‌లైన్ నంబర్ 9010203626ను సంప్రదించవచ్చు.