Bhurmuni Waterfall: ఉత్తరాఖండ్‌లోని ఈ ప్రాంతం మినీ కాశ్మీర్.. ఇక్కడ అందాల జలపాతం చూడాలంటే రెండు కళ్ళు చాలవు..
ఉత్తరాఖండ్ సహజ సౌందర్యంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ అనేక సహజ దృశ్యాలు ఉన్నాయి. వీటి అందం మిమ్మల్ని మొదటి చూపులోనే ఆకర్షిస్తాయి. అందులో ఉత్తరాఖండ్‌లోని పితోరా గర్ జిల్లా ఒకటి. ఇక్కడ ఉన్న అందమైన కొండల కారణంగా దీనిని 'మినీ కాశ్మీర్' అని కూడా పిలుస్తారు. కరోనా వరకు రహస్యంగా దాగున్న సహజ జలపాతం కూడా ఇక్కడ ఉంది. ఈ జలపాతం గురించి ఈ రోజు తెలుసుకుందాం..

ఉత్తర భారతంలో ఢిల్లీకి సమీపంలో ఉన్న అనేక ప్రాంతాల్లో జూన్, జూలై నెలల్లో పర్యాటకుల రద్దీ ఉంటుంది. ఎంతగా పర్యాటకుల రద్దీ నెలకొంటుందంటే పర్వత ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. ఎందుకంటే ఎక్కువ మంది తన కుటుంబ సౌలభ్యం కోసం సొంత కార్లల్లో లేదా అద్దె వాహనాల్లో వెళ్లడానికి ఇష్టపడతారు. అటువంటి పరిస్థితిలో అధిక సంఖ్యలో వాహనాల కారణంగా, ట్రాఫిక్ జామ్ ప్రారంభమవుతుంది. అప్పుడు పర్యాటకుల సమయం కూడా వృధా అవుతుంది. అటువంటి పరిస్థితిలో ఉత్తరాఖండ్‌లోని ఒక ప్రదేశం గురించి తెలుసుకుందాం.. ఇక్కడ తక్కువ రద్దీ ఉంటుంది. దీంతో ఇక్కడ ప్రశాంతంగా ట్రిప్ ని ఎంజాయ్ చేస్తారు.
ఉత్తరాఖండ్ సహజ సౌందర్యంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ అనేక సహజ దృశ్యాలు ఉన్నాయి. వీటి అందం మిమ్మల్ని మొదటి చూపులోనే ఆకర్షిస్తాయి. అందులో ఉత్తరాఖండ్‌లోని పితోరా గర్ జిల్లా ఒకటి. ఇక్కడ ఉన్న అందమైన కొండల కారణంగా దీనిని ‘మినీ కాశ్మీర్’ అని కూడా పిలుస్తారు. కరోనా వరకు రహస్యంగా దాగున్న సహజ జలపాతం కూడా ఇక్కడ ఉంది. ఈ జలపాతం గురించి ఈ రోజు తెలుసుకుందాం..
ఉత్తరాఖండ్‌లోని పితోర్‌ఘర్ జిల్లా
ఈ జలపాతం ఉత్తరాఖండ్‌లోని పితోర్‌ఘర్ ప్రధాన కార్యాలయం నుంచి కేవలం 17 కిలోమీటర్ల దూరంలో ఉంది. కరోనా కాలానికంటే ముందు వరకూ ఈ జలపాతం గురించి పెద్దగా ప్రజలకు తెలియదు. కరోనా అనతరం ఈ జలపాతం ప్రజలలో బాగా ప్రాచుర్యం పొందింది. ఈ జలపాతం ప్రకృతి సౌందర్యానికి చక్కని ఉదాహరణ. ఈ జలపాతం చుట్టూ అన్ని వైపులా అడవులు ఉన్నాయి. దీని అందం మొదటి చూపులోనే మిమ్మల్ని ఆకర్షిస్తుంది.
View this post on Instagram
జలపాతం ఎలా వెలుగులోకి వచ్చిందంటే?
కరోనా కాలంలో చాలా మంది ప్రజలు నిరుద్యోగులుగా మారి తమ తమ గ్రామాలకు తిరిగి వెళ్లారు. భూర్ముని గ్రామంలోని యువకులు నగరం నుండి ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు ఈ జలపాతాన్ని కనుగొన్నారు. ఈ జలపాతాన్ని కనుగొన్న తర్వాత.. వారు ఒకరి సహాయంతో అక్కడికి చేరుకోవడానికి ఒక మార్గాన్ని కనుగొన్నారు. దీని తరువాత ప్రజలు ఈ ప్రకృతి దృశ్యం గురించి తెలుసుకున్నారు.
ఇక్కడికి చేరుకోవడం కొంచెం కష్టమే
ఇక్కడికి చేరుకోవాలంటే దాదాపు ఒక కిలోమీటరు నడవాల్సి ఉంటుంది. వర్షాకాలంలో భుర్ముని జలపాతం చూడదగినది. జూన్ నెలలో, ఎండ వేడి నుండి ఉపశమనం పొందడానికి చాలా మంది ప్రజలు ఇక్కడికి వస్తారు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








