పల్లీలను ఉడకబెట్టి తింటే ఎంత మంచిదో తెలుసా?

samatha

11 september 2026

Pic credit - Pinterest

పల్లీలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వీటిని పేదవారి బాదం పలుకులు అని కూడా అంటారు.

అయితే పల్లీలలో ఫైబర్, మినరల్స్, విటమిన్స్ అధికంగా ఉండటం వలన చాలా మంది వీటిని నానబెట్టి లేదా, వేయించి తింటుంటారు.

కానీ పల్లీలను ఉడకబెట్టి తినడం వలన బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అవి ఏవో చూసేద్దాం.

వేయించిన పల్లీల కంటే ఉడకబెట్టిన పల్లీలలో యాంటీ ఆక్సిడెంట్లు 4 రెట్లు ఎక్కువగా ఉంటాయంట. అందువలన వీటిని తినడం వలన ఇవి క్యాన్సర్ రాకుండా కాపాడతాయి.

అలాగే, ఉడకబెట్టిన పల్లీలను ప్రతి రోజూ తినడం వలన ఇవి గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. గుండె ఆరోగ్యానికి ఇవి చాల మంచివి.

రోజూ గుప్పెడు పల్లీలు తింటే చాలు, ఇవి బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడతాయి. ఇందులో ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల చాలా సేపు ఆకలి వేయకుండా ఉండి, త్వరగా బరువు తగ్గుతారు.

అలాగే ప్రతి రోజూ గుప్పెడు  ఉడకబెట్టిన పల్లీలు తింటే మలబద్ధకం పోయి జీర్ణక్రియ సాఫీగా, సూపర్ ఫాస్ట్‌గా జరుగుతుందంట. కడుపు సమస్యలు తగ్గిపోతాయి.