AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Brain Hemorrhage: రోజురోజుకీ పెరుగుతున్న బ్రెయిన్ హెమరేజ్ కేసులు.. వ్యాధి ఏమిటి, లక్షణాలు, నివారణ తెలుసుకోండి

బ్రెయిన్ హెమరేజ్ కారణంగా ఆసుపత్రుల్లో చేరుతున్న రోగుల్లో యువత కూడా ఉన్నారు. ఈ రోగులలో కొందరికి అధిక రక్తపోటు కూడా ఉంది.  ఎక్కువ ఎండ వేడి, సూర్యరశ్మి, ఉష్ణోగ్రతలతో పాటు.. ఎండ వేడి నుంచి వచ్చి అకస్మాత్తుగా ఏసీలో కూర్చోవడం వల్ల బ్రెయిన్ హెమరేజ్ ప్రమాదాన్ని పెంచుతుంది. ఉష్ణోగ్రతలో ఆకస్మిక పెరుగుదల, తగ్గుదల కారణంగా మెదడులోని రక్త ప్రసరణను ప్రభావితం అవుతుంది.

Brain Hemorrhage: రోజురోజుకీ పెరుగుతున్న బ్రెయిన్ హెమరేజ్ కేసులు.. వ్యాధి ఏమిటి, లక్షణాలు, నివారణ తెలుసుకోండి
Brain Hemorrhage
Surya Kala
|

Updated on: Jun 13, 2024 | 7:47 PM

Share

ఏడాది ఏడాదికి దేశంలో ఎండ వేడి పెరిగిపోతూనే ఉంది. చాలా ప్రాంతాల్లో రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు ఎండ వేడితో పాటు వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రజలు అనేక రోగాల బారిన పడుతున్నారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో బ్రెయిన్ హెమరేజ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో డాక్టర్ కూడా అప్రమత్తమయ్యారు. ఢిల్లీలోని ఎయిమ్స్, సఫ్దర్‌జంగ్‌తో సహా అనేక ఆసుపత్రులలో బ్రెయిన్ హెమరేజ్ కేసులు నమోదయ్యాయి. సాధారణంగా వేసవిలో బ్రెయిన్ హెమరేజ్ కేసులు చాలా అరుదుగా నమోదవుతాయి. అయితే విపరీతమైన వేడి, ఉష్ణోగ్రతలో ఆకస్మిక మార్పుల వల్ల మెదడు రక్తస్రావం బారిన పడే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.

బ్రెయిన్ హెమరేజ్ కారణంగా ఆసుపత్రుల్లో చేరుతున్న రోగుల్లో యువత కూడా ఉన్నారు. ఈ రోగులలో కొందరికి అధిక రక్తపోటు కూడా ఉంది.  ఎక్కువ ఎండ వేడి, సూర్యరశ్మి, ఉష్ణోగ్రతలతో పాటు.. ఎండ వేడి నుంచి వచ్చి అకస్మాత్తుగా ఏసీలో కూర్చోవడం వల్ల బ్రెయిన్ హెమరేజ్ ప్రమాదాన్ని పెంచుతుంది. ఉష్ణోగ్రతలో ఆకస్మిక పెరుగుదల, తగ్గుదల కారణంగా మెదడులోని రక్త ప్రసరణను ప్రభావితం అవుతుంది. ఇది రక్తస్రావానికి దారితీస్తుంది. కొంతమంది బ్రెయిన్ హెమరేజ్ పేషెంట్లకు కూడా వెంటిలేటర్ కూడా పెట్టాల్సి వస్తుంది.

ఈ సమస్య ఎందుకు వస్తుందంటే?

సఫ్దర్‌జంగ్ ఆసుపత్రి సీనియర్ రెసిడెంట్ డాక్టర్ దీపక్ సుమన్ బయట వేడిగా ఉందని.. ఆఫీసుల్లో, ఇళ్లలో AC ల కింద కుర్చుని రిలాక్స్ అవుతున్నారు. ఇలాంటి సందర్భంలో శరీరం అకస్మాత్తుగా దాదాపు 50 డిగ్రీల ఉష్ణోగ్రత నుంచి 20 నుండి 25 డిగ్రీల వరకు చేరుకుంటుంది. అటువంటి పరిస్థితిలో మెదడు పనితీరు దెబ్బతింటుంది. ఉష్ణోగ్రతలో ఇటువంటి ఆకస్మిక మార్పులకు మెదడు సర్దుబాటు అవ్వదు. మెదడుకు తగినంత ఆక్సిజన్ అందదు. రక్తస్రావం జరుగుతుంది. ఆక్సిజన్ లేకపోవడం వల్ల మెదడులోని నరాలు దెబ్బతింటాయి. మెదడులోని నరాలు పగిలిపోతాయి. దీని కారణంగా మెదడులో రక్తస్రావం ప్రారంభమవుతుంది. రోగికి సకాలంలో చికిత్స అందించకపోతే, మరణం కూడా సంభవించవచ్చు.

ఇవి కూడా చదవండి

బ్రెయిన్ హెమరేజ్ లక్షణాలు ఏమిటి

ఆకస్మికంగా తీవ్రమైన తలనొప్పి

ముఖం తిమ్మిరి

మాట్లాడటానికి ఇబ్బంది

నడవడానికి ఇబ్బంది

ఎలా రక్షించుకోవాలంటే

హై బీపీ, పొగ తాగే అలవాటు లేదా ఏదైనా గుండె జబ్బుతో బాధపడేవారికి మెదడు రక్తస్రావం అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వారు ఈ సీజన్‌లో తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అంతేకాదు ఎండ నుంచి ఏసీ దగ్గరకు వెళ్లే ముందు తమ శరీర ఉష్ణోగ్రతను సాధారణీకరించుకోవాలి. సూర్యరశ్మి లేని, ఏసీ లేని ప్రదేశంలో ఉండండి. అలాంటి ప్రదేశంలో 5 నుంచి 10 నిమిషాల పాటు ఉండి.. శరీర ఉష్ణోగ్రతను సాధారణ స్థితికి చేరుకున్న తర్వాత మాత్రమే ఏసీ దగ్గరకు వెళ్లండి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..