Beauty Tips: వేసవిలో కలబంద, ఆలుగడ్డ ఫేస్‎ప్యాక్స్‎తో కాంతివంతమైన స్కిన్ మీ సొంతం

| Edited By: Ravi Kiran

Jun 02, 2023 | 9:15 AM

ఈ సింపుల్ ఆయుర్వేద హోం రెమెడీ మీ ముఖ సౌందర్యాన్ని పెంచుతుంది. ఇది మీ చర్మాన్ని మృదువుగా మార్చడమే కాకుండా స్కిన్ టోన్‌ని మెరుగుపరుస్తుంది.

Beauty Tips: వేసవిలో కలబంద, ఆలుగడ్డ ఫేస్‎ప్యాక్స్‎తో  కాంతివంతమైన స్కిన్ మీ సొంతం
Beauty Tips
Follow us on

అలోవెరా విటమిన్ ఎ, సి, ఇలకు మంచి మూలం. కానీ, బంగాళదుంప రసంలో ఐరన్, విటమిన్ సి, ఫాస్పరస్, పొటాషియం ఉంటాయి. కలబంద, బంగాళదుంప రెండూ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వాటి రసాన్ని ముఖానికి రాసుకుంటే మీ ముఖ సౌందర్యం పెరుగుతుంది.

కంటి నల్లటి వలయాలను తొలగిస్తుంది:

కళ్ల చుట్టూ ఉన్న నల్లటి వలయాలను పోగొట్టడానికి కలబంద, బంగాళదుంప రసాన్ని కలిపి రాసుకోవచ్చు. బంగాళదుంప రసంలో రిబోఫ్లావిన్, బి విటమిన్లు ఉంటాయి. ఇవి మచ్చలను తొలగించి, స్కిన్ టోన్‌ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.

ఇవి కూడా చదవండి

వృద్ధాప్య సంకేతాలను తొలగిస్తుంది:

మరీ ముసలితనం రాకపోయినా కొన్నిసార్లు ముఖంపై ముడతలు, చక్కటి గీతలు రావడం మొదలవుతాయి. వీటిని వదిలించుకోవడానికి మీరు కలబంద, బంగాళాదుంప రసాన్ని మిక్స్ చేసి మీ ముఖానికి రాసుకోవచ్చు. చర్మాన్ని మృదువుగా మార్చుతుంది.

వడదెబ్బను నయం చేస్తుంది:

వేసవిలో ముఖం లేదా చర్మంపై సూర్యరశ్మి ఉంటే, సన్టాన్, సన్బర్న్ ఏర్పడతాయి. వడదెబ్బ తగిలిన ప్రదేశంలో చర్మం రంగు మారిపోతుంది. ఇలాంటప్పుడు మీరు కలబంద, బంగాళదుంప రసాన్ని మిక్స్ చేసి ఆ ప్రాంతంలో అప్లై చేయవచ్చు. కలబందలో శీతలీకరణ గుణాలు ఉన్నాయి, ఇవి వడదెబ్బను నయం చేస్తాయి. అలోవెరా చర్మంలో తేమను కాపాడుతుంది. కలబంద, బంగాళదుంప రసాన్ని రోజూ ముఖానికి రాసుకుంటే వడదెబ్బ నుండి ముఖం కాపాడుతుంది.

పిగ్మెంటేషన్‌ని తగ్గిస్తుంది:

బంగాళదుంపలలో అజెలైక్ యాసిడ్ సమ్మేళనాలు ఉంటాయి. ఇది ముఖంపై ఉన్న డార్క్ స్పాట్స్ ని తేలిక పరచడంలో సహాయపడుతుంది. ఇది మొటిమల మచ్చలను కూడా తొలగిస్తుంది. కలబంద బంగాళదుంప రసాన్ని వారానికి 2 నుండి 3 సార్లు ముఖానికి రాసుకుంటే నల్ల మచ్చలు తగ్గుతాయి. కలబంద, బంగాళదుంప రసం కూడా హైపర్పిగ్మెంటేషన్‌ను తగ్గిస్తాయి.

చర్మాన్ని మృదువుగా మార్చుతుంది:

కలబంద, బంగాళాదుంప రసాన్ని ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మం తేమగా ఉంటుంది. కలబందలోని గుణాలు చర్మానికి తేమను అందిస్తాయి. దీనివల్ల చర్మం మృదువుగా తయారవుతుంది. దీన్ని ముఖానికి పట్టించి 20 నుంచి 30 నిమిషాల పాటు అలాగే ఉంచి తర్వాత చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం